వ్యవసాయ మోటర్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
తాడిమర్రి (అనంతపురం) : వ్యవసాయ మోటర్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిన్నకొండయ్యపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నకొండయ్యపల్లి గ్రామానికి చెందిన చెడిపోతుల ఆనంద్(30) ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ తనకున్న రెండెకరాల పొలంలో వెరుశెనగ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. రాత్రి వర్షం వచ్చి ఉండటంతో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు.