మీడియాతో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి..
ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలకు వెళ్లామనడం అబద్ధం
ఉత్తరం వైపు తలుపులు బలంగా నెట్టడంతో తాళాలు పగిలి లోపలకు చొరబడ్డారు
వివేకా ఆస్తి పత్రాలను దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?
క్లూస్ టీమ్‌కు లభించిన ఐదు వేలి ముద్రలు ఎవరివి?
ఎన్నికల్లో లబ్ధి కే చంద్రబాబు, షర్మిల, సునీత పదేపదే ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కట్టుకథ పథకం ప్రకారమే తెరపైకి వచ్చిందని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆ కట్టుకథను నిజం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని, సీబీఐ సైతం ఆరోపణలకు తగిన ఆధారాలు సేకరించలేదన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం పదే పదే వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని చెప్పారు.
తన తండ్రి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకాను చంపినట్లు నేరం ఒప్పుకున్న దస్తగిరిని సీబీఐ విడిచిపెట్టడం వెనుక తిరకాసు ఉందన్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులో లోపాలపై సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముందస్తు బెయిల్ లభించాకే అప్రూవర్‌గా..
డ్రైవర్ దస్తగిరి 2021 ఆగస్టు 25న 161 సీఆర్‌పీసీ స్టేట్‌మెంట్ ఇవ్వగా ఆగస్టు 31న మేజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీని ప్రకారం దస్తగిరి స్వయంగా వివేకాను చంపినట్లు ఒప్పుకున్నాడని చైతన్యరెడ్డి గుర్తుచేశారు. అదే ఏడాది అక్టోబర్ 7న ముందస్తు బెయిల్ కోసం దస్తగిరి దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 22న మంజూరైంది. దస్తగిరి బెయిల్‌కు అటు సీబీఐ, ఇటు సునీత ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తయ్యేవరకు బెయిల్ లభించే అవకాశం లేదు కాబట్టి ముందస్తు బెయిల్ లభించిన తర్వాత దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ వ్యవహారం వెనుక డాక్టర్ నర్రెడ్డి సునీత, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్ ఉన్నారు.
అసలు విషయం అక్కడే ఉంది..
వివేకా హత్యకు గురైన ప్రదేశంలో క్లూస్ టీమ్‌కు లభించిన ఆధారాలు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. క్లూస్ టీమ్ ఫొటోల ప్రకారం తలుపుల సేఫ్టీ లాక్, టవర్ బోల్ట్ బద్ధలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దస్తగిరి మాత్రం తన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి లోపలి నుంచి తలుపు గడియ తీయడంతో తాము ఇంట్లోకి ప్రవేశించామని చెప్పాడు.
అది శుద్ధ అబద్ధం. నర్రెడ్డి సునీత దంపతులు తలుపుల లాక్‌లకు మరమ్మతులు చేయించారు. సేప్టీలాక్, టవర్ బోల్ట్ బద్దలైన విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లకుండా దాచి పెట్టారు. అక్కడే అసలు విషయం దాగి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వచ్చాÆý‡న్న విషయం బహిర్గతం అయితే దస్తగిరి కట్టుకథ తేలిపోతుందని జాగ్రత్త పడ్డారు. క్లూస్‌టీమ్ సేకరించిన ఐదు వేలి ముద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవి కాదు. అవి ఎవరివో ఇప్పటికీ సీబీఐ నిగ్గు తేల్చలేదు.
పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారే హత్య చేసినట్లు నాడు తేల్చారు. ఇంటి ఉత్తరం వైపు తలుపు నుంచి ముగ్గురు బయటికి వచ్చారని, కొద్ది సేపటికి బయటకు వచి్చన ఎర్రగంగిరెడ్డిని ఏమైందని అడగ్గా కోపంగా తోసేయడంతో కింద పడ్డానని ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పాడు. దస్తగిరి తూర్పు వైపు ఉన్న మెయిన్ డోర్ గుండా బయటికి వచి్చనట్లు చెబుతుండగా ప్రత్యక్షసాక్షి రంగన్న మాత్రం ఉత్తరం వైపు డోర్ నుంచి వచ్చారని చెబుతూ పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇచ్చారు.
గూగుల్ టేకౌట్ పేరిట దుష్ప్రచారం
వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇళ్ల మధ్య 300 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఒక వర్గం మీడియా హత్యకు ముందు నిందితులంతా వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తెలిసిందంటూ ప్రచారం చేసింది. గూగుల్ టేకౌట్‌కు ప్రామాణికత లేదని సీబీఐనే వెల్లడించింది.
ఆ అవసరం ఎవరికి ఉంది?
వివేకా హత్య అనంతరం రౌండ్ సీల్ ఉన్న దస్తావేజులు తీసుకెళ్లినట్లు దస్తగిరి చెబుతున్నాడు. రౌండ్ సీళ్లు ఉన్నాయంటే అవి నోటరీ అఫిడవిట్లు లేదా వీలునామా కావచ్చు. బెంగళూరు స్థలానికి చెందిన డాక్యుమెంట్లు అన్నది శుద్ధ అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలింది. వీలునామా దస్తావేజులు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీన్నిబట్టి వివేకా రెండో భార్య షమీమ్, వారసుడు షహెన్‌షా పేరుతో ఉన్న విల్లును దొంగిలించినట్లు తెలుస్తోంది. అసలు ఎర్ర గంగిరెడ్డి నేరస్తులతో కలిసి లేరని దర్యాప్తు ఆధారంగా రూఢీ అవుతోంది.
అంటే దస్తగిరి వాంగ్మూలం అంతా కట్టుకథేనని స్పష్టమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక నాటకమే. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని నా తండ్రి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి పేర్లను కేసులో చేర్చడం పథకంలో భాగమే. ఆ కట్టుకథ ఆధారంగా బాబు, షర్మిల, సునీత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు దర్యాప్తు అధికారిని తప్పించినా కింది స్థాయి సిబ్బందిని అలాగే కొనసాగించడంతో సీబీఐ అసలు హంతకులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై నిందలు మోపింది. సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment