అందరినీ మెప్పించేలా 'డార్లింగ్‌'.. ఆసక్తిగా ట్రైలర్‌ | Priyadarshi Darling Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

అందరినీ మెప్పించేలా 'డార్లింగ్‌'.. ఆసక్తిగా ట్రైలర్‌

Published Sun, Jul 7 2024 12:43 PM | Last Updated on Sun, Jul 7 2024 1:07 PM

Priyadarshi Darling Movie Trailer Out Now

ప్రియదర్శి, నభా నటేశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘డార్లింగ్‌’. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. హనుమాన్‌ సినిమా తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై  డార్లింగ్‌ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య విడుదల చేస్తున్నారు.

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రేమ కథతో 'డార్లింగ్‌' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీమతి చైతన్య తెలిపారు. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న యువ జంట కథతో వస్తున్నందున ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావించారు.

పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్‌ కోసం పారిస్‌కు వెళ్లాలని  ఏకైక లక్ష్యంతో హీరో ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు స్ల్పిట్‌ పర్సనాలిటీ అనే జబ్బు ఉందని తేలుతుంది. దీంతో ఆమె ఆపరిచితుడులోని విక్రమ్‌ మాదిరి పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని గురించి అసలు విషయం తెలియక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేదే డార్లింగ్‌ చిత్రంలో చూపించనున్నారు. నభా నటేశ్‌ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. జులై 19న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement