ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య | couples commits suicide in anantapur district | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

Published Wed, Dec 7 2016 12:47 PM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

couples commits suicide in anantapur district

తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనర్సమ్మ(50), రాముడు(55) ఇద్దరూ భార్యాభర్తలు. దంపతులకు ముగ్గురు కుమారులు. ఈ ఇద్దరూ మంగళవారం రాత్రి విషపు గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో కుమారుడు తలుపు తెరిచి చూడగా ఇద్దరూ నిర్జీవస్థితిలో పడి ఉన్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం అని కుమారుడు తెలిపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement