హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఏ–4గా ఉన్న దస్తగిరి విచారణకు ఎందుకు రాలేదని సీబీఐని ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. నిందితులంతా హాజరు కావాలని చెప్పాం కదా.. అని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు అందరూ రావాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.
కేసు విచారణ సందర్భంగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కూడా హాజరయ్యారు. సీబీఐ నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌లో కొన్ని పేజీలు లేవని, దీంతో దాన్ని తిరిగి పంపించామని న్యాయమూర్తి వెల్లడించారు.
కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ వాయిదా వేశారు. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా ఎంపీ అవినాశ్‌రెడ్డి వెంట వచ్చిన 15 మంది మద్దతుదారులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment