తాడిమర్రి : అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలోని ఓ వేరుశెనగ మిల్లులో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 148 బ్యాగుల (ఒక్కోటీ 48 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాగరాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.