tadimarri
-
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
పోలీస్ స్టేషన్లో దస్తగిరి దాదాగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్‌నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్ఓను గానీ.. ఎస్ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే? -
అక్కడ పాలు ఉచితం.. అమ్మితే అరిష్టమే..
సాక్షి, తాడిమర్రి (అనంతపురం): పాలు లీటరు రూ.40 నుంచి రూ.60 దాకా పలుకుతున్న రోజులివి. ఎవరికైనా పాలు కావాలంటే కొనాల్సిందే. కానీ ఆ గ్రామంలో పాలు అమ్మరు.. కొనరు. ఎన్ని కావాలన్నా ఉచితమే. అవును ఇది నిజం. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. తాడిమర్రికి ఉత్తర దిశన 23 కిలోమీటర్ల దూరంలో చిల్లవారిపల్లి గ్రామం ఉంది. 400 కుటుంబాలు, 1900మంది జనాభా, 1100 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో దాదాపు 300 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ వందలాది లీటర్ల పాలు ఉత్పత్తవుతాయి. అయితే గ్రామంలో పాడి పశువులు లేని వారికి పాలు అవసరమైతే డబ్బు తీసుకోకుండా ఉచితంగా పోస్తారు. పాలకుండలో దేవుడు కనిపించాడని.. చిల్లవారిపల్లిలో పూర్వం కాటికోటేశ్వరస్వామి (కాటమయ్య) పాల కుండలో నవ యువకునిగా కనిపించాడని ప్రతీతి. దీంతో గ్రామంలో ఆలయం నిర్మించి స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజున గ్రామంలో కాటికోటేశ్వరస్వామిని ఊరేగిస్తారు. దేవుడు పాలకుండలో కన్పించినందున ఆనాటి నుంచి పాలు అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆచారాన్ని విస్మరించి ఎవరైనా పాలు అమ్మితే వారి ఇంటికి అరిష్టం జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. చదవండి: (అర్హతలే భీమవరానికి వరం!) కోర్కెలు తీర్చే ఇలవేల్పు కాటికోటేశ్వరస్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మా గ్రామస్తులు కాటికోటేశ్వరస్వామిని తప్ప ఇంకొక స్వామిని ఎరుగరు. కాటికోటేశ్వరస్వామి అంటే గ్రామస్తులకు అపారమైన భక్తి. గ్రామంలో 80 శాతంపైగా పరమశివుని నామాలతోనే పేర్లు ఉండటం విశేషం. –పీ.పెద్దశివారెడ్డి, సర్పంచ్, చిల్లవారిపల్లి పాలు అమ్మిందే లేదు వందల ఏళ్ల నుంచి గ్రామంలో పాలు అమ్మింది లేదు. మా తాత, ముత్తాతల కాలం నుంచి పాలు అమ్మడమనేది చూడలేదు. మాకు 15 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ నాలుగు ఆవులు, ఒక గేదె సుమారు 15 లీటర్ల పాలు ఇస్తాయి. అయినా చుక్క కూడా పాలు, పెరుగు అమ్మం. అడిగిన వారికి ఉచితంగా పోస్తాం. – పి.బాలమ్మ, వృద్ధురాలు, చిల్లవారిపల్లి -
ఏటా వట్టిపోతున్న ఆశలు
తాడిమర్రి మండలం పూర్తిగా వ్యవసాయాధారితం..75శాతం రైతులు మెట్ట ప్రాంతం, బోరుబావుల కింద ఆహారధాన్యాలు, వేరుశనగ పంట, పండ్లతోటలు సాగు చేస్తారు. మండలంలో భూగర్భజలం పెంపొందించడానికి 30 ఏళ్ల క్రితం నార్శింపల్లి, ఏకపాదంపల్లి కుంటకు, పుల్లంపల్లి, నిడిగల్లు, అగ్రహారం, తాడిమర్రి తూర్పు, పడమర చెరువులు నీటిని నింపేందుకు పీఏబీఆర్ కాలువ తవ్వారు. బత్తలపల్లి మండలంలోని అనంతసాగరం వద్ద నుంచి నార్శింపల్లికి, మాల్యవంతం సమీపంలో ఏకపాదంపల్లి కుంటకు, అనంతరం పూలఓబయ్యపల్లి సమీపంలో ఓ వైపు తాడిమర్రి పడమటి చెరువు దాని నుంచి తాడిమర్రి తూర్పు చెరువుకు, మరోవైపు పుల్లంపల్లి, నిడిగల్లు, శివంపల్లి సమీపంలో అగ్రహారం చెరువుకు, మేడిమాకులపల్లి కుంటకు నీరు చేరేలా తూములు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లుగా జిల్లాలోని చెరువులను నింపడానికి పీఏబీఆర్ నీరు విడుదల చేస్తున్నా రెండు పర్యాయాలు మాత్రమే మండలంలోని నార్శింపల్లి, పుల్లానారాయణపల్లి, పుల్లంపల్లి, ఏకపాదంపల్లి గ్రామాలకు అరకొరగా నీరు చేరింది. అగ్రహారం, తాడిమర్రి పడమటి, తూర్పు చెరువులకు నీరు చేరలేదు. దీంతో ఆ చెరువుల కింద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల కింద సుమారు 600 ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ చెరువుల్లోకి నీరు వస్తే సుమారు 500 ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చు. నీరందక ఏటా ఆ చెరువుల కింద భూమిగల రైతులకు నిరాశ ఎదురవుతోంది. వైఎస్సార్ హయాంలో కాలువకు నీరు 2008లో వైఎస్ఆర్ హయాంలో కాలువకు నీరు వచ్చింది. మొదట్లో తాడిమర్రి పడమటి చెరువుకు మినహా అన్ని చెరువులకూ ఆశాజనకంగా వచ్చాయి. అయితే 2009లో వైఎస్సార్ మరణంతో మండల చెరువులకు సక్రమంగా నీరు చేరడం లేదు. ఇక తాడిమర్రి తూర్పు చెరువుకు అప్పటి నుంచి చుక్కనీరు రాలేదు. ప్రజా ప్రతినిధులు మాత్రం అన్ని చెరువులకు నీటిని నింపుతామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టింది లేదు. ఏడాదైనా నీరు చేరానా? : ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీరు జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరడంతో రైతుల్లో ఆశలు చిగుస్తున్నాయి. ఈ ఏడాదైనా చెరువులకు నీరు చేరేనా అని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడేళ్లుగా మండలంలో వర్షాభావం నెలకొని భూగర్భ జలాలు అడుగంటాయి. వందలాది బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోగా, వందలాది బోర్లు ఎండిపోయాయి. చెరువులు, వంకలు, వాగులు వట్టిపోయాయి. వేలాది ఎకరాలలో చీనీ, మామిడి, సపోటా తదితర పండ్ల తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. అరకొరగా నీటి సౌకర్యం ఉన్న పండ్లతోటల సాగు రైతులు పీఏబీఆర్ నీటికోసం ఎదురు చూస్తున్నారు. పీఏబీఆర్ కాలువ ద్వారా వస్తున్న నీటిపై అధికారులు గస్తీ ఏర్పాటు చేయక పైప్రాంత రైతుల స్వార్థంతో జిల్లా సరిహద్దులో మారుమూల ఉన్న తాడిమర్రి మండలానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతోంది. -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనర్సమ్మ(50), రాముడు(55) ఇద్దరూ భార్యాభర్తలు. దంపతులకు ముగ్గురు కుమారులు. ఈ ఇద్దరూ మంగళవారం రాత్రి విషపు గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో కుమారుడు తలుపు తెరిచి చూడగా ఇద్దరూ నిర్జీవస్థితిలో పడి ఉన్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం అని కుమారుడు తెలిపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తాడిమర్రిలో దొంగతనం
అనంతపురం జిల్లా తాడిమర్రి ఎస్సీ కాలనీకి చెందిన బండారు నాగరాజు ఇంట్లోఆదివారం రాత్రి చోరీ జరిగింది. బీరువాలో ఉంచిన రూ.15వేల నగదుతోపాటు జత బంగారు కమ్మలను దొంగలు ఎత్తుకుపోయారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
తాడిమర్రి (అనంతపురం) : వ్యవసాయ మోటర్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిన్నకొండయ్యపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నకొండయ్యపల్లి గ్రామానికి చెందిన చెడిపోతుల ఆనంద్(30) ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ తనకున్న రెండెకరాల పొలంలో వెరుశెనగ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. రాత్రి వర్షం వచ్చి ఉండటంతో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తాడిమర్రి : అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలోని ఓ వేరుశెనగ మిల్లులో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 148 బ్యాగుల (ఒక్కోటీ 48 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాగరాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
ఇద్దర్ని బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం
అనంతపురం : ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది, మరో యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. అనంతపురంజిల్లా తాడిమర్రి ఎస్సీకాలనీకి చెందిన ప్రియదర్శిని, రవిచంద్ర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికి రవి స్నేహితుడు హరీష్‌కుమార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రేమ వ్యవహారం ప్రియదర్శిని ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రవి భయంతో తిరుపతికి పారిపోయాడు. బస్టాండ్‌లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం అందరికీ తెలియడంతో అవమానంగా భావించిన హరీష్ కూడా పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ... చికిత్స పొందుతూ మరణించాడు. మొత్తానికి ఈ లవ్ స్టోరీలో ప్రియుడి ఫ్రెండ్, ప్రియురాలు చనిపోగా .. లవర్ మాత్రం ఆసుపత్రిలో తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు ప్రియదర్శిని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ప్రేమ వేధింపులతో యువతి ఆత్మహత్య