తెలుగు సినిమాలపై నాది వన్‌ సైడ్‌ లవ్‌ : డైరెక్టర్‌ అశ్విన్‌ రామ్‌ | Director Ashwin Ram Talks About Darling Movie | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాలపై నాది వన్‌ సైడ్‌ లవ్‌ : డైరెక్టర్‌ అశ్విన్‌ రామ్‌

Published Fri, Jul 12 2024 8:07 AM | Last Updated on Fri, Jul 12 2024 8:48 AM

Director Ashwin Ram Talks About Darling Movie

‘‘చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూసి ఎంజాయ్‌ చేస్తున్నాను. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ‘రాజా రాణి’కి దర్శకత్వ విభాగంలో చేశాను. దర్శకుడు మురుగదాస్‌ ప్రొడక్షన్‌లోని మూడు సినిమాల్లో భాగమయ్యాను. ధనుష్‌గారి సినిమాలకూ వర్క్‌ చేశాను. తమిళంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాను. తెలుగు సినిమాలపై నాది వన్‌ సైడ్‌ లవ్‌ (నవ్వుతూ). ఇప్పుడు తెలుగులో ‘డార్లింగ్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అశ్విన్‌ రామ్‌. 

ప్రియదర్శి, నభా నటేశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ‘డార్లింగ్‌’. ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మా ‘డార్లింగ్‌’ కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ మా సినిమాను చూసిన నలభైమంది ఈ కొత్తదనాన్నే ఫీలయ్యారు. ఈ సినిమా ట్రైలర్‌ చూసి నభా ΄ాత్రలో స్లి్పట్‌ పర్సనాలిటీ ఉంది కాబట్టి కొందరు ‘అపరిచితుడు’తో ΄ోల్చుతున్నారు. ‘డార్లింగ్‌’, ‘అపరిచితుడు’ సినిమాల మధ్య ఉన్న కామన్‌ ΄ాయింట్‌ స్లి్పట్‌ పర్సనాలిటీ మాత్రమే’’ అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement