siva shankar
-
అందరిపైనా సెక్షన్ 111 కుదరదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్‌రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్‌రెడ్డిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత... ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. -
గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల మాన ప్రాణాలతో ఆటలా?: శివశంకర్
సాక్షి, గుంటూరు: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపించిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వాష్ రూముల్లో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు వెంటనే స్పందించలేదు. లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని విద్యార్థినుల మానంతో ఆటలాడుకుంటారా?. అనేక ఐఐటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెయ్యి మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయితే నో పోలీస్. గుడ్లవల్లేరులో రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే నో పోలీస్. గుడ్లవల్లేరు వెళ్లటానికి హోంమంత్రికి తీరిక లేదా?. సకల శాఖా మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.‘‘విద్యార్థులను వేధించిన విజయ్ అనే యువకుడు జనసేన పార్టీ. అతని సోషల్ మీడియా పోస్టులు అన్నీ అవే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనం అయింది. విద్యార్థుల మాన, ప్రాణాలను కాపాడాలి. పోలీసు విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. తర్వాత రెండు నిమిషాలకే కెమెరాలు లేవని పోలీసులు ఎలా ప్రకటించారు?. రెండు నిమిషాల్లోనే విచారణ పూర్తి చేశారా?. విద్యార్థినుల ఆందోళన కనపడటం లేదా?. వెంటనే కాలేజీని మూసేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
ఆమాటకొస్తే పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి ?
-
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్‌గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్‌లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్‌తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. -
శివశంకర్ మాస్టర్ జాతకంలో అలా రాసి ఉంది!
‘మన్మథ రాజా మన్మథ రాజా’... పక్కా మాస్ పాట. ‘రగులుతోంది మొగలి పొద’.... శృంగార గీతం.., ‘ధీర ధీర ధీర మనసాగలేదురా’... మంచి రొమాంటిక్ సాంగ్. ‘దేవ దేవ దేవం భజే’... చక్కని భక్తి పాట... ‘భు భు భుజంగం.. ది ది తరంగం’.... అరాచకుడ్ని అంతం చేయడానికి పాట... పాట ఏదైనా శివ శంకర్ మాస్టర్ ‘స్టెప్’ అందుకు తగ్గట్టే ఉంటుంది. అందుకే ఆయన ‘నృత్యధీర’. వెండితెరపై తారలతో అద్భుతమైన స్టెప్పులేయించిన ఈ మాస్టర్ ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు. డ్యాన్స్‌పై మమకారం పెరిగి.. శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్ పెట్టించారు. దీంతో శంకర్ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్ చేయాలన్న పట్టుదల పెరిగిపోయింది. దాంతో తనంతట తానే డ్యాన్స్ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్ అవుతాడు, వదిలెయ్’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్ మాస్టర్ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు. ‘ధీర ధీర’కు జాతీయ అవార్డు రామ్‌చరణ్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’లో ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్ మాస్టర్ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘సర్కార్’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. -
సాయం చేసిన కాసేపటికే శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదిలా వుంటే బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్‌కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందించిన మంచు విష్ణు
Manchu Vishnu Helps To Shiva Shankar Master And His Family: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. శివ శంకర్ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన మిగతా కుటుంబ సభ్యులు భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. చదవండి: ‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు మాస్టర్ భార్య హోంక్వారంటైన్లో ఉండగా కుమారుడు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి వైద్య చికిత్సలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ అర్జించాడు. అది తెలిసి ఆయనకు వైద్యం అందించేందుకు ఇప్పటికే నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేస్తూ.. ‘శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్లో మాట్లాడాడి ధైర్యం చెప్పాను. అలాగే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చారు. చదవండి: శివశంకర్ మాస్టర్‌కు సాయం.. పబ్లిసిటీ చేయవద్దని కోరిన ధనుష్! Spoke with #AIG hospital and they assured the best care to SivaShankar Master. They are extending the best possible help and His son Mr. Ajay is also briefed. All we need now is our prayers for Master. — Vishnu Manchu (@iVishnuManchu) November 26, 2021 -
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
Siva Shankar Master Health Condition Critical: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Noted Choreographer #ShivaShankar Master affected with #COVID19 and now in critical condition. Due to expensive treatment the family is unable to pay the bills.Wishing him a speedy recovery. For Contact Ajay Krishna (Son) 9840323415 pic.twitter.com/2IqBiQUnM7 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 24, 2021 -
లైంగిక వేధింపులు: శివశంకర్ బాబా శిష్యురాలి అరెస్టు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): విద్యార్థినులపై లైంగిక వేధిపుల కేసులో అరెస్టయిన శివశంకర్ బాబా ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన స్కూల్లోనే చదువుకుని ప్రియ శిష్యురాలిగా మారిన సుస్మితను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శివశంకర్ బాబాను రిమాండ్ నిమిత్తం చెంగల్పట్టు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాల్సి రావడంతో శనివారం ఉదయాన్నే చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బాబా నేతృత్వంలోని సుశీల్సూరి స్కూళ్లో చిన్న తనం నుంచి చదువుకుని, అక్కడే స్వామి సేవకు అంకితమైన సుస్మిత అనే ప్రియ శిష్యురాల్ని సీబీసీఐడీ శనివారం అరెస్టు చేసింది. తన ఆరు నెలల బిడ్డతో పాటు ఆమెను విచారణకు తీసుకెళ్లారు. హాస్టల్లో విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసి బాబా వద్దకు తీసుకెళ్లడంలో సుస్మిత కీలకంగా వ్యవహరించిన సమాచారంతోనే అరెస్టు చేసినట్టు సీబీసీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. కరుణ, నీరజ అనే మరో ఇద్దరు శిష్యురాళ్ల వద్ద విచారణ సాగుతోంది. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లలో ఒకరైన భారతీ విదేశాల్లో ఉన్నట్టు, దీప ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు విచారణ తేలింది. చదవండి: పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి.. -
ప్రజాధనం వృథా కానివ్వను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. ప్రజా సేవకుడిగా ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా విధులు నిర్వహిస్తానని జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బులుసు శివశంకరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పారదర్శకంగా, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం దోహదం చేస్తుందన్నారు. శనివారం సచివాలయంలో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా జస్టిస్ శివశంకరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు ఇటువంటి పారదర్శకమైన చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం, దానికి తనను తొలి జడ్జిగా నియమించి రాష్ట్రానికి సేవలందించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పారదర్శకంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ పర్యావరణాన్ని కాపాడుతూ సకాలంలో పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరు రాజ్యాంగంలోని 51ఏ నిబంధన కల్పించిన హక్కులు గురించి మాట్లాడతారని, హక్కుల గురించి మాట్లాడే వారు వారి బాధ్యతల గురించి కూడా తెలుసుకుని వాటిని సక్రమంగా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ శివశంకరరావు తాడేపల్లి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఏసీబీకి చిక్కిన అకౌంట్స్ ఆఫీసర్
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రూ.38 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండు చేశాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఆ అధికారికి ఆయన చాంబర్లోనే రూ.50వేలు ఇస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ లో పనిచేస్తున్న సమయంలో ఇదే తరహాలో శివశంకర్ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
శివ శంకర్ మృతి పట్ల పవన్ సంతాపం
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రాజకీయ యోధుడైన ఆయన మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శివశంకర్ రాజకీయ శైలి, వాగ్దాటి మరిచిపోలేనివన్నారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా దేశానికి, తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ప్రజల్లో చిరస్మరనీయులుగా మిగిలిపోతారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులను మరచి పోలేనివని పవన్ గుర్తుకు చేసుకున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన శివశంకర్ మాటల్లో సున్నితమైన విచక్షణ కూడా ఉండేదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడంలో ఆయన చూపే చొరవ తనని ఎంతగానో ఆకట్టుకొనేదని చెప్పారు. ఈ సందర్భంగా శివ శంకర్ కుటుంబసభ్యులకు పవన్ సానుభూతి తెలియచేసి శ్రద్ధాంజలి ఘటించారు. -
కొత్త దర్శకుడితో నాని
ప్రస్తుతం యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలను రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో మరో సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్న ఈ నేచురల్ స్టార్ ముందు ముందు కూడా అదే ఫాంను కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా తన ఇమేజ్ను కాపాడు కుంటూనే కొత్త దర్శకులతో సినిమాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న నేనులోకల్ సినిమాలో నటిస్తున్న నాని, ఈ సినిమా తరువాత ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేయనున్నాడు. టీచింగ్ ఫీల్డ్ నుంచి దర్శకుడిగా మారుతున్న శివ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రచయిత కోన వెంకట్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాని సరసన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ మరోసారి నానితో జతకడుతుండగా, సరైనోడు సినిమాలో నెగెటివ్ రోల్‌తో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం ఫారిన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కొడుకును చంపి.. పూడ్చిపెట్టేసింది
కనిగిరి మండలం కాశిరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. శివశంకర్ అనే యువకుడు గత పదేళ్లుగా రోజూ తాగి వచ్చి, ఇంట్లో భార్యా బిడ్డలతో పాటు తల్లిని కూడా తీవ్రంగా వేధించేవాడు. ఎవరు ఎంతగా చెప్పినా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన తల్లి నరసమ్మ అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. అనంతరం ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టింది. కాలనీ వాళ్లకు కూడా ఈ విషయం తెలిసినా, శివశంకర్ ఆగడాల గురించి తెలియడంతో ఎవరూ ఈ విషయం బయటపెట్టలేదు. కానీ ఆనోటా ఈనోటా చివరకు పోలీసుల వద్దకు విషయం తెలిసింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. పోలీసులు వచ్చిన తర్వాత తల్లి నరసమ్మ తన నేరాన్ని అంగీకరించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
'సీఎం చెప్పినట్లు అధికారులు వ్యవహరించడం లేదు'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా... అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో శివశంకర్ మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా అధికారులు వ్యవహరించడం లేదని విమర్శించారు. పథకాల అమలు కోసం ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని శివశంకర్ అభిప్రాయపడ్డారు. -
ఆక్రమణలపై కొరడా ఝుళిపించిన అధికారులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికతో గత నెలలో ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ఆక్రమణకు గురైన భూమిలోని షెడ్డును, ఫెన్సింగ్ వైర్, సరిహద్దు రాళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ మేరకు తహశీల్దార్ గోవర్దన్, పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో జేసీబీతో శిఖం భూముల్లో నిర్మించిన షెడ్డును శనివారం తొలగించారు. అనంతరం తహశీల్దా గోవర్దన్ మాట్లాడుతూ సర్వే నంబరు 350 బొబ్బిలికుంట శిఖం భూమిలో ఆక్రమణకు గురైన భాగంలో సర్వే చేపట్టగా ఆక్రమించుకున్నది వాస్తవమేనని నిర్ధార ణ అయిందన్నారు. 15 రోజుల క్రితమే శిఖం భూమి పరిరక్షణ కోసం రూ. 40 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణం కోసం ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. తాము సర్వే చేసిన తర్వాత ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులు నిర్మాణ పనులు చేపట్టడం వల్లనే కూల్చివేతలు చేపట్టామని తహశీల్దార్ తెలిపా రు. శిఖం భూమి పరిరక్షణ కోసం ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. ఇకమీదట శిఖం భూమిని ఆక్రమిస్తే రెవెన్యూ యాక్టు ప్రకారం కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ గోవర్దన్ హెచ్చరించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారా..? తన పట్టా భూమిలోని షెడ్డును రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని, ఇది సరికాదని భూ యజమానురాలు ఇంతియాజ్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 350లో కొంతభాగం క్రిస్టియన్లు, వ్మశాన వాటికకు, మరికొంత భాగాన్ని ఎస్సీల శ్మశానవాటిక కోసం ఆక్రమించుకున్నారని జూలై 1న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్వహించిన సర్వేలో తేలిందని, ఆ నివేదిక ఆధారంగా శిఖం భూమిలో నిర్మించిన 42 ఇళ్లను ఎందుకు కూల్చివేయలేదని ఆమె ప్రశ్నించారు. అధికారులు పక్షపాత వైఖరితో కూల్చివేతలు చేపట్టారని, కూల్చివేసే ముందు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. -
చైన్ స్నాచింగ్ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : మహిళల మెడలోంచి బంగారు పు స్తెల తాళ్లు, గొలుసులు దొంగతనానికి పా ల్పడిన ముగ్గురు యువకులను పట్టణ పో లీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. శనివారం స్థానిక పట్టణ పో లీస్‌స్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలోని మంజీరా నగర్, ప్రశాంత్ నగర్, బృందావన్ కాలనీ, నాగార్జున కాలే జ్ రోడ్డులో, పోతిరెడ్డిపల్లి, కంది గ్రామా ల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోంచి పలు సందర్భాల్లో ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడకు చెందిన షేక్ అంజద్ , కుమ్మరి శ్రీకాంత్, గుంటూరు మురళీవరప్రసాద్, రాజేష్ కుమార్‌లు దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. శుక్రవారం పట్టణంలో మార్కెట్ సందర్భంగా నిందితులు స్నాచింగ్‌కు పాల్పడుతుండగా.. తాను క్రైం పార్టీ హెడ్‌కానిస్టేబుల్ ఏ శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుల్ నర్సింలు, ఎజాజ్గౌరి, అసద్ అలీ, అశోక్‌లు పట్టుకున్నామన్నా రు. వీరి నుంచి 13 తులాల బంగారు పుసె ్తల తాళ్లు, రెండు గొలుసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణంలో కా గా నిందితుల్లో రాజేష్‌కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడి యువకులు పెడతోవ పడుతున్నారన్నారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
ఏపీ పరిరక్షణ సమితి నేత శివశంకర్‌తో సాక్షి వేదిక