
మంచు ఫ్యామిలీలో కొన్నిరోజుల ముందు వరకు గొడవలు జరిగాయి. ఈ మధ్య కాస్త శాంతించినట్లు ఉన్నారు. మరోవైపు తన కొత్త సినిమా 'కన్నప్ప' కోసం విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. తమ్ముడు మనోజ్ తో గొడవ గురించి స్వయంగా విష్ణునే అడిగాడు. దీనికి విష్ణు కూడా చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు.
కొన్నిరోజుల క్రితం మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగా.. విష్ణు, అతడి మనుషులు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగా అక్కడేం జరిగిందనేది పక్కనబెడితే అసలు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావ్ అన్నా? అని స్వయంగా విష్ణుని ఓ నెటిజన్ అడిగేశాడు.
(ఇదీ చదవండి: ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ)
ఆస్క్ విష్ణు పేరుతో ట్విటర్ లో జరిగిన చాటింగ్ సందర్బంగా ఇదంతా జరిగింది. అయితే ఏం చెప్పినా సరే మళ్లీ వివాదం అయ్యే అవకాశముంది కాబట్టి.. 'ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా' అని విష్ణు చాలా సెటైరికల్ గా సమాధానమిచ్చాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
భక్త కన్నప్ప స్టోరీతో తీసిన 'కన్నప్ప' మూవీలో విష్ణు ప్రధాన పాత్రధారి కాగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఏప్రిల్ 25న ఇది థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!)
Ra anna kooda intha manchiga reply ichina manasu needi , mari aaroju generator lo sugar enduk vesav bhaaii pic.twitter.com/nPj5cZRB5R
— 🄳🄴🅅🄰 (@deva_cutzz) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment