
ఇద్దర్ని బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం
అనంతపురం : ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది, మరో యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. అనంతపురంజిల్లా తాడిమర్రి ఎస్సీకాలనీకి చెందిన ప్రియదర్శిని, రవిచంద్ర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికి రవి స్నేహితుడు హరీష్‌కుమార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రేమ వ్యవహారం ప్రియదర్శిని ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న రవి భయంతో తిరుపతికి పారిపోయాడు. బస్టాండ్‌లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం అందరికీ తెలియడంతో అవమానంగా భావించిన హరీష్ కూడా పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ... చికిత్స పొందుతూ మరణించాడు. మొత్తానికి ఈ లవ్ స్టోరీలో ప్రియుడి ఫ్రెండ్, ప్రియురాలు చనిపోగా .. లవర్ మాత్రం ఆసుపత్రిలో తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు ప్రియదర్శిని మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.