
మంచు బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. కూతురు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్ వెళ్తే.. తన ఇంటికొచ్చి కారు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర బైఠాయించిన మనోజ్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మా మధ్య ఎలాంటి గొడవల్లేవు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతోనే కూతురు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లాను. మేం ఇక్కడే ఉండొచ్చని హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయినా ఇంట్లోకి వెళ్లనివ్వట్లేదు. నా తల్లిమీద ప్రమాణం చేసి చెబుతున్నా ఏ రోజు నేను ఆస్తి కోసం గొడవపడలేదు. నేనంటే విష్ణుకి(Manchu Vishnu) కుళ్లు'
'అన్న కెరీర్ కోసం నేను సినిమాలో లేడీ గెటప్ కూడా వేశాను. ఇప్పుడు నా కారుని దొంగతనం చేశాడు. పాప నగలు ఎత్తుకెళ్లాడు. పెద్దవాళ్లని పిలిచి కూర్చుని మాట్లాడుదామని అడుగుతున్నాను. నా 'భైరవం' సినిమాకు భయపడే 'కన్నప్ప' (Kannappa Movie) వాయిదా వేసుకున్నాడు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న గొడవ చూస్తుంటే మరికొన్నిరోజుల పాటు మంచు ఫ్యామిలీ గొడవలు జరుగుతాయా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనోజ్ మీడియాతో మాట్లాడాడు. మరి మోహన్ బాబు-విష్ణు వైపు నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూడాలి?