మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2' | Raju Gari Gadhi 2 Movie Review | Sakshi
Sakshi News home page

మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2'

Published Fri, Oct 13 2017 12:12 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Raju Gari Gadhi 2 Movie Review - Sakshi

టైటిల్         : రాజు గారి గది 2
జానర్         : హర్రర్ థ్రిల్లర్
తారాగణం    : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు
సంగీతం      : ఎస్.తమన్
దర్శకత్వం    : ఓంకార్
నిర్మాత        : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి

రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, మూడో సినిమా కోసం మరోసారి హర్రర్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. రెండో సినిమానే పీవీపీ లాంటి బడా బ్యానర్ లో నాగార్జున లాంటి సీనియర్ హీరోతో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన రాజు గారి గది 2 తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది. పెళ్లి తరువాత రిలీజ్ అవుతున్న సమంత తొలి సినిమా ఆశించిన విజయాన్ని సాధించిందా..?

కథ :
అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది.

దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. (సాక్షి రివ్యూస్) ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లలో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ.
 

నటీనటులు :
ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటి ఇస్తున్న సీనియర్ హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.(సాక్షి రివ్యూస్) సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది.

సాంకేతిక నిపుణులు :
రాజుగారి గది సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓంకార్, మూడో సినిమాతో మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఉన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కలిసొచ్చింది. మలయాళ సినిమా నుంచి మూలకథను తీసుకున్న ఓంకార్, పూర్తిగా కొత్త టేకింగ్ తో మెప్పించాడు. ఎక్కడా ఇది రీమేక్ అని గుర్తించ లేనంతగా మన నేటివిటికీ తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న సమంత నుంచి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ఓంకార్ విజయం సాధించాడు. గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో ఎసెట్ తమన్ అందించిన సంగీతం, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో బిట్స్ సాంగ్స్ తో అలరించాడు. (సాక్షి రివ్యూస్) ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకువచ్చింది.  పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నాగార్జున, సమంతల నటన
క్లైమాక్స్
తమన్ అందించిన నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement