
Manchu Vishnu Helps To Shiva Shankar Master And His Family: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. శివ శంకర్ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన మిగతా కుటుంబ సభ్యులు భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు.
చదవండి: ‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు
మాస్టర్ భార్య హోంక్వారంటైన్‌లో ఉండగా కుమారుడు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి వైద్య చికిత్సలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ అర్జించాడు. అది తెలిసి ఆయనకు వైద్యం అందించేందుకు ఇప్పటికే నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు.
చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ..
శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేస్తూ.. ‘శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాడి ధైర్యం చెప్పాను. అలాగే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చారు.
చదవండి: శివశంకర్ మాస్టర్‌కు సాయం.. పబ్లిసిటీ చేయవద్దని కోరిన ధనుష్!
Spoke with #AIG hospital and they assured the best care to SivaShankar Master. They are extending the best possible help and His son Mr. Ajay is also briefed. All we need now is our prayers for Master.
— Vishnu Manchu (@iVishnuManchu) November 26, 2021
Comments
Please login to add a commentAdd a comment