
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇదిలా వుంటే బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్‌కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment