Omkar
-
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్‌లైన్‌తో ట్రైలర్ మొదలైంది. అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్‌కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
అమెరికాలో ప్రధాని మోదీతో జగిత్యాలవాసి.. ఆయన ఎవరంటే?
జగిత్యాల జోన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అక్కడే స్థిరపడ్డ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు నలమాసు ఓంకార్ కూడా పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో సాంకేతిక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు. అయితే, హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఫిల్ చేసిన ఓంకార్ సుమారు 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆయన శానిఫ్రాన్సిస్కోలోని గ్లోబల్ చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన -
'ఇప్పటి వరకు అన్నీ నువ్వే'.. ఏడ్చేసిన హీరో అశ్విన్!
-
'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం!
టాలీవుడ్లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్‌తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. రాజు గారి గది సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం. (ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్) హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్‌గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అశ్విన్‌తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్‌గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. -
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. -
గోవిందరాజస్వామి ఆలయం మహా సంప్రోక్షణ ఆపండి
సాక్షి, అమరావతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గర్భగుడి విమాన గోపురంపై బంగారు పూతతో కూడిన రాగి రేకులను ఏర్పాటు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఈ నెల 21న తలపెట్టిన మహా సంప్రోక్షణ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు కూడా దాఖలు చేశామన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. టీటీడీ కౌంటర్‌తో పాటు ఇతర అంశాలనూ పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుందని చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగాయని, రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరారు. మహా సంప్రోక్షణ పూర్తయితే గర్భగుడిని ఎక్కి విమాన గోపురాన్ని పరిశీలించే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు. -
ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి
2023-24 దేశీయ సీజన్‌కు గాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఓంకార్ సాల్విని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. ఓంకార్ సాల్వి ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఓంకార్ ముంబై పురుషుల జట్టుతో చేరనున్నాడు. కాగా గతంలో ముంబై బౌలింగ్ కోచ్‌గా కూడా ఓంకార్ సాల్వి పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ అమోల్ ముజుందార్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ కోచ్‌గా ఆజట్టు మాజీ ఆటగాడు వినిత్ ఇందుల్కర్ నియమితులు కాగా, మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఓంకార్ గురవ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించనున్నాడు. ముంబై తరపున 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఓంకార్ గురవ్.. 434 పరుగులు చేశాడు. ఓంకార్ కంటే వినిత్ ఇందుల్కర్కు ఎక్కువ దేశీవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇందుల్కర్ ముంబై తరపున 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: WTC FINAL 2023: కిషన్ కంటే అతడు చాలా బెటర్.. ఎందుకు సెలక్ట్ చేశారో అర్ధం కావడం లేదు! -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్‌స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్‌ఫాంపై తాజాగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్‌గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్‌కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
ఓంకార్ హోస్ట్‌గా ఆహాలో ‘డాన్స్ ఐకాన్’ షో, ఫస్ట్‌లుక్ విడుదల
కరోనా తర్వాత ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం. ఇప్పటికే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా ఇప్పుడు మరో కొత్త షోను డిజిటల్ ప్రేక్షక్షుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేయబోతోంది. ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్న ఈ షో ఫస్ట్‌లుక్ ఆగస్ట్ 20న ఆహా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ షో యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘ఈ షో ద్వారా నేను మొదటిసారి ఓటీటీకి ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ షో.. కంటెస్టెంట్స్‌తో పాటు కొరియోగ్రాఫీ చేసే మాస్టర్స్ జీవితాలని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షోని ఆదరిస్తారని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. -
'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత
ఓంకార్ యాంకర్‌గా బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. టీనా సాధు మరణవార్త తెలిసి షాక్ అయ్యాను. ఆట సీజన్లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఆట సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు టీనా మరణవార్త తెలిసి షాక్ అవుతున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆట సీజన్-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్-4కి జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్: ప్రముఖ యాంకర్ ఓంకార్ వచ్చేశాడు!
Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్‌బాస్. దీంతో నేటి ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అనిల్ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్ అషూ చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్‌మేట్స్‌కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్ ఓంకార్ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్‌తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. -
రాజు గారి గది 4 కథ రెడీగా ఉంది: ఓంకార్
బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఓంకార్ డిఫరెంట్ హోస్టింగ్ స్టైల్‌తో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన రియాలిటీ షోలను ప్రేక్షకులకు పరిచయం చేసి అలరించిన ఆయన 'జీనియస్' చిత్రంతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఓ హారర్ స్క్రిప్ట్‌తో మరోసారి వెండితెరపై తన లక్ పరీక్షించుకున్నాడు. అలా రాజుగారి గది సినిమాను తెరకెక్కించాడు. ఇది సూపర్ హిట్టవ్వడంతో అదే ఊపులో సీక్వెల్ తీశాడు. అదీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 'రాజు గారి గది 3' సినిమా రూపొందించాడు. కానీ ఇది ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో సినిమాలు రావని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ తన దగ్గర 'రాజు గారి గది 4' కథ సిద్ధంగా ఉందంటున్నాడు ఓంకార్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'రాజు గారి గది 4' స్క్రిప్ట్ రెడీ అయిందన్నాడు. దీనితోపాటు ఓ థ్రిల్లర్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ కరోనా వల్ల ఇవేవీ సెట్స్ మీదకు వెళ్లలేదన్నాడు. చదవండి: Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ -
వైరల్ : ముమైత్‌ఖాన్‌పై సీరియస్ అయిన ఓంకార్
బుల్లితెరపై యాంకర్‌గా ఓంకార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్‌తో షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో ఓంకార్ ముందుంటారు. ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్‌కు ఓంకార్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏమైందంటే..జడ్జిమెంట్ టైంలో ఓ కంటెస్టెంట్‌కు, ముమైత్ ఖాన్‌కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్ పైకి ముమైత్ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటూ ఓంకార్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్ తగ్గకపోగా, ఓంకార్‌పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్ అయిన ఓంకార్..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్ సైలంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ప్రోమోపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం! -
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్!
బిగ్ బాస్ 4 ఫేం మోనాల్ గజ్జర్ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్, అఖిల్ సార్థక్‌తో ఒకేసారి లవ్ ట్రాక్ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన మోనాల్‌పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మోనాల్ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్ అడగ్గా.. మేడమ్ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్‌కు కన్నా మాస్టర్ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్ తర్వాత మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్, షో మెంటర్స్‌తో పాటు యాంకర్ ఓంకార్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ! -
ప్రేక్షకుల సపోర్ట్ చాలు
ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికాగోర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్‌ను హీరోగా యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఫుల్ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్‌పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను. వారందరూ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్ ఏర్పడింది అని ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్‌కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్. సంగీత దర్శకుడు షబ్బీర్ పాల్గొన్నారు. -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్‌గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్‌గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్‌లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
మూడో గదిలో వినోదం కూడా ఉంది
‘‘నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. కథ నచ్చితేనే ప్రేక్షకులు హిట్ చేస్తారు. ‘రాజుగారి గది 3’ సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. తప్పక విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఓంకార్. అశ్విన్‌బాబు, అవికా గోర్ జంటగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారిగది 3’. ఈ చిత్రం నేడు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన విశేషాలు. ► ‘రాజుగారి గది’ (2015) విజయానికి ఆ సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలే కారణం. అందులో మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ‘రాజుగారి గది 2’ (2017)లో మంచి సందేశం ఉంది కానీ వినోదాన్ని మిస్సయ్యాం అని ప్రేక్షకులు అన్నారు. ‘రాజుగారి గది 3’ మంచి వినోదాన్ని అందిస్తుంది. ► ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడే నా తమ్ముడు అశ్విన్ హీరోగా సరిపోతాడనిపించింది. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాక, ఇతర సినిమాల్లోనూ అశ్విన్ నటించాడు. కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రాజుగారి గది 3’ తర్వాత అశ్విన్‌కు హీరోగా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. అవికా అద్భుతంగా నటించింది. ► ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్, తాప్సీలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా అవికాను తీసుకున్నాం. కథలో కూడా కొన్ని మార్పులు చేశాం. కానీ తమన్నాకు నేను చెప్పిన కథ వేరే. ఈ కథతో ఓ అగ్ర కథానాయికతో భవిష్యత్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ‘రాజుగారి గది 2’ సినిమాను వెంకటేశ్‌గారితో తెరకెక్కించాలనుకున్నా. వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉండటం వల్ల నాగార్జునగారితో తీశాం. వెంకటేశ్‌గారితో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ‘రాజుగారి గది’ సిరీస్‌లో ఓ చిత్రాన్ని ఆయనతో చేయాలని ఉంది. ► నేను అక్టోబరులో పుట్టాను. ‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తోన్న ప్రతి సినిమా అక్టోబరులోనే విడుదలవుతోంది. ‘రాజుగారి గది 3’ సినిమా నాకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడినిగానే కొనసాగుతాను. ► నేను చేస్తోన్న ఓ రియాలిటీ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా దగ్గర ‘రాజుగారి గది 4’ కథతో పాటు, ఓ క్రీడా నేపథ్యంలో సాగే కథ ఉంది. వీటిలో ఏ సినిమా ముందు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. -
‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు’
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తన తమ్ముడు అశ్విన్ హీరోగా ‘రాజుగారి గది 3’ చిత్రాన్ని ఓంకార్ తెరకెక్కించాడు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. ‘18న విడుదలవుతున్న ఈ చిత్రం చిన్న పిల్లలతో సహా అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అశ్విన్, కళ్యాణ్ నా తమ్ముళ్ళు ఇద్దరూ నన్ను నమ్ముకుని నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడూ అశ్విన్‌ని హీరోని చెయ్యాలని, కళ్యాణ్‌ని ప్రొడ్యూసర్ చేయాలన్నది నా కోరిక. 18న అశ్విన్ హీరోగా మీ ముందుకు వస్తాడు. ఇక కళ్యాణ్ బాధ్యత ఒకటి ఉంది. మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాన్నగారూ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అప్పటి నుంచి నేను వైట్ డ్రస్‌లో ఉంటున్నాను. తమ్ముళ్ళని సక్సెస్ చేసిన తర్వాతే డ్రసింగ్ మార్చుకుంటాను. నన్ను ఆదరించినట్లే నా తమ్ముడు అశ్విన్‌ని రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను’అని ఓంకార్ అన్నారు. ‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు. జీనియస్ నుంచి నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ చోటా గారి లాంటి పెద్ద టెక్నీషియన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జూన్ 21న మొదలై ఇంత త్వరగా పూర్తవడానికి మొయిన్ కారణం కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరూ ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’అని అశ్విన్ బాబు పేర్కొన్నారు. హీరోయిన్ అవికాగోర్ మాట్లాడుతూ..‘మొదటిసారి నేను చాలా నెర్వస్‌గా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ‘రాజుగారి గది3’ చిత్ర యూనిట్‌ను నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఈ క్యారెక్టర్ని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. చోటాగారు, ఓంకార్ బ్రదర్స్ చాలా కష్టపడ్డారు’అని అన్నారు. -
‘రాజుగారి గది 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అద్దంలో చూసుకొని భయపడ్డాను
‘‘సినిమా రిలీజ్ అయిపోతే మార్చడానికి ఏమీ ఉండదు. కానీ సీరియల్స్ విషయానికి వస్తే గత ఎపిసోడ్లో జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చు. టీవీ ద్వారానే పాపులారిటీ సంపాదించాను. అందుకే టాలీవుడా? బాలీవుడా? టీవీ ఇండస్ట్రీయా? అని అడిగితే ఎప్పుడూ టీవీకే నా ఓటు’’ అన్నారు అవికా గోర్. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా గుర్తింపు పొంది హీరోయిన్గా మారారామె. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా నటించిన ‘రాజుగారి గది 3’లో హీరోయిన్గా నటించారు అవికా. ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ – ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత వరుసగా టీవీ షోలు, ఒక హిందీ సినిమా చేశాను. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. పేరుకి చేశాం అనేట్టు సినిమా అంగీకరించడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం ‘ఖత్రా’ అనే టీ షో చేస్తున్నాను. ఆ సమయంలో ఓంకార్‌గారు కలసి ‘రాజుగారి గది 3’ కథ చెప్పారు. ఈ సినిమాలో ముందు తమన్నాను అనుకున్నాం, డేట్స్ క్లాష్‌తో ఆమె తప్పుకున్నారు అని ముందే చెప్పారు. ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి భయపడిపోయాను. హారర్ సినిమాలు ఒక్కదాన్నే చూడటానికి భయపడుతుంటాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటేనే చూస్తాను. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక పూర్తి మేకప్ వేసుకున్నాక నన్ను నేను అద్దంలో చూసుకుని, భయపడ్డాను. మా నాన్నగారైతే ‘ఇదే నువ్వు’ అని ఆటపట్టించారు. ప్రేక్షకులు భయపడుతూనే విపరీతంగా నవ్వుతారు. అదే మా సినిమా హైలెట్. ప్రస్తుతం తెలుగు అర్థం అవుతోంది. నేర్చుకుంటున్నాను. సెట్లో పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలీగారి లాంటి లెజెండ్‌తో నటించడం మర్చిపోలేను. కుదిరితే బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలనుంది కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లలేను. ఒక తెలుగు ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను. త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ అని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నంత ప్లానింగ్, పద్ధతి ఎక్కడా ఉండదు. జూలైలో సినిమా ప్రారంభించి అక్టోబర్‌లో వచ్చేస్తున్నాం. యాక్టర్‌గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీయే.