dastagiri
-
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్‌కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్‌కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
మర్డర్ చేసిన దస్తగిరి అరెస్ట్ కాకపోవడానికి కారణం ఇదే..!
-
దస్తగిరితో చంద్రబాబే పిటిషన్ వేయించారు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, వైఎస్ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్‌ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవాదులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. వారివి సంబంధం లేని వాదనలు సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్‌కు బెయిల్ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కోర్టు అవినాశ్‌కు బెయిల్ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయస్థానం అవినాశ్‌కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్‌తో కలసి నడుస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూవర్‌ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెనుకేసుకుని వస్తోంది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమెతో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరలేదు. ఎవరు ఏ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతూ అవినాశ్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ ‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబిరం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు. జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తున్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్‌కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్తగిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్‌కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు. విచిత్రమేమిటంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లోనూ అవినాశ్ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
దస్తగిరి కుమ్మక్కు డ్రామాలు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కట్టుకథ పథకం ప్రకారమే తెరపైకి వచ్చిందని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆ కట్టుకథను నిజం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని, సీబీఐ సైతం ఆరోపణలకు తగిన ఆధారాలు సేకరించలేదన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం పదే పదే వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తన తండ్రి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకాను చంపినట్లు నేరం ఒప్పుకున్న దస్తగిరిని సీబీఐ విడిచిపెట్టడం వెనుక తిరకాసు ఉందన్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులో లోపాలపై సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ లభించాకే అప్రూవర్‌గా.. డ్రైవర్ దస్తగిరి 2021 ఆగస్టు 25న 161 సీఆర్పీసీ స్టేట్మెంట్ ఇవ్వగా ఆగస్టు 31న మేజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని ప్రకారం దస్తగిరి స్వయంగా వివేకాను చంపినట్లు ఒప్పుకున్నాడని చైతన్యరెడ్డి గుర్తుచేశారు. అదే ఏడాది అక్టోబర్ 7న ముందస్తు బెయిల్ కోసం దస్తగిరి దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 22న మంజూరైంది. దస్తగిరి బెయిల్‌కు అటు సీబీఐ, ఇటు సునీత ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తయ్యేవరకు బెయిల్ లభించే అవకాశం లేదు కాబట్టి ముందస్తు బెయిల్ లభించిన తర్వాత దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ వ్యవహారం వెనుక డాక్టర్ నర్రెడ్డి సునీత, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్ ఉన్నారు. అసలు విషయం అక్కడే ఉంది.. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో క్లూస్ టీమ్‌కు లభించిన ఆధారాలు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్మెంట్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. క్లూస్ టీమ్ ఫొటోల ప్రకారం తలుపుల సేఫ్టీ లాక్, టవర్ బోల్ట్ బద్ధలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దస్తగిరి మాత్రం తన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి లోపలి నుంచి తలుపు గడియ తీయడంతో తాము ఇంట్లోకి ప్రవేశించామని చెప్పాడు. అది శుద్ధ అబద్ధం. నర్రెడ్డి సునీత దంపతులు తలుపుల లాక్‌లకు మరమ్మతులు చేయించారు. సేప్టీలాక్, టవర్ బోల్ట్ బద్దలైన విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లకుండా దాచి పెట్టారు. అక్కడే అసలు విషయం దాగి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వచ్చాÆý‡న్న విషయం బహిర్గతం అయితే దస్తగిరి కట్టుకథ తేలిపోతుందని జాగ్రత్త పడ్డారు. క్లూస్‌టీమ్ సేకరించిన ఐదు వేలి ముద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవి కాదు. అవి ఎవరివో ఇప్పటికీ సీబీఐ నిగ్గు తేల్చలేదు. పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారే హత్య చేసినట్లు నాడు తేల్చారు. ఇంటి ఉత్తరం వైపు తలుపు నుంచి ముగ్గురు బయటికి వచ్చారని, కొద్ది సేపటికి బయటకు వచి్చన ఎర్రగంగిరెడ్డిని ఏమైందని అడగ్గా కోపంగా తోసేయడంతో కింద పడ్డానని ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పాడు. దస్తగిరి తూర్పు వైపు ఉన్న మెయిన్ డోర్ గుండా బయటికి వచి్చనట్లు చెబుతుండగా ప్రత్యక్షసాక్షి రంగన్న మాత్రం ఉత్తరం వైపు డోర్ నుంచి వచ్చారని చెబుతూ పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇచ్చారు. గూగుల్ టేకౌట్ పేరిట దుష్ప్రచారం వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇళ్ల మధ్య 300 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఒక వర్గం మీడియా హత్యకు ముందు నిందితులంతా వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తెలిసిందంటూ ప్రచారం చేసింది. గూగుల్ టేకౌట్‌కు ప్రామాణికత లేదని సీబీఐనే వెల్లడించింది. ఆ అవసరం ఎవరికి ఉంది? వివేకా హత్య అనంతరం రౌండ్ సీల్ ఉన్న దస్తావేజులు తీసుకెళ్లినట్లు దస్తగిరి చెబుతున్నాడు. రౌండ్ సీళ్లు ఉన్నాయంటే అవి నోటరీ అఫిడవిట్లు లేదా వీలునామా కావచ్చు. బెంగళూరు స్థలానికి చెందిన డాక్యుమెంట్లు అన్నది శుద్ధ అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలింది. వీలునామా దస్తావేజులు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీన్నిబట్టి వివేకా రెండో భార్య షమీమ్, వారసుడు షహెన్షా పేరుతో ఉన్న విల్లును దొంగిలించినట్లు తెలుస్తోంది. అసలు ఎర్ర గంగిరెడ్డి నేరస్తులతో కలిసి లేరని దర్యాప్తు ఆధారంగా రూఢీ అవుతోంది. అంటే దస్తగిరి వాంగ్మూలం అంతా కట్టుకథేనని స్పష్టమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక నాటకమే. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని నా తండ్రి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి పేర్లను కేసులో చేర్చడం పథకంలో భాగమే. ఆ కట్టుకథ ఆధారంగా బాబు, షర్మిల, సునీత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు దర్యాప్తు అధికారిని తప్పించినా కింది స్థాయి సిబ్బందిని అలాగే కొనసాగించడంతో సీబీఐ అసలు హంతకులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై నిందలు మోపింది. సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది. -
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
పోలీస్ స్టేషన్లో దస్తగిరి దాదాగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్‌నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్ఓను గానీ.. ఎస్ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే? -
దస్తగిరి కొత్త డ్రామా
-
దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పులివెందుల-కదిరి మార్గమధ్యంలో ఉన్న నామాల గుండు వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన కూలి పని చేసుకునే దళిత చిన్న కదిరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకదిరప్ప తన తండ్రి షేక్ హాజీవలీని చంపడానికి వచ్చాడంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కట్టుకథ అల్లాడు. దీన్ని ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండానే దస్తగిరి చెప్పిందే వేదం అన్నట్లుగా తెగ ప్రసారం చేసింది. వాస్తవమేంటో బాధితుడు చిన్న కదిరప్ప మాటల్లోనే.. ‘నాకు ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు నాగేశ్వరిని పులివెందులలోని బాకరాపేటకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. శుక్రవారం (8వ తేదీన) కూతురింటికి పోయి శనివారం మళ్లీ కదిరికి బయలుదేరాను. బస్సు కోసం పులివెందులలో రోడ్డు పక్కన నిలబడుకోంటే..మాకు బంధువైన తలుపుల మండలం శిద్దుగూరిపల్లికి చెందిన మల్లికార్జున బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఆపి బండిలో ఎక్కించుకున్నాడు. చార్జీ డబ్బులు మిగిలిపాయ.. అనుకొని ఎక్కాను. బండి స్పీడ్‌గా పోతూ నామాలగుండు దగ్గరకు రాగానే బ్రిడ్జి దగ్గర పొరపాటున ఫుట్‌పాత్‌కు తగిలింది. నేను కిందపడిపోయినా. అదే సమయంలో ఎదురుగా ఒకాయన వస్తుంటే ఆయనకు కూడా పొరపాటున బండి తగిలి కన్ను దగ్గర చిన్న గాయమైంది. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. కావాలనే బండి తగిలించారంటూ ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు. అక్కడ పడిపోయిన నా సెల్‌ఫోన్ తీసుకుంటుంటే దాన్ని కూడా లాక్కున్నాడు. నాకు తల నుంచి రక్తం కారిపోతుంటే అక్కడున్న స్థానికులు చూసి ఆయన దగ్గర నుంచి నా సెల్ ఇప్పించారు. అక్కడున్న వారిలో ఎవరో 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించి నన్ను తలుపుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కదిరి ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు’ అని చిన్న కదిరప్ప వివరించాడు. ‘మీరే ఆయన్ను చంపాలని ప్రయత్నించారంట..నిజమేనా?’ అని కదిరప్పను పాత్రికేయులు ఆసుపత్రిలో ప్రశ్నించగా.. ‘నాకు దెబ్బలు తగిలి ప్రాణం పోతుంటే వాడెవడో ఎందుకు అట్ల జెప్పినాడు?! దీంట్లో ఏందో రాజకీయం ఉంది. మేము కూలీనాలీ చేసుకునేటోళ్లం. మాకెందుకు నాయనా అట్లాంటివి’ అని అన్నాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన కదిరప్ప ఫిర్యాదు మేరకు పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే.. -
అండ చూసుకుని ఆగడాలు మితిమీరి పోతున్న దస్తగిరి
-
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్‌గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్‌లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే..
వైఎస్సార్, సాక్షి: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుకా పెద్ద కుట్ర దాగి ఉందని.. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడని అంటున్నారు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనయుడు డా.చైతన్యరెడ్డి. ఈ కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలపై.. దస్తగిరి చేసిన ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. దస్తగిరి ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పడం.. సునీత చెప్పడం.. దస్తగిరి ఆరోపణలు చేయడం. ఈ డ్రామాలు, కథలు ఇప్పటివి కాదు. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడు. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు. ఇదంతా మా నాన్న(శంకర్‌రెడ్డి) బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తుందనే చేస్తున్నారు. నా తండ్రిని చెయ్యని తప్పుకి రెండున్నరేళ్లు జైల్లో ఉంచారు. ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకే కట్టుకథలు అల్లుతున్నారు. ఒకవేళ వాళ్లు అనుకున్నట్లు బెయిల్ తిరస్కరణకు గురైతే.. మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఏమీ ఉండవు.. దస్తగిరి అప్రూవర్‌గా మారడంలోనూ కుట్ర దాగుంది. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతికామని దస్తగిరి చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైనా పారిపోవాలని చూస్తారుగానీ.. డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారా?. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా కిందపడి రక్తపు వాంతులతోనే వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. హత్య జరిగిన నాడు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్‌లో యాక్టీవ్‌గా ఉన్నారని అరోపిస్తున్నారు. అది ఎన్నికల టైం. ఒక ఎంపీగా ఆయనకు సవాలక్ష మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. మరి అంతకు ముందెప్పుడు ఆయన అలా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారో? లేదో? చూడండి. ఈ విషయాలన్నింటి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కూతురు సునీత ఎందుకు ప్రశ్నించరు?. ‘‘నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. అక్కడ ఉండేవాళ్ల ఆరోగ్య పరీక్షల నిమిత్తమే వెళ్లా. నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. పైగా జైల్లో ప్రతీ చోటా సీసీ కెమెరాలు ఉంటాయి. క్యాంపులో నాతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని కదా!. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. అని చైతన్య పశ్నించారు. -
కిడ్నాప్ కేసులో దస్తగిరి అరెస్ట్
ఎర్రగుంట్ల: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు ఓ కిడ్నాప్ కేసు వ్యవహారంలో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిపై కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు. వేర్వేరు కులాలకు చెందిన ఇమాంబీ, లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతోన్న సమయంలో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మీనారాయణతో కలిసి ఇమాంబీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి «విచారణ చేపట్టిన అనంతరం ఇమాంబీని సీఐ ఈశ్వరయ్య తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టారు. ఇమాంబీ వయసు 18, లక్ష్మీనారాయణ వయసు 21 కావడంతో ఇమాంబీని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇమాంబీ తల్లిదండ్రులు వద్దంటూ సుందరయ్య కాలనీలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇమాంబీ తల్లిదండ్రులు దస్తగిరి, మరికొందరితో కలసి ఈ నెల 30న లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న ఇమాంబీని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణను దస్తగిరి కులం పేరుతో దూషించాడు. అతడి వెంట ఉండే ఎస్కార్ట్ పోలీసులను ప్రొద్దుటూరుకు పోవాలంటూ తప్పుదోవ పట్టించి కడప వైపునకు బయలుదేరాడు. ఎస్కార్ట్ పోలీసులు యర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యకు సమాచారమిచ్చారు. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో దస్తగిరి వెళుతోన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో ఇమాంబీ ఉంది. ఘటనాస్థలికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఇమాంబీని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి, లక్ష్మీనారాయణను కులం పేరుతో దూషించినట్లు స్పష్టమైంది. దీంతో ఈ విషయంపై 2 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దస్తగిరి (పులివెందుల), ఎస్ ఇమ్రాన్ (వేముల) బాష, ఎస్ రమీజా(యర్రగుంట్ల), ఎస్.అశి్వన్(పులివెందుల), ఎస్ హైదర్బీ (తొండూరు)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
Viveka Case: సునీత బాధితురాలా? ఫిర్యాదుదారా? నిర్ణయించనున్న సుప్రీం
న్యూఢిల్లీ: వివేకా హత్య కేసులో సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు ఇవ్వాళ జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందుకు రాగా.. విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ఈ కేసులో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించాడు దస్తగిరి. తనకు ఆర్థిక స్థోమత లేనందున కోర్టు న్యాయ సాయానికి అడ్వొకేట్ ను కేటాయించాలని కోరాడు. అయితే, వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసిందే దస్తగిరి అయినప్పుడు.. అదే నిందితుడు.. బాధితుడు ఎలా అవుతాడని అడిగారు కృష్ణారెడ్డి. వివేకా హత్యపై అసలు ఫిర్యాదు చేసిందే తానని, అందరికంటే ముందు పోలీసులకు తానే ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ లో కోరారు. కేసులో తాను కూడా బాధితురాలినేనని, తాను ఇంప్లీడ్ అవుతానంటూ సునీత పిటిషన్ వేశారు. సునీత వాదనేంటీ? దస్తగిరి విషయంలో ఇంప్లిడ్ పిటిషన్ వేసిన సునీత రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని అడిగింది. దానికి తాను బాధితురాలిని అని, ఈ కేసుకు సంబంధించిన ఏ విషయంలో అయినా.. తనను బాధితురాలిగా చూడాలని సుప్రీంకోర్టుకు కోరింది సునీత. కేసుకు సంబంధించి అదనపు సమాచారం ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కేసును హైకోర్టుకు బదిలీ చేయడమే సబబని పేర్కొంది. ఇప్పటికే కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న తెలంగాణ హైకోర్టే పిటిషన్ విచారించడం సరైందని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక్కడే పిటిషన్ ను విచారించాలని పట్టుబట్టారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించిందంటూ లుథ్రా తెలిపారు. చివరికి ఏం జరిగింది? సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనల అనంతరం ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. -
దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి..
కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి చేస్తున్న అరాచకాలలో మరో సంఘటన పులివెందుల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు షేక్ గులాబి పులివెందుల అర్బన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘నేను నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల టౌన్ భాకరాపురం, జయమ్మకాలనీలో ఉంటున్నాం. నా భర్త ట్రాక్టర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు గూగుడు వల్లి(16), రేష్మా (15) సంతానం కాగా.. నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలసి ఉంటున్నాం. అయితే మా కుటుంబ అవసరాల నిమిత్తం మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ దస్తగిరి దగ్గర ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాం. పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చాము. తరువాత బాకీ డబ్బుకు వడ్డీగా వారానికి రూ. 4 వేలు చొప్పున దస్తగిరికి ఇస్తూ వస్తున్నాం. తర్వాత మధ్యలో కొన్ని వారాలు మేము వడ్డీ కట్టలేకపోయాం. దీంతో అసలుకు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించుకున్నాడు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 13న డబ్బు చెల్లిస్తామని చెప్పాం.. అయితే సర్దుబాటు కాక చెల్లించలేదు. ఈ క్రమంలో ఈ నెల 17న నేను, నా భర్తతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాం. 18వ తేదీ సాయంత్రం దస్తగిరి మాకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకుండా ఇంటి నుంచి పారిపోయారు.. మీ కుమారుడు గూగుడు వల్లిని నిర్బంధించాను. డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. లేకపోతే మీ కొడుకును కొడతాం.. అని బెదిరించాడు. నా కొడుకుతో ఫోన్లో మాట్లాడించాడు. ‘నన్ను దస్తగిరి కొడుతున్నాడు..’ అని మా కొడుకు బాధ పడుతున్నాడని.. పైగా దస్తగిరి భార్య షబానా కూడా ఫోన్ చేసి మీ కొడుకుకు ఇప్పటికే ఉదయం.. సాయంత్రం ఒక కోటింగ్ అయిపోందని.. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నీ కొడుకు మా చేతిలో చచ్చిపోతాడని బెదిరిస్తున్నారు. నా కుమారుడిని వారు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది సార్.. దస్తగిరి, అతని భార్య షబానాపై చర్యలు తీసుకుని, మా కుమారుడిని అప్పగించండి.. సార్.. అంటూ’ గులాబి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. -
వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని హాజరుపరిచారు. అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా -
దాదాగిరికి తెర లేపిన వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి
-
గన్మెన్లతో దస్తగిరి దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప/రైల్వేకోడూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి దర్జాగా సెటిల్మెంట్లకు తెగబడుతున్నాడు. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని పోలీస్ స్టేషన్ వద్దే దర్జాగా బహిరంగంగా బెదిరింపులకు దిగడం నివ్వెరపరుస్తోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. పోలీస్‌స్టేషన్ పక్కనే గన్మెన్లతో హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నా.. రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్‌కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్‌స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే ఆ మూడు షాపులు ఖాదర్‌వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి రంగప్రవేశం చేశాడు. డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలంటూ వీరంగం వేశాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి కార్యాలయంలో ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురు గన్మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు. అనంతరం పెద్ద మనుషుల సూచన మేరకు జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు. రైల్వేకోడూరుకు చెందిన ఖాదర్‌వలీ ఆ షాపులు తనవేనని ఏనాడూ ముందుకొచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మందు, ముక్క.. విలాస జీవితం వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి విలాస జీవితం గడుపుతూ తరచూ దందాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నాడు. కష్టపడితేనే పూట గడిచే స్థితి నుంచి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అతడిప్పుడు చుక్క, ముక్క లేకుండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఖరీదైన స్కాచ్ ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. ప్రైవేట్ పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయి. సెటిల్మెంట్లపై దృష్టి పెట్టాడు. ప్రాణరక్షణ పేరిట ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. పోలీస్ స్టేషన్లలోనే దాడులు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఏకంగా పోలీసు స్టేషన్లలోనే దౌర్జన్యాలు, దాడికి తెగబడుతున్నాడు. వైఎస్సార్ జిల్లా తొండూరులో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై పోలీసు స్టేషన్లోనే దస్తగిరి దాడి చేశాడు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 41/2022 కింద 2022 మే 29న కేసు నమోదైంది. అదే మండలంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల చౌర్యం కేసు కూడా 2022 ఆగస్టు 2న దస్తగిరిపై నమోదైంది. ♦ శ్రీకాళహస్తిలో దర్గా స్థలంపై 20 ఏళ్లుగా ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న వివాదంలో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఖాదర్‌బాషా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై క్రైమ్ నెంబర్ 121/2022 కేసు నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ దస్తగిరి అంటావేందీ..? బెయిల్‌పై ఉన్న నిందితుడు దస్తగిరి షరతులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. ‘‘హలో... నేను దస్తగిరిని మాట్లాడుతున్నా! ఏ దస్తగిరి అంటావేందీ..? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరిని’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడు. -
హంతకుడి దర్జాగిరి.. విస్తుగొలుపుతున్న షేక్ దస్తగిరి తీరు
సాక్షి ప్రతినిధి, కడప : ‘హలో.. నేను దస్తగిరిని మాట్లాడుతున్నా.. యా దస్తగిరి అంటావేందీ.. వివేకాను చంపిన దస్తగిరిని.. మీ దగ్గరకు వచ్చినోళ్లు మా వాళ్లు. చూసుకుని పోండి.. లేదంటే ఇబ్బంది పడతారు’ అంటూ ఇటీవల ఓ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో తిరిగింది. ఎవరైనా క్షణికావేశంలోనో, ఉద్దేశ పూర్వకంగానో ఎవరినైనా హత్య చేస్తే మూడో కంటికి తెలియకూడదనుకుంటారు. తెలిసినా గుట్టు చప్పుడు కాకుండా తల వంచుకుని వెళ్లి పోతుంటారు. అయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డిని తానే గొడ్డలితో నరికి చంపానని పదే పదే చెప్పిన, విచారణలో సీబీఐ ఎదుట ఒప్పుకున్న పులివెందులకు చెందిన షేక్ దస్తగిరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. చదువు ఒంటబట్టక పోవడంతో డ్రైవింగ్ నేర్చుకున్న ఇతగాడి ప్రస్తుత వయసు 25 ఏళ్లు. అప్పట్లో యాదాటి సునీల్ యాదవ్ ద్వారా వివేకానందరెడ్డి వద్ద చేరాడు. ఆర్థిక కారణాల రీత్యా సునీల్ యాదవ్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడ్డాడు. వివేకానందరెడ్డిని హత్య చేస్తే పెద్దఎత్తున డబ్బు వస్తుందని సునీల్‌యాదవ్ చెప్పడంతో అందుకు దస్తగిరి అంగీకరించాడు. ఇందులో భాగంగా 2019 మార్చి 14న కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేశాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత గజ్జెల ఉమాశంకరరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి ఎర్ర గంగిరెడ్డి సహకారంతో వివేకాను హత్య చేశారు. డ్రైవర్ స్థానంలోకి వచ్చిన నీరుగట్టు ప్రసాద్ తనను చంపుతున్నట్లు వివేకాతో డెత్‌నోట్ రాయించారు. ఇదంతా గొప్ప ఘన కార్యం అన్నట్లు చెబుతున్న దస్తగిరికి స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి తోడయ్యారు. పులివెందులకు చెందిన బీటెక్ రవి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుట్ర పన్ని, వివేకానందరెడ్డిని ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీటెక్ రవి నుంచి దస్తగిరికి ఆర్థికంగా మంచి తోడ్పాటు లభిస్తోంది. వీరిద్దరికీ వివేకా కూతురు, అల్లుడు తెరవెనుక నుంచి మద్దతు ఇస్తున్నారు. దీంతో దస్తగిరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. బెయిల్ రాగానే విలాసవంతమైన జీవనం వివేకా హత్యకు ముందు ఎప్పటికప్పుడు కష్టపడితేనే పూట గడిచే స్థితి దస్తగిరిది. వంద రూపాయల కోసం ఐదారుగురికి మెసేజ్‌లు పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు కాలు కదిపితే స్కార్పియో కారు. చుక్కా, ముక్కా లేనిదే భోజనం లేదు. ఖరీదైన స్కాచ్ వెంటే ఉంటుంది. ఖరీదైన దుస్తులు.. ఆహార్యం మారిపోయింది.. వెరసి దౌర్జన్యాలు, దందాలు. వివేకా హత్య తర్వాత డ్రైవర్ దస్తగిరి విలాసవంతమైన జీవనం ఆరంభించాడు. అప్పులు తీర్చేశాడు. ఖరీదైన స్కార్పియో వాహనానికి యజమాని అయ్యాడు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు. ఫోన్లలోనే ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్నాడు. ప్రాణరక్షణ నిమిత్తం ఎస్కార్టు కూడా వచ్చి చేరింది. ఇంటివద్ద బందోబస్తుగా పోలీసు పికెట్ సైతం ఏర్పాటైంది. వీటన్నింటితో రెచ్చిపోతున్నాడు. వైఎస్ వివేకా కేçసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కితే చాలు ఓ వైపు దస్తగిరి మీడియా సమావేశం.. మరోవైపు కోర్టులో డాక్టర్ సునీత ఇంప్లీడ్ పిటిషన్లు సమాంతరంగా తెరపైకి వస్తున్నాయి. తెరవెనుక మంత్రాంగం మేరకే గల్లీలో దస్తగిరి మీడియాతో మాట్లాడితే, సునీత కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నారు. దస్తగిరిలో చేసిన తప్పుకు ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు. హీరోయిజం ప్రదర్శించేలా మీడియా సమావేశాల్లో గంటల తరబడి వివేకా హత్య గురించి కథ చెప్పినట్లు చెబుతున్నాడు. ఏకంగా సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని పదే పదే ప్రకటిస్తూ తనో సెలబ్రిటీ అన్నట్లు చెలరేగిపోతున్నాడు. పై నుంచి ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ సూచనల మేరకు స్థానికంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నాడు. దాదాగిరి మామూలుగా లేదు.. తొండూరు పోలీసుస్టేషన్లో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే యువకుడిపై స్వయంగా దౌర్జన్యం చేశాడు. ఏఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్లు ఉండగా వారి సమక్షంలోనే చెలరేగిపోయాడు. ఓ చోరీ కేసులో ఇదే తొండూరు మండల ఎలక్ట్రికల్ అధికారులను బెదిరించాడు. శ్రీకాళహస్తిలో ఓ స్థల వివాదం సెటిల్మెంట్కు వెళ్లి ఓ వర్గం వారిని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ మేరకు అక్కడ కేసు కూడా నమోదైంది. యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్ తదితర వ్యవహారాల్లో తల దూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. టీడీపీ నేతలు దస్తగిరి భార్య షబానాకు బ్రీఫింగ్ ఇస్తే.. దస్తగిరి ఎల్లో మీడియాకు పాఠం అప్పజెప్పే పనిలో నిమగ్నమయ్యాడు. ఇందుకు ఫలితంగా బీటెక్ రవి నుంచి ఎప్పటికప్పుడు భారీగా డబ్బు అందుతోంది. లింగాల మండలానికి చెందిన నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల వాసి బీటెక్ రవి తెర వెనుక మంత్రాంగం ద్వారానే దస్తగిరి అప్రూవర్‌గా మారడం కొసమెరుపు. దస్తగిరికి టీడీపీ నుంచే ముప్పు తెర వెనుక నుంచి చిలక పలుకులు పలికిస్తున్న వారి నుంచే తనకు హాని కలిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి ప్రాణహాని తలపెడితే ప్రధానంగా లాభ పడేది టీడీపీనే. ఎందుకంటే.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వివేకా హత్యను కేస్ స్టడీగా తీసుకుని ప్రచారం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటువంటి వాటిలో ఆరితేరిన నేతలు టీడీపీలోనే ఉన్నారు. అందుకే పథకం ప్రకారం కిరాయి హంతకుడు దస్తగిరిని రెచ్చగొట్టి.. వైఎస్సార్సీపీ నేతలపైన, సీఎంపైన తీవ్ర ఆరోపణలు చేయిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. టీడీపీ వారే అతడిని అంతమొందించి ఆ నేరాన్ని వైఎస్సార్సీపీ నేతలపై వేసే కుట్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. -
వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే..
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డికి ఆయన ఇద్దరు బావమరుదులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి నుంచే ముప్పు ఉండేది. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం వారే ఆయనపై కక్షగట్టారు’.. అని వివేకానందరెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ స్పష్టంచేశారు. ‘వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు’ అని కూడా ఆమె తేల్చిచెప్పారు. ఈ హత్య కేసులో షమీమ్ 2020 అక్టోబరులోనే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డితో తన రెండో వివాహం.. దానిపై ఆయన కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఎంతగా విభేదించింది.. తనను ఎంతగా బెదిరించిందీ.. వివేకానందరెడ్డిని ఎంతగా వేధించింది మొదలైన సంచలనాత్మక విషయాలను ఆమె సవివరంగా తన వాంగ్మూలంలో వెల్లడించారు. షేక్ షమీమ్ వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు ఆమె మాటల్లోనే.. మా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ వివేకానందరెడ్డి నన్ను 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మేం పెళ్లి చేసుకోవడాన్నే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత నాకు ఫోన్‌చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి మా బావగారికి ఫోన్‌చేసి తీవ్రంగా దూషించారు. దీంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను వివేకానందరెడ్డికి చెప్పాను. దాంతో ఆయన శివప్రకాశ్‌రెడ్డి దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని మరీ మండిపడ్డారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె నా భార్యని స్పష్టంచేశారు. అయినాసరే.. శివప్రకాశ్‌రెడ్డి మాత్రం వివేకా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తూనే వచ్చారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు వేధింపులు ఎక్కువయ్యాయి. 2014లో మాకు బాబు పుట్టాడు. షేర్ షా అనే పేరుపెట్టాం. మా కుమారుడికి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకానందరెడ్డి చెప్పారు. దాంతో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలలో ఆందోళన మొదలైంది. వివేకానందరెడ్డికి మొదటి భార్యతో కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. కానీ, మాకు పుట్టిన బిడ్డను వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడంతో వారిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకానందరెడ్డిని మా ఇంటికి రాకుండా కట్టడి చేసేందుకు యత్నించేవారు. ఆయన్ను కూడా తీవ్రంగా బెదిరించేవారు. ఆ నాలుగెకరాలను శివప్రకాశ్‌రెడ్డి రాయించుకున్నారు.. బెరైటీస్ గనులు ఉన్న నాలుగెకరాల భూమిని నా కుమారుడి పేరున రాయాలని వివేకానందరెడ్డి భావించారు. కానీ, అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారని వివేకానందరెడ్డే నాకు చెప్పి బాధపడ్డారు. అప్పటి నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు బెదిరింపులు మరింత తీవ్రమయ్యాయి. వివేకాకు ఆర్థిక ఇబ్బందులు.. ఆయన్ని ఒంటరిని చేశారు.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దాంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. రూ.8 కోట్లు ఇస్తానన్నారు.. బెంగళూరులో ఓ భూ సెటిల్మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వాటిని నాకు ఇస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. కడపలోగానీ హైదరాబాద్‌లోగానీ ఓ ఇల్లు కొనిస్తానని.. మా కుమారుడిని బాగా చదివిస్తానని చెప్పారు. ఇది వివేకానందరెడ్డి స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. గంగిరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వారిద్దరూ కుట్ర ప్రకారం వివేకానందరెడ్డి చుట్టూ తమ మనుషులనే పెట్టారు. దస్తగిరితోపాటు అందరూ వాళ్ల మనుషులే. హైదరాబాద్‌లో నేను ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా దస్తగిరికి తెలియకుండా వివేకానందరెడ్డి జాగ్రత్తపడేవారు. ఓసారి దస్తగిరి మామిడిపళ్లు పట్టుకుని హైదరాబాద్ వస్తే.. మా ఇంటికి కాకుండా మరోచోట అప్పగించమని చెప్పారు. దస్తగిరి నుంచి నాకు ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చేశారు. వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఆధారాలను ధ్వంసం చేశారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని బెడ్రూమ్ నుంచి హాలులోకి తేవడం, ఆధారాలను ధ్వంసం చేయడం అంతా దగ్గరుండీ చేయించింది ఎర్ర గంగిరెడ్డే. శివప్రకాశ్‌రెడ్డి చెప్పడంతోనే ఆయన అలా చేశారు. భయంతోనే వెళ్లలేదు.. 2019, మార్చి 15న ఉ.10గంటల సమయంలో వివేకానందరెడ్డి మరణించారని నాకు తెలిసింది. వెంటనే మా చెల్లితో కలిసి పులివెందుల వెళ్లాలని అనుకున్నా. కానీ, శివప్రకాశ్‌రెడ్డికి భయపడే వెళ్లలేదు. ఎందుకంటే 2012లో ఓసారి వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆయన్ని చూసేందుకు ఇంటికి వెళ్తే నన్ను శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా బయటకు బలవంతంగా గెంటేశారు. అందుకే 2019లో ఆయన హత్యకు గురైనా సరే పులివెందుల వెళ్లేందుకు సాహసించలేకపోయాను. ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివేకానందరెడ్డి 2017లో ఒక ఐఫోన్ కొని నాకు ఇచ్చారు. 2019లో ఆయన హత్యకు గురైన తరువాత పోలీసులు వచ్చి ఆ ఐఫోన్‌ను తీసుకెళ్లిపోయారు. దానిపై నాకు ఎలాంటి రశీదు కూడా ఇవ్వలేదు. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఆ ఫోన్‌ను పోలీసుల ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారేమోనని ఆ అనుమానం. -
‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’
సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది. ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను ఇరికించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ నేతలు, వైఎస్ సునీత కలసి తప్పుదారి పట్టిస్తున్నారని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించేందుకు కుట్ర సాగుతోందని భాస్కర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. టీడీపీ నేతలు, సునీతకు సీబీఐ దర్యాప్తు అధికారి కూడా పూర్తిగా సహకరించారని చెప్పారు. దర్యాప్తు సరిగా చేయడం లేదని భావించిన సుప్రీంకోర్టు ఆ అధికారిని విచారణ నుంచి తప్పించిందని వివరించారు. ప్రత్యక్ష సాక్షులను, ఆధారాలను పట్టించుకోకుండా దస్తగిరి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించినా, బెయిల్ ఇచ్చినా సునీత మౌనంగా ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని వెల్లడించారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ చెప్పినట్లు ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, అతనికి బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలివ్వాలి’ అని కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలంలో చెప్పిన వాటికి సాక్ష్యం లేదు. ఇలా ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒకరు చెప్పారంటూ వ్యక్తులను నేరంలోకి నెట్టడం చట్టవ్యతిరేకం. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీరిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇచ్చారు. దస్తగిరిని కస్టడీలోకి తీసుకోలేదు. విచారణా జరపలేదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు దస్తగిరి హత్యలో కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. అతని వద్ద కొంత నగదు కూడా దొరికింది. ఆయుధాన్ని అతనే తెచ్చినట్లు, హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అతన్ని అప్రూవర్‌గా ప్రకటించేలా కడప కోర్టులో సీబీఐ కౌంటర్ వేసింది. 2021 ఆగస్టులో అనుకూల వాంగ్మూలం ఇచ్చిన కారణంగానే అక్టోబర్‌లో బెయిల్‌కు సీబీఐ సహకరించింది. మన వెనుక అవినాశ్, భాస్కర్‌రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ చెబుతోంది. అసలు ఎవరి పేర్లూ చెప్పలేదని గంగిరెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడంలేదు. వారికి ఏది కావాలో దాన్నే పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తు్తన్నారు. గూగుల్ టేక్ అవుట్ డేటాను ఆధారంగా చేసుకోవడం సరికాదు’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. టీడీపీతో సునీత మిలాఖత్ ‘వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు. ఇది మొదటి భార్య, కూతురు సునీత, అల్లుడికి నచ్చలేదు. ఆస్తుల విషయంలోనూ వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు కూడా ఉన్నాయి. అలాగే తన తల్లితో వివేకా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సునీల్ యాదవ్ చెప్పాడు. ఇలాంటి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగింది. వీటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్‌తో వివేకా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నికల్లో అవినాశ్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. వివేకా హత్య తర్వాత ఇదే విషయాన్ని సునీత కూడా చెప్పారు. టీడీపీతో ఆమె మిలాఖత్ అయినప్పటి నుంచి మాట మార్చారు. విభేదాలు ఉన్న వారిని వదిలిపెట్టి.. సన్నిహితులను కేసులో ఇరికించేందుకు పథకం సాగుతోంది. దస్తగిరిపై వాచ్‌మేన్ రంగన్న చెప్పిన ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధం. అతనికి బెయిల్ ఇచ్చే సమయంలోనూ అన్ని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్ చట్టప్రకారం ఇవ్వలేదు కనుక కడప కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. దర్యాప్తు అధికారులకు అవినాశ్, భాస్కర్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు హాజరవుతున్నారు. భాస్కర్‌రెడ్డిని నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌రెడ్డి నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
‘వివేకా కేసులో సునీత మౌనం వహిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితులకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలున్నాయని, అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సైతం సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగాయి. నిందితుడు దస్తగిరిని అఫ్రూవర్ గా పరిగణించడాన్ని సవాల్ చేస్తూనే.. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ వీళ్లు పిటిషన్లు దాఖలు చేశారు. వివేకా కేసులో భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ సైతం హాజరయ్యారు. ఇక ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అలాగే.. భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి ఇవాళ వాదనలు వినిపించారు. ‘‘వివేకా రెండో భార్య కుమారుడిని వారసుడిగా ప్రకటించడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వేధించారనే వివేకాపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నారు. రాజకీయంగా టీడీపీ సునీతతో కలిసి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కుట్ర పన్నార’’ని నిరంజన్‌రెడ్డి వాదించారు. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి విచారిస్తోందని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడు దస్తగిరి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సాక్ష్యాధారాలు నిందితులకు వ్యతిరేకంగా.. బలంగా ఉన్నాయి. అయినా దస్తగిరికి బెయిల్ సహా అప్రూవర్‌గా పరిగణించడంపై సునీత మౌనం వహిస్తున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో విచారణను ఎల్లుండి(గురువారానికి) వాయిదా వేసింది కోర్టు. ఇదీ చదవండి: వివేకా కేసులో రంగన్న చెప్పింది సీబీఐ పట్టించుకోదా? -
హత్య చేసిన వ్యక్తికి ముందస్తు బెయిలా?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని సీబీఐ అప్రూవ ర్గా ప్రకటించడం, అతడికి కడప కోర్టు బెయిల్ ఇవ్వడం చట్టవ్యతిరేకమని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా కడప కోర్టు దస్తగిరికి అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొంటూ.. అతడికి బెయిల్ ఇస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న ఆయన తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా వైఎస్ భాస్కర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగేందర్ కోర్టుకు హాజరయ్యారు. చంపడానికి గొడ్డలి కొనుగోలు చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడు..: ఈ సందర్భంగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది దేశాయి ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హత్యకు సంబంధించి వివేకా వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ను, సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని, పోలీసులు సేకరించిన మెటీరియల్‌ను సీబీఐ పరిశీలించలేదన్నారు. ‘‘వివేకాను హత్య చేయడానికి నగదు తీసుకున్నానని, చంపడం కోసం గొడ్డలి కూడా కొనుగోలు చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడు. అలాంటి హంతకుడిని కనీసం కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే క్షమించడం చట్టవిరుద్ధం. వివేకాతో దస్తగిరే బలవంతంగా లేఖ రాయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. విచారణలో సీబీఐ చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో సీబీఐ కూడా అతడికి ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు, అప్రూవర్‌గా ప్రకటించేందుకు పూర్తిగా సహకరించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తొలుత నలుగురు ఉన్న నిందితుల జాబితాకు మరికొందరిని చేర్చింది. హత్య కేసులో వారిని బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన నిందితుడు దస్తగిరికి బెయిల్ ఇప్పించడం, అప్రూవర్‌గా ప్రకటించడంపై సరికాదని సీబీఐ అధికారులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీబీఐ తప్పుడు పద్ధతుల్లో దర్యాప్తు చేస్తుండటంతో కృష్ణారెడ్డి పులివెందుల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు’’ అని ప్రకాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. రంగన్న స్టేట్మెంట్ను తొక్కిపెట్టి.. ‘సీఆర్పీసీ సెక్షన్లు 161, 164 కింద వివేకా వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం వంటి శబ్దాలు అతడికి వినిపించాయి. దీంతో పార్క్ వైపు ఉన్న తలుపు వద్దకు వెళ్లి.. పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి చూశాడు. ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌గా గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నాడు. దీంతో భయపడ్డ రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్ దగ్గర తలుపు తీసుకుని సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్, గంగిరెడ్డి హడావుడిగా బయటికి వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. వారిని రంగన్న స్పష్టంగా చూశాడు. రంగన్న చీకట్లో ఉండటంతో వారు అతడిని గుర్తించలేదు. వారందరూ వెళ్లిపోయాక రంగన్న లోపలికి వెళ్లాడు. ఇల్లంతా చూసినా వివేకా కనిపించకపోవడంతో బాత్రూమ్కి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కూడా రంగన్న చెప్పిన వివరాలకు సరిపోయాయి. ఈ ఆధారాలతోనే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితులు హత్య సమయంలో వివేకా ఇంటి వద్దే ఉన్నట్లు గూగుల్ లొకేషన్ ద్వారా కూడా తెలిసింది. ఇన్ని ఆధారాలు ఉన్నా వాటిని తొక్కిపెట్టి సీబీఐ విచారణ సాగిస్తోంది. ఇంతవరకు దస్తగిరిని అరెస్టు చేయలేదు.. కస్టడీలోకి తీసుకోలేదు. కాబట్టి కడప కోర్టు దస్తగిరికి బెయిల్ ఇస్తూ, అప్రూవర్‌గా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని ప్రకాష్ రెడ్డి కోరారు. -
దస్తగిరి ఎందుకు రాలేదు?: సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక న్యాయస్థానం
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఏ–4గా ఉన్న దస్తగిరి విచారణకు ఎందుకు రాలేదని సీబీఐని ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. నిందితులంతా హాజరు కావాలని చెప్పాం కదా.. అని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు అందరూ రావాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కూడా హాజరయ్యారు. సీబీఐ నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో కొన్ని పేజీలు లేవని, దీంతో దాన్ని తిరిగి పంపించామని న్యాయమూర్తి వెల్లడించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ వాయిదా వేశారు. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా ఎంపీ అవినాశ్‌రెడ్డి వెంట వచ్చిన 15 మంది మద్దతుదారులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.