పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం | Dr Devi Reddy Chaitanya Reddy with the media | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం

Published Sun, Mar 3 2024 4:54 AM | Last Updated on Sun, Mar 3 2024 4:54 AM

Dr Devi Reddy Chaitanya Reddy with the media - Sakshi

వైఎస్‌ వివేకా హత్య కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్నారు

మెడికల్‌ క్యాంప్‌నకు వెళ్తే నాపై కూడా ఆరోపణలు చేశారు

సెంట్రల్‌ జైల్లో బెదిరిస్తే రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినట్లే

నేను బెదిరించి ఉంటే దస్తగిరి జడ్జికి ఫిర్యాదు చేసి ఉండొచ్చు కదా..

మా నాన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వేయగానే ఏదోక కట్టుకథ అల్లుతున్నారు

నాడు సీబీఐ వాహన డ్రైవర్‌ను బెదిరించారని ఆరోపణలు

నర్రెడ్డి సునీత డైరెక్షన్‌లో అప్రూవర్‌ దస్తగిరి యాక్షన్‌ చేస్తున్నాడు

హైకోర్టులో నా తండ్రి బెయిల్‌ పిటిషన్‌ను అడ్డుకోవడానికే ఇదంతా 

వైఎస్‌ వివేకా కేసులో మోస్ట్‌ ఎఫెక్టెడ్‌ ఫ్యామిలీ మాదే

మా నాన్న చేయని తప్పునకు జైలులో ఉన్నారు

మీడియాతో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి

సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద­రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలోని శంకర్‌ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్‌ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు.

కడప సెంట్రల్‌ జైలులో మెడికల్‌ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నా­రని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

సెంట్రల్‌ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్‌ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్‌ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

బెయిల్‌ పిటిషన్‌ వేయగానే..
ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు.

ప్రస్తుతం హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస­్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్‌ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్‌లో అప్రూవర్‌ దస్తగిరి యాక్షన్‌ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా.

అప్రూవర్‌గా మారడమే వింత..
నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూ­వర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడి­న­ప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దర­ఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్‌ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు.

కానీ, వాస్త­వాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టు­లోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడు­తాడు.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్ప­ందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమ­వుతోంది.

హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మార­డం సరైంది కాదని మేం పిటిషన్‌ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్‌ పర్సన్‌ వచ్చి ఈ పిటిషన్‌ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు.

రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా..
ఇక వాచ్‌మన్‌ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొ­స్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తు­న్నా­రని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్‌ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్‌ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్‌ పిటిషన్‌ వేసినా ఇంప్లీడ్‌ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్‌పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్‌ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. 

వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్‌ 
ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్‌ అటాక్‌ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్‌అటాక్‌ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది.

చివరి ఛార్జిషీట్‌ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా..
ఈ కేసు చివరి ఛార్జీషీట్‌ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్‌ ఎఫెక్టెడ్‌గా ఉన్న మా కుటు­ంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్‌ పిటిషన్‌ కోర్టులో ఉండగా, కొత్త­గా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్‌ టేకౌట్‌ గురించి, ఎంపీ వాట్సాప్‌ గురించి చెబు­తోంది. నెట్‌ ఆన్‌లో ఉంటే వాట్సాప్‌ ఆటో­మేటి­క్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగు­ల్‌ టేకౌట్‌ పేరుతో మభ్యపెడుతూ వచ్చా­రు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు.

గూగుల్‌ టేకౌట్‌ అనేది కిలోమీ­ట­ర్‌ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్ర­చారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీ­యాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ అవినాష్‌­రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగ­డమే కాక నిత్యం ఫోన్‌లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పుకొ­స్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement