ఏది ఎక్కువ ఏది తక్కువ!
సమంతలో కూసింత కామెడీ పాళ్లు ఎక్కువనే చెప్పుకోవాలి. సినిమా వేడుకల్లో స్పాంటేనియస్‌గా స్పందించే సమంత, సోషల్ మీడియాలో ఎవరైనా చికాకు పుట్టించే ప్రశ్నలు వేసినా... భలే సరదా సమాధానాలు ఇస్తుంటారు. అటువంటి సమంత సడన్‌గా తత్వవేత్తగా మారారు. ప్రేక్షకులతో పాటు ప్రజలకు ఫిలాసఫీ పాఠాలు చెబుతున్నారు.
‘‘నువ్వు చూపించే దానికంటే (టాలెంట్) నీ దగ్గర ఎక్కువ ఉండాలి. నీకు తెలిసిన దానికంటే నువ్వు తక్కువ మాట్లాడాలి’’ అన్నారామె. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు... సినిమా రంగంలో జయాపజయాలు సహజమే. రియల్ లైఫ్, రీల్ లైఫ్... రెండిటిలోనూ సమంత సక్సెస్‌ఫుల్ లేడీ. అటువంటి ఆమె ఇప్పుడీ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. అన్నట్టు, త్వరలో నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న ఈ చెన్నై సుందరి కాబోయే మామగారు నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో కీలక పాత్ర చేస్తున్నారు.