పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగస్వామితో మాట్లాడుతున్న దస్తగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు.
ఇటీవల రామ్‌నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్‌కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్‌ఓను గానీ.. ఎస్‌ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్‌ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment