అమ్మో సమంత కల్లోకి రావొద్దు.... | Samantha gives Shocks to her fan in rajugari gadhi 2 | Sakshi
Sakshi News home page

అమ్మో సమంత కల్లోకి రావొద్దు....

Published Fri, Oct 13 2017 4:38 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Samantha gives Shocks to her fan in rajugari gadhi 2 - Sakshi

అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని తొలి సినిమాతోనే మాయ చేసిన సమంత నిన్న మొన్నటి వరకూ చాలామంది డ్రీమ్‌గాళ్. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తమ కల్లోకి రావొద్దని చాలా మంది కోరుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... శుక్రవారం విడుదలైన రాజుగారి గది 2లో సమంత నటన సూపర్బ్‌ అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో సామ్‌ యాక్షన్‌ అదుర్స్‌ అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్‌ వస్తున్నాయి. ఇదే విషయాన్ని రంగస్థలం టీమ్‌ కూడా ఇదే విషయాన్ని ట్విట్‌ చేసింది.

చాలామంది ఇప్పటివరకూ సమంతను డ్రీమ్‌గాళ్‌గా చూశారని, అయితే రాజుగారి గది 2 సినిమా చూశాక వాళ్లంతా తమ కల్లోకి సమంత రావొద్దని అనుకుంటారని పేర్కొంది. కాగా రంగస్థలం చిత్రంలో హీరో రామ్‌చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత తన నటనకు ఫుల్‌ మార్కులు కొట్టేసింది.  ఈ చిత్రంలో అమృత పాత్రలో నటించిన ఆమె తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది.

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టించింది. దీంతో  ఆమె నటనపై ట్విట్టర్‌లో పొగడ్తల వర్షం కురుస్తోంది. సుమంత ఇంటి పేరు మారినా ఆమె సక్సెస్‌లో విజయపరంపర కొనసాగుతోందని అభిమానులు వ్యాఖ్యలు చేశారు. సమంత  పెళ్లి తర్వాత విడుదలైన తొలి సినిమాతో హిట్‌ సొంతం చేసుకుందని అభినందించారు. అలాగే  మామాకోడళ్లు సమంత నాగార్జున కాంబినేషన్ సీన్స్ లో ఇద్దరు పోటాపోటీగా ఇరగదీశారంటూ కామెంట్స్‌ పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement