‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉ​న్నారు’ | Bharat Yadav Comments On Dastagiri In YS Vivekananda Case, Details Inside - Sakshi
Sakshi News home page

‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉ​న్నారు’

Published Sun, Mar 3 2024 9:58 AM | Last Updated on Sun, Mar 3 2024 12:39 PM

Bharat Yadav Comments On Dastagiri Vivekananda Case - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్‌ యాదవ్‌ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

కాగా, భరత్‌ యాదవ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు.

ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement