మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్‌, చై ఏమన్నాడంటే? | Nagarjuna Response On Konda Surekha Comments About His Family | Sakshi
Sakshi News home page

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, చై రియాక్షన్‌ ఇదే!

Published Wed, Oct 2 2024 5:43 PM | Last Updated on Wed, Oct 2 2024 9:18 PM

Nagarjuna Response On Konda Surekha Comments About His Family

తన కుటుంబ సభ్యులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ప్రముఖ హీరో నాగార్జున తీవ్రంగా ఖండించాడు. తక్షణమే తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేశాడు. 

‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి.  దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని  గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ను నాగచైతన్య రీట్వీట్‌ చేశాడు.

(చదవండి: ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. కొండా సురేఖకు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌)

కాగా, తాజాగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే కారణమని ఆరోపించారు. ‘‘మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు.  హీరోయిన్స్ కి కేటీఆర్‌ డ్రగ్స్‌ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు’’ అని సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ సైతం అసహనం వ్యక్త చేశారు. ‘‘సినిమాల్లో  నటించే ఆడవాళ్ళంటే  చిన్న చూపా..?’ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

(చదవండి: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement