Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shiva Shankar Master: శివశంకర్‌ మాస్టర్‌ పాడె మోసిన ఓంకార్‌

Published Tue, Nov 30 2021 9:15 AM | Last Updated on Tue, Nov 30 2021 1:40 PM

Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral - Sakshi

Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్‌ అంత్యక్రియలు సోమవారం(నవంబర్‌29)న పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్‌ మాస్టర్‌కు నివాళులు అర్పించారు. 

కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్‌, దర్శకనిర్మాత ఓంకార్‌తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్‌ బాబు శివశంకర్‌ మాస్టర్‌ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్‌- శివశంకర్‌ మాస్టర్‌ కాంబినేషన్‌లో వచ్చిన డ్యాన్స్‌ షోలు అప్పట్లో సూపర్‌ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ  ఇచ్చిన శివశంకర్‌ మాస్టర్‌ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement