Raju gari Gadhi 2
-
‘రాజుగారి గది–2’ సక్సెస్‌మీట్
-
తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి బహుమతి ఇది – సమంత
‘‘అమ్మకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. ఓ సారి ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లినప్పుడు... ‘మీరు కొత్త పాత్రలు చేస్తే తప్పకుండా హిట్’ అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడు కొత్త పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రాజుగారి గదిలో అందరూ డబ్బులు నిండుతున్నాయంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే, గదిలో ప్రశంసలు నిండటం చాలా హ్యాపీగా ఉంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కన్నా పెద్ద హిట్టా మావయ్యా?’ అనడుగుతోంది సమంత. ఆ విషయం తనకు తర్వాత చెబుతా’’ అని నవ్వేశారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్, అశ్విన్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఫ్యాన్స్ ఫోన్ చేసి... ‘మా హీరో ఇలాంటి సినిమా చేశాడని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం’ అన్నారు. ఇలాంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? కొత్త కోడలు బ్లాక్ బ్లస్టర్ ఇచ్చింది. ఈ హిట్‌కి నిర్మాతలు, ఓంకార్, తమన్, అబ్బూరి రవి నాలుగు స్తంభాలుగా నిలిచారు’’ అన్నారు. ‘‘ఈ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పెళ్లి బహుమతిగా భావిస్తున్నా. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ బాగా రావడానికి, నేను బాగా నటించడానికి హెల్ప్ చేసిన మావయ్యకు థ్యాంక్స్’’ అన్నారు సమంత. ‘‘నైజాంలో ‘ఊపిరి’ ఫస్ట్‌డే షేర్ 80 లక్షలు అయితే... ‘రాజుగారి గది–2’కి కోటిన్నర వచ్చింది. సినిమా ఎంత హిట్టనేది చెప్పడానికే ఈ లెక్కలు చెప్పా. నాగార్జునగారి కెరీర్లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనుకుంటున్నా. అక్కినేని ఫ్యామిలీకి సమంత లక్కీ లేడీ’’ అన్నారు పీవీపీ. ‘‘పీవీపీగారితో హ్యాట్రిక్ హిట్ అందుకున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమా పైరసీ కాపీలు వచ్చేశాయని విన్నాం. ప్లీజ్... కిల్ పైరసీ. థియేటర్లోనే సినిమా చూడండి’’ అన్నారు ‘మ్యాట్నీ’ జగన్. ‘‘ఓ ఫైట్ లేదు, పాట లేదు. అయినా... నాగార్జునగారు కథను నమ్మారు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ను వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారేమోనని భయపడ్డా. కానీ, సినిమాను ఆదరించారు. అక్కినేని కోడలు ఇచ్చిన తొలి హిట్ తీసిన దర్శకుడిగా నాకు క్రెడిట్ దక్కినందుకు హ్యాపీ’’ అన్నారు ఓంకార్. శీరత్ కపూర్, అభినయ, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. రాజుగారి గది 2 సక్సస్ మీట్ వీడియో -
ప్రయోగాలు ఫలిస్తున్నాయి..!
ఎవరెన్ని మాటలు చెప్పిన సినిమా అంటే వ్యాపారమే. ఇక్కడ లాభనష్టాలే ముఖ్యభూమిక పోషిస్తాయి. అందుకే కమర్షియల్ ఫార్ములా సినిమాలకే మన సినీ ప్రముఖులు ఓటేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలంటే కోట్లతో పని ఏ మాత్రం పొరబాటు జరిగినా భారీ నష్టాలు తప్పవు. అందుకే యంగ్ హీరోల స్థాయిలో సీనియర్ హీరోలు ప్రయోగాలకు ముందుకు రారు. అయితే అడపాదడపా ప్రయోగాలకు ఓకె చెపుతున్న మన హీరోలు మంచి విజయాలే సాధిస్తున్నారు. తాజాగా రాజుగారి గది 2తో నాగార్జున మరోసారి తన నిర్ణయం సరైనదే అని ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు తెర మీద హర్రర్ కామెడీలో మంచి విజయాలు సాధించాయి. అయితే ఈ జానర్ లో స్టార్ హీరోలు మాత్రం ఇంతవరకు నటించలేదు. హీరోయిజానికి పెద్దగా అవకాశం లేకపోవటంతో స్టార్ హీరోలు ఈ తరహా సినిమాలపై ఆసక్తి కనబరచలేదు. తొలిసారిగా నాగ్ ఆ సాహసం చేశాడు. హర్రర్ కామెడీ లో నటించిన నాగ్ తన స్టైల్ తో అలరించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన మరో ప్రయోగం అర్జున్ రెడ్డి. తెలుగు సినీరంగంలో శివ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అర్జున్ రెడ్డి కూడా అదే స్థాయిలో హాట్ టాపిక్ మారింది. తొలి పోస్టర్ నుంచే సంచలనంగా మారిన అర్జున్ రెడ్డి, రిలీజ్ తరువాత మరిన్ని వివాదాలకు తెరతీయటంతో పాటు అదే స్థాయిలో వసూళ్లనూ సాధించింది. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన బోల్డ్ ప్రయత్నం తెలుగు సినిమాకు కొత్త పంథాను చూపించింది. రొటీన్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్న ఫార్ములాను బ్రేక్ చేసిన దర్శకులు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కథా భావోద్వేగాలే ప్రధాన బలంగా సినిమాలు తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల కూడా మంచి విజయాలు సాధిస్తున్నారు. ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ఇటీవల ఫిదా సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఫిదా చేశారు. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయిల ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా.. ఘనవిజయం సాధించింది. హీరోయిజాన్ని సరికొత్త కోణంలో చూపిస్తున్న దర్శకులు కూడా మంచి విజయాలు సాధిస్తున్నారు. హీరో అంటే సకల కళాభిరాముడన్న ఫార్ములాను పక్కన పెట్టి, మతిమరుపు, నిరుద్యోగి లాంటి ఇబ్బందుల్లో ఉన్న క్యారెక్టర్లను కూడా హీరోలుగా చూపించి విజయాలు సాధిస్తున్నారు. భలే భలే మొగాడివోయ్ సినిమాలో నానీని మతిమరుపు వ్యక్తిగా చూపించిన మారుతి, పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండను నిరుద్యోగిగా చూపించిన తరుణ్ భాస్కర్ లు ఘనవిజయాలు సాధించారు. పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో సాగిపోతున్న సినిమాను కళాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నవారూ లేకపోలేదు. దర్శకుడు క్రిష్ ఈ కోవలోకే వస్తారు. గమ్యం నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన క్రిష్ తన ప్రతీ సినిమాలో ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కంచె, వేదం లాంటి సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా.. దర్శకుడిగా మాత్రం ప్రతీ సినిమాకు ఎదుగుతూ వచ్చారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి తో తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించి మంచి ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఆదారిస్తారని మరోసారి నిరూపించాడు. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోన్న నేపథ్యంలో హీరోలు, దర్శకులు కొత్త కథలకు ప్రయోగాలకు రెడీ అంటున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇప్పటికే స్టార్ హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేయటం ప్రారంభించారన్న విషయం స్పష్టమవుతోంది. -
మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2'
టైటిల్ : రాజు గారి గది 2 జానర్ : హర్రర్ థ్రిల్లర్ తారాగణం : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు సంగీతం : ఎస్.తమన్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, మూడో సినిమా కోసం మరోసారి హర్రర్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. రెండో సినిమానే పీవీపీ లాంటి బడా బ్యానర్ లో నాగార్జున లాంటి సీనియర్ హీరోతో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన రాజు గారి గది 2 తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది. పెళ్లి తరువాత రిలీజ్ అవుతున్న సమంత తొలి సినిమా ఆశించిన విజయాన్ని సాధించిందా..? కథ : అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది. దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. (సాక్షి రివ్యూస్) ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లలో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటి ఇస్తున్న సీనియర్ హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.(సాక్షి రివ్యూస్) సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది. సాంకేతిక నిపుణులు : రాజుగారి గది సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓంకార్, మూడో సినిమాతో మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఉన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కలిసొచ్చింది. మలయాళ సినిమా నుంచి మూలకథను తీసుకున్న ఓంకార్, పూర్తిగా కొత్త టేకింగ్ తో మెప్పించాడు. ఎక్కడా ఇది రీమేక్ అని గుర్తించ లేనంతగా మన నేటివిటికీ తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న సమంత నుంచి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ఓంకార్ విజయం సాధించాడు. గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో ఎసెట్ తమన్ అందించిన సంగీతం, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో బిట్స్ సాంగ్స్ తో అలరించాడు. (సాక్షి రివ్యూస్) ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకువచ్చింది. పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగార్జున, సమంతల నటన క్లైమాక్స్ తమన్ అందించిన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పేరు మార్చుకున్న సమంత..
హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ సమంత తన పేరు మార్చుకున్నారు. అలాగని వేరే పేరు పెట్టుకోలేదండోయ్. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్లో 'సమంత రుతు ప్రభు'గా ఉన్న తన పేరును 'సమంత అక్కినేని'గా మార్చుకున్నారు. ఇటీవల అక్కినేని వారబ్బాయి, నటుడు నాగచైతన్య, సమంతల వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఘనంగా నిర్వహించారు. అక్కినేని, రామానాయుడు, సమంతల కుటుంబాలతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైన విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు రోజుల్లోనే ట్విట్టర్లో ప్రత్యక్షమై తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాజాగా తన భర్త నాగచైతన్య ఇంటిపేరును తన పేరుకు జత చేసుకున్నారు. ట్విట్టర్లో సమంత రుతు ప్రభుగా ఉన్న పేరును సమంత అక్కినేనిగా మార్చుకోవడంపై సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రాజుగారి గది 2 ఈ శుక్రవారం విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో, సమంత ఆత్మగా కనిపించనున్నారు. త్వరలోనే సమంత రంగస్థలం 1985, సావిత్రి మూవీ షూటింగ్‌లతో మళ్లీ బిజీ కానున్నారు. -
'రాజుగారి గది 2' వర్కింగ్ స్టిల్స్
-
పంతులమ్మగా సమంత
కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ రాజు గారి గది 2. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ మెంటలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అక్కినేని వారి కొత్త కోడలు సమంత నటిస్తోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత స్టిల్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెల్ల పంచె, లాల్చీలో చేతిలో బెత్తం పట్టుకొని పంతులమ్మలా కనిపిస్తోంది సమంత. గతంలోనూ ఈ లుక్ తో ఉన్న ఫొటోలు బయటకు వచ్చినా అవి రంగస్థలం 1985 సినిమా స్టిల్స్ అయి ఉంటాయని భావించారు. తాజాగా రాజు గారి గది 2 యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో సమంత లుక్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో సమంత దెయ్యంగా కనిపించనుందన్న విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించినది అయి ఉంటుందని భావిస్తున్నారు. -
రాజుగారి గది 2 సెన్సార్ పూర్తి
కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం రాజుగారి గది 2. మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంకార్ దర్శకుడు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించారు. రాజుగారి గదిలో హీరోగా నటించిన అశ్విన్ తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఓం నమో వేంకటేశాయ సినిమాతో నిరాశపరిచిన నాగ్, ఈసినిమాతో సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. -
సమంత ఎందుకు ఒప్పుకుందో...!
నాగార్జున మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నారు. ఏదైనా సినిమా కోసమా? అనడిగితే.. ‘‘నో నో. కొత్తగా ప్రయత్నించాలనుకున్నా. వచ్చే మూడు నెలలు షూటింగులేవీ లేవు. ఈ ఏడాదంతా ఖాళీ. అమ్మాయిలందరూ ఈ లుక్‌ను ఇష్టపడుతున్నారు’’ అని నాగార్జున అన్నారు. ఓంకార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘రాజుగారి గది–2’. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇంకొకటి... నాగచైతన్య, సమంతల పెళ్లి ఎల్లుండే. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు.... నా మనసులో ఉన్నది చెప్పేశాడు! ‘రాజుగారి గది–2’లో మెంటలిస్ట్ క్యారెక్టర్ చేశా. కొత్తగా ఉందీ పాత్ర. నాకు హీరోయిన్ లేదు, రొమాంటిక్ సీన్స్ లేవు, పాటల్లేవ్! ఈ సినిమా అంగీకరించిన తర్వాత... ఓ రియల్ మెంటలిస్ట్ని కలిశా. జస్ట్... ఐదారు ప్రశ్నలు అడిగాడంతే. మూడుసార్లు నేను మనసులో అనుకున్న పదాల్ని చెప్పేశాడు. నాకు ఆశ్చర్యంగా అన్పించింది. మర్డర్ మిస్టరీలు, వాటిని సాల్వ్ చేసే క్యారెక్టర్లో నేను కనిపిస్తా. ఓ ఆత్మ ఈలోకాన్ని ఎందుకు విడిచి వెళ్లలేదు. దాంతో నా కనెక్షన్ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆత్మకీ, నాకూ చాలా హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ వల్లే ఆలస్యమైంది! సిన్మా చాలా బాగుంది. సెప్టెంబర్ 1న చూద్దామనుకున్నా. కానీ, అక్టోబర్ 2న చూశా. ఓ నెల ఆలస్యమైంది. సెప్టెంబర్ 1న ఎడిటెడ్ వెర్షన్ చేతికొచ్చింది. అయితే స్పెషల్ ఎఫెక్ట్స్ బాగోలేవు. అప్పుడు నేను డబ్బింగ్ చెప్పనన్నాను. డబ్బింగ్ చెబితే... అలాగే విడుదల చేసేస్తారు. నేను ప్రెజర్ పెట్టేసరికి మళ్లీ స్పెషల్ ఎఫెక్ట్స్ చేసుకొచ్చారు. ఆత్మలతో ముడిపడిన కథ కదా! ఆత్మ నేపథ్యంలో వచ్చిన ప్రతి సన్నివేశంలోనూ గ్రాఫిక్స్ అవసరమే. అందువల్ల, సినిమా అంతా వీఎఫ్ఎక్స్కి ప్రాముఖ్యత ఉంది. గ్రాఫిక్స్ బాగోలేకపోతే... ప్రేక్షకులకు భయం వేయదు. వెంటనే డిస్కనెక్ట్ అవుతారు. ‘ఆనందో బ్రహ్మా’ చూశారుగా! నేను ఫస్ట్ టైమ్ హారర్ సిన్మా చేశా. హారర్ సిన్మాలు అవుట్‌డేటెడ్ అవుతున్నాయనుకోవడం లేదు. మొన్నే ‘ఆనందో బ్రహ్మ’ బ్రహ్మాండంగా ఆడింది కదా! మలయాళ ‘ప్రేతమ్’ కథను స్ఫూర్తిగా తీసుకుని, సీన్లు మార్చి ఓంకార్ కొత్త కథ రాశాడు. నా క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. హారర్ కంటే ఈ సినిమాలో థ్రిల్ ఎక్కువ ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ మంచి కామెడీ చేశారు. ఏమాత్రం వల్గారిటీ లేకుండా చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా తీశాం. ‘మనం’ చూశాక, ప్రేక్షకుల్లో ఎలాగయితే ఓ మంచి ఫీలింగ్ కలిగిందో! ఈ సినిమా చూశాక కూడా అలాంటి ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. సమంతను అలా చూడలేను! ‘రాజుగారి గది–2’లో సమంత దెయ్యంగా చేస్తున్నారు కదా? అని అడగ్గా... నా కోడల్ని దెయ్యంగా చూడలేను, చూడాలనుకోవడం లేదు. (నవ్వుతూ...) సమంతతో ‘నో... నువ్వెందుకు ఒప్పుకున్నావ్?’ అనడిగా. చైతూతో సినిమా చూస్తే... ‘మీరిద్దరూ ఓ గదిలో ఎలా ఉంటారో’ అన్నా. వాడైతే నేను సినిమా చూడనని చెప్పేశాడు. సమంత క్యారెక్టర్ ముందు నుంచి ఉంటుంది. కానీ, క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించింది. చైతూ పెళ్లికి అతిథులు... మూడు కుటుంబాలే! రామానాయుడిగారి ఫ్యామిలీ, మా (అక్కినేని) ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ... చైతూ పెళ్లికి మొత్తంగా చూస్తే అతిథులు వందమంది లోపే. జస్ట్... మా ఫ్యామిలీలు, ఇమీడియెట్ ఫ్యామిలీలను ఇన్వైట్ చేశాం. అందర్నీ పిలవాలనుంది. కానీ, ఒకర్ని పిలిచి మరొకర్ని మర్చిపోతే ఇబ్బంది. అందరూ కావలసినవాళ్లే. అందువల్లే, రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేద్దామని నిర్ణయించుకున్నా. మోస్ట్ సింపుల్ వెడ్డింగ్. బట్, భోజనాలు మాత్రం బాగుంటాయి. (నవ్వులు) రిసెప్షన్ ఎందుకు? వద్దని చైతూ అన్నాడు. కుదరదని చెప్పా. రిసెప్షన్‌కి ఇంకా డేట్ ఏదీ అనుకోలేదు. పెళ్ళైన వారం రోజుల తర్వాత ఇద్దరూ షూటింగులకు వెళ్తున్నారు. అక్టోబర్ 15 నుంచి కాల్షీట్స్ ఇచ్చేశారు. ఈ మధ్యలో మంచి డేట్ చూసి ఎన్ కన్వెన్షన్‌లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నా. మా పెళ్లి గుర్తొచ్చింది! గోవాలో అక్టోబర్ 6న హిందూ, 7న క్రిస్టియన్ పద్ధతుల్లో చైతూ, సమంతల పెళ్లి! చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే... రెండు సంప్రదాయాలను గౌరవించి రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం! ఐయామ్ వెరీ హ్యాపీ. ఓ పెళ్లికి పంచె కట్టుకోవచ్చు... ఇంకో పెళ్లికి సూట్ వేసుకోవచ్చు! ఎప్పట్నుంచో ‘అమ్మాయిలను మీరు చూసుకోండి. పెళ్లి మాత్రం మన ఇంట్లో నేనే చేస్తా’ అని చైతూ, అఖిల్‌కు చెప్పేవాణ్ణి. చక్కగా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు చైతూ, సమంత అలాగే చేసుకోవాలనుకోవడం నాకు నచ్చింది. ముఖ్యంగా... ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిలకు ప్రతి శ్లోకానికి, మంత్రానికి మన ఘంటశాలగారు భగవద్గీత చదివినట్టు... చక్కగా అర్థాలు చెబుతారు. అప్పట్లో అమల, నేనూ కావాలనే ఆర్యసమాజ్‌లో చేసుకున్నాం. నాకింకా ఆ రోజులు గుర్తున్నాయ్! పురోహితులు చెప్పినట్టు చేసేసి, ఓ అర్ధగంటలో పెళ్లి తంతు ముగించకుండా, మంత్రాలకు అర్థాలేంటో తెలుసుకోమని చైతూకి, సామ్‌కి చెప్పా. హలో... డిసెంబర్ 22నే! విక్రమ్ (దర్శకుడు విక్రమ్ కె. కుమార్) కథ చెప్పిన తర్వాత... అతనితో ‘నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అనుకున్న దానికన్నా బాగా తీస్తావ్’ అన్నాను. కానీ, సమస్య ఏంటంటే... బాగా చెక్కుతాడు. అది మంచిదే. ఓ సినిమాకి అలాంటి దర్శకుడు కావాలి. అఖిల్ వయసుకి సరైన సినిమా. ఓ అందమైన ప్రేమకథ. అక్టోబర్ 15కి షూటింగ్ పూర్తి చేస్తానని విక్రమ్ ప్రామిస్ చేశాడు. వర్షాల వల్ల ఓ వారం ఆలస్యం కావొచ్చు! డిసెంబర్ 22న విడుదల చేస్తాం. ఆల్రెడీ థియేటర్లకు చెప్పేశాం. అందువల్ల, విక్రమ్‌పై ప్రెజర్ పెడుతున్నా. డిసెంబర్ దాటితే మళ్లీ పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. ప్రతిరోజూ విక్రమ్‌కి ఫోన్ చేసి... షూటింగ్, ఎడిటింగ్, రీ–రికార్డింగ్ పనులు ఎంతవరకూ వచ్చాయో కనుకుంటున్నా! అభిమానిగా కాదు... దర్శకుడిగా తీయాలి! చందూ (దర్శకుడు చందూ మొండేటి) నాకు పెద్ద ఫ్యాన్. అతనితో తప్పకుండా సినిమా చేస్తా. అయితే... అభిమానిగా కాదు, దర్శకుడిగా సినిమా తీయమని చెప్పా. (నవ్వుతూ...) అభిమానిగా తీస్తే (సినిమాని) ఎవరూ చూడరు! గతంలో పోలీస్ నేపథ్యంలో నాకో కథ చెప్పాడు. చైతూతో తీయబోయే ‘సవ్యసాచి’ కథనూ చెప్పాడు. అద్భుతంగా ఉందది. నాన్నగారి కల... అందుకని డబ్బు గురించి ఆలోచించడం లేదు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్‌తో ఈ ఏడాది ఓ సినిమా తీస్తాం! యాక్టర్స్, టెక్నిషియన్స్, సిన్మా టీమ్ అంతా స్కూల్ స్టూడెంట్సే. మంచి కథతో వస్తే... సినిమా తీయాలని కొంత ఫండ్ పక్కన పెట్టడం కూడా జరిగింది. ‘స్క్రిప్ట్ ల్యాబ్’ అని వాళ్లు ఓ కేటగిరీ పెట్టుకున్నారు. ప్రస్తుతం కథలు తయారు చేసుకుంటున్నారు. ఆ సినిమా నుంచి మేం లాభాలేవీ ఆశించడం లేదు. నాన్–ప్రాఫిటబుల్ వెంచర్‌గా చూస్తున్నాం. నాన్నగారి కల అది (ఫిల్మ్ స్కూల్). ఆయన మాకు ఇచ్చింది చాలు! ఆయన కల నుంచి మేం డబ్బులు సంపాదించాలనుకోవడం లేదు. అమలకు నేను చెప్పను... అమల నాకు చెప్పదు! రీసెంట్గా అమల ఓ హిందీ సినిమా అంగీకరించింది. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్లో. కథేంటి? అని అమలను అడగలేదు. నా సినిమా కథలను అమలకు చెప్పను. అలాగే, తను చేయబోయే సినిమా కథలను నాకు చెప్పదు (నవ్వులు). ‘మీరు హిందీలో చేసి చాలా రోజులైంది?’ అనడిగితే... ‘ఇప్పుడు నాకు మంచి రోల్స్ ఇస్తారా? నేను అక్కడికి వెళ్లి, వాళ్ల వెంటపడి... మంచి రోల్స్ ఇవ్వమని అడగడం ఎందుకు? మన దగ్గర బ్రహ్మాండమైన రోల్స్ వస్తున్నాయి కదా!’ అన్నారు నాగార్జున. మండే మార్నింగ్ షో... వన్ డాలరే! ఈ మధ్యన ఏమైందంటే... వీకెండ్స్ లేదా హాలిడేస్‌లో థియేటర్లకొస్తున్నారు. అందువల్ల, పండగలకు పెద్ద హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. యాక్చువల్లీ... అమెరికాలో వీక్ డేస్‌లో టికెట్ రేటు 4 డాలర్లు, వీకెండ్స్‌లో 18 నుంచి 20 డాలర్ల వరకూ ఉంటోంది. ఎంత హిట్ సినిమా అయినా సోమ, మంగళ వారాల్లో 3, 4 డాలర్లు ఉంటోంది. మండే మార్నింగ్ షో అయితే ఒక్క డాలరే. ఇప్పుడిప్పుడే ఇటువంటి ట్రెండ్ బెంగళూరు, ముంబయ్‌లలో వస్తోంది. రెండు మూడేళ్లలో మన దగ్గరికీ వస్తుందనుకుంటున్నా! వాట్ నెక్ట్స్? నానితో ఓ సినిమా చర్చల దశలో ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. బ్యూటిఫుల్ స్క్రిప్ట్! అన్నీ కుదిరితే... జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. అందులో మాంచి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేయబోతున్నా! -
పెళ్లి తరువాత బాలీవుడ్ ఎంట్రీ
సినీ రంగంలో పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టే అని భావిస్తున్నారు. కానీ అందరి విషయంలో అలా జరగదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి తారలు పెళ్లి తరువాత కూడా గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే సౌత్ లో అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ. దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు ఇప్పటి వరకు దక్షిణాది ప్రేక్షకులను మాత్రమే అలరించిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సామ్. ప్రస్తుతం రాజుగారి గది 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ నెల 6న నాగచైతన్యను పెళ్లాడనున్న ఈ భామ, తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి షూటింగ్ లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. -
అలాంటివి నాకు అలవాటు లేదు
చెన్నై: హీరోయిన్ సమంతకు పెళ్లి కల వచ్చేసింది. అక్టోబర్ ఆరో తేదీన సమంత- నాగచైతన్యల వివాహం జరగబోతుంది. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది క్రిష్టియన్ మత సంప్రదాయం ప్రకారం ఒకసారి, ప్రియుడి మతం హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి అంటూ రెండుసార్లు పెళ్లి, ముచ్చటగా మూడోసారి వివాహ రిసెప్షన్ అంటూ ముస్తాబవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే తన పెళ్లికి స్పెషల్ దుస్తులు సిద్ధం చేసుకున్న సమంత మరో పక్క చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. సమంత కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది-2 చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాక విజయ్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం మెర్శల్ తన పెళ్లి సమయంలోనే తెరపైకి రానుంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సమంత తానేమంత అందగత్తెను కాదని బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ బ్యూటీ సౌందర్య రహస్యం గురించి చెబుతూ.. నిజానికి తాను అందంగా ఉండాలని మాత్రమే కోరుకోనన్నారు. అందంతో పాటు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటానని అన్నారు. అందుకే విలువిద్య నేర్చుకున్నానని నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నానని సమంత చెప్పారు. ఉదయం షూటింగ్ ఉన్నా అంతకు ముందే జిమ్‌కు వెళ్లతానన్నారు. ఆకలితో ఉండడం, ఉపవాసాలు చేయడం లాంటివి తనకు అలవాటు లేదన్నారు. ప్రొటీనులు ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తీసుకుంటానని, ఫ్రెస్ జ్యూస్, కొబ్బరి నీళ్లు తరచూ తాగుతానని చెప్పారు. పోషకాహారాలే అందాన్ని మిలమిల మెరిసేలా చేస్తాయని సమంత పేర్కొన్నారు. -
సమంత ఏడిపించేసింది..!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మామ అక్కినేని నాగార్జునతో కలిసి రాజుగారి గది 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సమంతది అతిథి పాత్రే అయినా ఎంతో కీలకమన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాథ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సమంత సినీ రంగంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న చిన్మయి ఈ సినిమాలోనూ సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పింది. రాజుగారి గది 2 డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత సమంత నటన గురించి ట్వీట్ చేసింది చిన్మయి. 'రాజుగారి గది 2 చిత్రంలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పటం పూర్తయ్యింది. తనకు డబ్బింగ్ చెపుతున్న సమయంలో ఏడ్చేశాను. తను అద్భుతంగా నటించింది' అంటూ ట్వీట్ చేసింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా కనిపించనున్నాడు. I dubbed for @Samanthaprabhu2 in Raju Gari Gadhi 2 and ended up crying while dubbing for her. She killed it. https://t.co/QzUO0Ptjxp — Chinmayi Sripaada (@Chinmayi) 21 September 2017 -
నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!
– నాగార్జున ‘నాన్న (అక్కినేని నాగేశ్వరరావు)గారు లేరు అనడం తప్పు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉన్నారు. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు’’ అన్నారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఏయన్నార్ జయంతి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి పుట్టిన రోజు సెప్టెంబర్ 20న మా ఫ్యామిలీ అంతా ఆయన ఇంట్లోనే బ్రేక్‌పాస్ట్‌కి తప్పనిసరిగా కలుస్తాం. ఇప్పుడు అక్కణ్ణుంచే వస్తున్నాను. అక్కడికి వెళిన వెంటనే ఒక చిరునవ్వు, తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. ‘రాజుగారి గది 2’కి నా అనుభవంతో చిన్న ఇన్పుట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఓంకార్ చేసిన ట్రైలర్ నచ్చలేదన్నా. ఒక రోజు టైమ్ తీసుకుని, మంచి ట్రైలర్ కట్ చేశారు. సినిమాలో నేను మెంటలిస్ట్ క్యారెక్టర్ చేశా. సమంత, శీరత్లలో ఎవరు దెయ్యం అనేది ఆసక్తికరం. పీవీపీగారు ఖర్చకు వెనకాడకుండా సినిమాను పూర్తి చేశారు. తమన్ మ్యూజిక్ హైలైట్. అక్టోబర్ 13 కోసం వెయిట్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఏయన్నార్‌గారి పుట్టిన రోజునాడు మా సినిమా ట్రైలర్ విడుదల కావడం హ్యాపీ. అవుట్‌పుట్ బాగా రావడంలో నాగార్జునగారు సపోర్ట్ చేశారు’’ అన్నారు నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి. ‘‘కథ విన్న 5 నిమిషాల్లోనే నాగార్జునగారు ఒప్పుకున్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని అక్టోబర్ 13న నిజం చేసుకుంటానని అనుకుంటున్నాను’’ అన్నారు ఓంకార్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ జగన్‌తోపాటు చిత్రబృందం పాల్గొన్నారు. -
రాజుగారు గుమ్మడికాయ కొట్టేశారు
రాజుగారు రెండో గదికి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతానికి గది తలుపులు మూసుకున్నాయ్. వచ్చే నెల 13న థియేటర్ల తలుపులు తెరుచుకుంటాయ్. అప్పుడు రాజుగారు అండ్ కో గదిలో ఏం చేశారనేది అందరికీ తెలుస్తుంది. నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. సమంత, సీరత్ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, ప్రవీణ్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. గుమ్మడికాయ కూడా కొట్టేశారు. చిత్రీకరణ చివరి రోజున నాగార్జున, ‘వెన్నెల’ కిశోర్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను నాగార్జున మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేశారు. ఫస్టాఫ్ రీ–రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్... పూర్తయ్యాయట. మరో పది రోజుల్లో సెకండాఫ్ వర్క్ కూడా పూర్తవుతుంది. వచ్చే నెల 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిన్మాలో నాగార్జున మెంటలిస్ట్‌గా, సమంత దెయ్యంగా, సీరత్ డ్యాన్సర్‌గా నటించారు. కాజల్ అగర్వాల్ అతిథి పాత్ర చేశారట. చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
అందమైన దెయ్యాన్ని చూశారా!?
ఏంటి... మీరు ఇంకా చూడలేదా? అయితే త్వరగా ఇన్సెట్ ఫొటోపై ఓ లుక్కేయండి. అందులో ఉన్నది దెయ్యమే. సమంతను దెయ్యం అనేస్తున్నారేంటి? అనొద్దు. ఎందుకంటే... నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజుగారి గది–2’లో ఆమె దెయ్యంగానే నటిస్తున్నారు మరి. ఈ దెయ్యం భలే అందంగా ఉంది కదూ! శుక్రవారంతో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేశారు. సిన్మాలో చాలా ఆసక్తికరమైన పాత్ర పోషించానని ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయినట్లే. మరో రెండు మూడు రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందట! ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ మొదలైంది. ‘‘ఓంకార్ పర్ఫెక్షనిస్ట్. డబ్బింగ్ చెబుతున్నాను కదా! సినిమా బాగా వచ్చింది. మరో పది రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది’’ అన్నారు నాగార్జున. ఇందులో ఆయనది మెంటలిస్ట్ పాత్ర. దెయ్యానికి, మెంటలిస్ట్కి మధ్య జరిగే డ్రామాయే సినిమా. సీరత్ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
థ్యాంక్స్ డియర్ కోడలా : నాగ్
కింగ్ నాగార్జున ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పోస్టర్ రిలీజ్ చేయటంతో పాటు తన మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది సమంత. 'ఆయన ఎప్పటికీ రాజే. ఎందుకంటే తనని తాను ఎలా పరిపాలించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతీ ఏడాది గడుస్తున్న కొద్ది మా మామ మరింత గొప్పగా పాలిస్తున్నారు' అంటూ ట్వీట్ చేసింది సమంత. సమంత ట్వీట్ పై స్పందించిన నాగ్ ' థ్యాంక్స్ డియర్ కోడలా.. నువ్వ్ బెస్ట్' అంటూ రిప్లై ఇచ్చాడు. (1/3)He is indeed the KING , because he has always known how to rule himself. With every passing year my mama rules greater @iamnagarjuna — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 29 August 2017 (2/3) #HBDKingNagarjuna #RajuGariGadhi2 #firstlookmotionposter https://t.co/J6xOySw2Tc @PVPCinema @MusicThaman #ohmkaar @vennelakishore — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 29 August 2017 (3/3) See you in the theatres soon !! #horrorrules — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 29 August 2017 Thanks dear Kodala!! you are the best @Samanthaprabhu2 https://t.co/wUts5MQ4cZ — Nagarjuna Akkineni (@iamnagarjuna) 29 August 2017 -
ప్రేమ ఉన్న చోట ఒత్తిడి ఉంటుంది!
‘‘నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, భర్తగా, నాన్నగా లైఫ్ ఎలా ఉంది? త్వరలోనే మావయ్య కూడా కాబోతున్నారు’’ అనడిగితే... ‘‘నెక్ట్స్ ఏంటి? తాతయ్య అంటారా!’’ అని నవ్వేశారు నాగార్జున. ఎప్పుడూ హ్యాండ్సమ్గా, హ్యాపీగా కనిపించే నాగ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. నాగార్జున చెప్పిన విశేషాలు... ► బర్త్‌డేకి ఏం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు పిల్లలొచ్చారు కదా! వాళ్లకు అప్పజెప్పా, చూసుకుంటున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా హ్యాపీ. చైతూ (నాగచైతన్య) హీరోగా మా బేనర్లో నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ మంచి హిట్టయింది. త్వరలో వాడి పెళ్లి. అలాగే, అఖిల్ హీరోగా నిర్మిస్తున్న ‘హలో’ బాగా వస్తోంది. నేను హీరోగా నటించిన ‘రాజుగారి గది–2’ బాగా వచ్చింది. అభిమానులు, మేమూ అందరూ హ్యాపీ. ► ‘రాజుగారి గది–2’లో నేను ‘మెంటలిస్ట్’ క్యారెక్టర్ చేస్తున్నా. రియల్ లైఫ్‌లో అలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గుర్ని కలిశా. వాళ్లకు అబ్జర్వేషన్ పవర్స్ ఎక్కువ. మిర్రర్ మెమరీ ఉంటుంది. అంటే... 20 ఏళ్ల క్రితం జరిగిన అంశాలు వాళ్లకు గుర్తుంటాయి. ఈ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. మలయాళ ‘ప్రేతమ్’ స్ఫూర్తితో ఈ సిన్మా తీశాం. బట్, సేమ్ టు సేమ్ తీయలేదు. ఇందులో సమంత దెయ్యంగా నటించింది. ఆత్మగానూ కనిపిస్తుంది. మా మధ్య ఉండే డ్రామాయే సినిమా. ► ‘రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా దెయ్యాలు ఎదురయ్యాయా?’ అనడిగితే... ‘‘ఊహించుకోవడమే. చిన్నప్పుడు ఏదో సౌండ్ వినపడిందని నిద్ర పట్టకపోతే... రూమ్‌లో దెయ్యం ఉందనేవారు. అబద్ధమో.. నిజమో.. ఎవరికి తెలుసు? వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏంటంటే... దేవుడున్నాడంటే? దెయ్యాలు ఉన్నట్టే కదా!’’ అన్నారు. ► చిన్నప్పుడు హారర్ ఫిల్మ్స్‌ను రెండు చెవులు మూసుకుని భయపడుతూ చూసేవాణ్ణి. (నవ్వుతూ..) ఇప్పుడూ కొన్నిసార్లు అలానే చూస్తా. షూటింగ్ చేసేటప్పుడు అంతేమీ ఉండదు. నాకెప్పుడూ లైటర్వీన్ హారర్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. మరీ ఎక్కువ హారర్ అంటే కష్టం. ► ఓంకార్ మిస్టర్ పర్ఫెక్ట్. అనుకున్నది అనుకున్నట్టుగా కరెక్టుగా తీస్తాడు. వెరీ క్లియర్. అప్పుడు నటీనటులకు సులభమవుతుంది. ఈ సినిమాలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పేశా. రీ–రికార్డింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 10కి ఫస్ట్ కాపీ వస్తుంది. ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్. నా కామెడీ తక్కువ... ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, అశ్విన్‌లది ఎక్కువ. బేసిక్‌గా సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. ► నెక్ట్స్ సిన్మా ఏంటనేది ఇంకా ఆలోచించుకోలేదు. ‘బంగార్రాజు’ కోసమని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కొన్ని లైన్స్ చెప్పాడు. పక్కా సీక్వెల్ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కి) కదా! కథ బాగుండాలి. లేదంటే చేయకూడదు. తమిళ హిట్ ‘విక్రమ్‌వేద’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారట? అనడిగితే... ‘‘నేనింకా ఆ సిన్మా చూడలేదు. చేయమని అడిగారు. చూడాలి’’ అన్నారు. చైతూ పెళ్లికి నేనూ అతిథినే! చైతూ పెళ్లికి నేనూ అతిథినే. అంతా వాళ్లే చూసుకుంటామని చెప్పారు. (నవ్వుతూ...) చెక్ మీద సంతకం మాత్రం పెట్టమన్నారు. అక్టోబర్ 6న గోవాలో హిందూ–క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం పెళ్లి జరుగుతుంది. పెళ్లి వేడుక చిన్నగా చేసుకుంటామన్నారు. ఆ తర్వాత రిసెప్షన్ ఎలా చేయాలనేది నేను ప్లాన్ చేయాలి. ఆవకాయ్...అభిమానమ్! ఏదైనా బాగోలేదని అనుకుంటున్నప్పుడు అభిమానుల నుంచి ఫోన్స్ వస్తాయి. మాట్లాడితే... అంతా సెట్ రైట్ అవుతుంది. టెలిపతీతో తెలుసుకుంటారో? మరొకటో? నాకు తెలీదు. కొంతమందిని కలుస్తుంటాను. ఏజ్డ్ ఫ్యాన్స్. నాన్నగారి దగ్గర్నుంచి, నా చిన్నప్పట్నుంచి తెలుసు. ప్రతి ఏడాది నాన్నగారికి ఎన్నో రకాల ఆవకాయ పచ్చళ్లు వస్తాయని నాకు తెలీదు. నాన్నగారు లేరు కదా! ఇప్పుడవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో పచ్చళ్లు, సీట్స్ రకరకాలు వస్తున్నాయి. తెలుగు యాక్టర్స్‌కు అదొక వరం! నేనెప్పుడూ అభిమానులకు రుణపడి ఉంటాను. నాన్నగారి (ఏయన్నార్) పేరు మీద ఇచ్చే ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ల గురించి మరో వారంలో ప్రెస్‌మీట్ పెట్టి చెబుతా. హలో... నేనే చెప్పా! ప్రేమించిన అమ్మాయి దగ్గర్నుంచి ‘హలో’ అనే ఒక్క పదం కోసం వెయిట్ చేసే ఓ అబ్బాయి కథే అఖిల్ సిన్మా. ఆర్నెల్ల నుంచి టైటిల్ ఏంటని ఆలోచిస్తున్నారు. సాధారణంగా నాకు మంచి ఆలోచనలన్నీ ఉదయం ఆరు నుంచి ఆరున్నర లోపు వస్తాయి! ఎందుకంటే... మంచిగా వర్కౌట్స్ చేసి కూర్చుంటాం. మైండ్ ఫ్రెష్‌గా వర్క్ చేస్తుంది. సడన్‌గా ఓ రోజు ‘హలో’ బాగుంటుందనే ఐడియా వచ్చింది. సుప్రియకు ఫోన్ చేసి ‘హలో’ టైటిల్ రిజిస్టర్ చేయించమని చెప్పా. ఇందులో హీరోయిన్ కోసం... ‘గీతాంజలి’లో గిరిజలా, ‘ఏమాయ చేసావే’లో సమంతలా కొత్తగా ఉండే అమ్మాయి కోసం వెతికి, వెతికి చివరకు దర్శకుడు ప్రియదర్శన్గారమ్మాయి (కల్యాణీ)ని ఎంపిక చేశాం. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్! టైటిల్ ఎనౌన్స్ చేసే వీడియోలో రామారావుగారితో (సీనియర్ ఎన్టీఆర్) స్టార్ట్ చేయించి, నాన్నతో ఫినిష్ చేయించి ‘హలో’ టైటిల్ ప్రకటిద్దామనుకున్నాం. టైమ్‌కి పెద్దాయన క్లిప్ దొరకలేదు. అందుకని, తారక్‌ను (చిన్న ఎన్టీఆర్) అడిగాం. తను, అఖిల్ మంచి ఫ్రెండ్స్. లీకులు స్ట్రాటజీ కాదు! ‘హలో’ పోస్టర్ డిజైనింగ్ కోసమని హాంకాంగ్‌లో ఉన్న ఫ్రెండ్‌కి విక్రమ్ కుమార్ స్టిల్ పంపించాడు. ‘మనం’కూ అతనే పోస్టర్స్ డిజైన్ చేశాడు. అక్కడతను వాళ్ల గాళ్ఫ్రెండ్కో, ఎవరికో ఫేస్ బుక్‌లో పెట్టాడు. అక్కణ్ణుంచి స్టిల్ బయటకొచ్చింది. ఏదో స్ట్రాటజీతో మేం లీక్ చేయలేదు. అప్పటికి టైటిల్ లోగో కూడా అనుకోలేదు. లక్కీగా రెండు మూడు పోస్టర్లు చేయడంతో నెక్ట్స్ మంచిది విడుదల చేశాం. ‘‘ఇప్పుడీ ‘హలో’, మొన్న ‘రారండోయ్.. వేడుక చూద్దాం!’లకు మీరే నిర్మాత. మీ అబ్బాయిల సిన్మాలనే ఒత్తిడి ఏమైనా ఉందా?’’ అనడిగితే... ‘‘ఉంటుంది కదా! ప్రేమ ఉంటుంది కదా! అది ఉంటే ఒత్తిడి వస్తుంది’’ అన్నారు. -
దెయ్యాల అంతు చూసే రాజు..
ముందూ వెనకా భటులు లేరు. ఒంటి మీద అభరణాలు లేవు. సూచనలు ఇచ్చేందుకు పక్కన మంత్రి లేడు. ఒంటరిగానే రాజుగారు పల్లెటూళ్లోకి అడుగుపెట్టారు. అదేంటీ ఏ రాజైనా ఇలా ఉంటాడా? అనే డౌట్ రావచ్చు. ఈ రాజుగారు ఆ కాలం నాటి రాజు కాదు. ఈ కాలపు రాజు. స్టైలిష్ కింగ్. స్టైల్‌కి చిరునామా అన్నట్లుగా ఉండే నాగార్జున ఈ కింగ్ క్యారెక్టర్ చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది–2’. ఈ కింగ్ దెయ్యాల అంతు చూస్తాడు. ఓకే ఎంటర్టైన్మెంట్స్, పీవీవీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. నాగ్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్‌కపూర్ కథానాయికలు. ఇటీవలే పాండిచ్చేరిలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పల్లెటూరి నేపథ్యంలో సాగే సీన్లు తీస్తున్నారు. -
మనసులను చదివే మన్మథుడు!
బాబు... ఓ లుక్కేయండి ఇటు. ‘రాజుగారి గది–2’లో నాగార్జున లుక్ బయటకు వచ్చేసింది. లేదు... లేదు... ఆయనే బయట పెట్టేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ లుక్‌లో మన్మథుడు మాంచి స్టైలిష్‌గా ఉన్నారు కదూ! ఇంకోసారి ఒళ్లంతా కళ్లు చేసుకుని లుక్కేయండి. స్టైల్‌తో పాటు భక్తి కూడా కనిపిస్తుంది. మెడలో త్రిశూలం... చేతికి ఓంకారం తాయత్తులు... వేలికి ఉంగరాలు ధరించారు. ఇవన్నీ ఎందుకనే డౌట్ వచ్చిందా? మరి, ఆయన చేస్తున్నది మామూలు పాత్ర కాదు... ఈ హారర్ థ్రిల్లర్‌లో నాగ్‌ది మెంటలిస్ట్ క్యారెక్టర్. దెయ్యాలతో పాటు మనుషుల మనసులను చదవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా! ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నాగార్జున, సీనియర్ నరేశ్‌లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. పాండిచ్చేరిలో 20 రోజులు జరగనున్న ఈ మూడో షెడ్యూల్‌తో 70 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. సమంత, సీరత్ కపూర్ కథానాయికలుగా, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్ ప్రకాశ్, కెమేరా: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
రాజుగారూ... మీరు మామూలోరు కాదు!
ఈ రాజుగారి దగ్గరకు వెళుతున్నారా? అయితే.. తనువూ మనసూ రెండూ జాగ్రత్త సుమా! ఎందుకంటే... మీ మనసులో ఆలోచనలను చదివేస్తారు. అంతేనా.. రాజుగారి దగ్గర అసాధారణ శక్తులున్నాయి. మీపై ఆ శక్తులను ప్రయోగించినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే... ఈయన ‘మెంటలిస్ట్’ అన్నమాట. నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది–2’. ఇందులో నాగార్జున ‘మెంటలిస్ట్’ పాత్రలో నటిస్తున్నారట! ‘రాజుగారి గది’లో ఇలాంటి పాత్ర లేదు. సీక్వెల్లో కొత్తగా సృష్టించారు. అది కూడా నాగార్జున ఇమేజ్‌కి తగ్గట్టు సై్టలిష్‌గా డిజైన్ చేశారట! ‘‘సినిమాలో నాగార్జున ఓ ఫ్యాన్సీ బైక్ రైడ్ చేస్తూ కనిపిస్తారు. ఇందులో సమంత కీలక పాత్ర చేస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టు ఆమె నాగార్జునకు జోడీగా నటించడం లేదు. సమంత నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది’’ అని చిత్రబృందం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరి, సమంత దెయ్యంగా నటిస్తున్నారా? అనడిగితే.. ‘‘ఇప్పుడే అవన్నీ చెప్పడం కష్టం. ఇప్పటివరకూ చేయనటువంటి పాత్ర చేస్తున్నారామె’’ అన్నారు. సీరత్ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
మామగారి సినిమాలో సమంత
ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. టీవీ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్‌గా సక్సెస్ సాధించిన ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన రాజుగారి గది సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్‌ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
రాజుగారు మళ్లీ వస్తున్నారు
రాజుగారి గది 2 , ఓంకార్ ,పొట్లూరి వి. ప్రసాద్ ‘‘గతేడాది చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘రాజుగారి గది’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓంకార్. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ ఏడాది ‘క్షణం’, ‘ఊపిరి’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ పీవీపీ. ‘రాజుగారి గది 2’ని నిర్మించడానికి ఈ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ ముందుకొచ్చారు. ఈ సీక్వెల్‌కి అగ్ర నిర్మాణ సంస్థ తోడవడంతో భారీ తారాగణంతో పాటు మంచి టెక్నిషియన్లను కూడా తీసుకుంటున్నామని దర్శకుడు ఓంకార్ అన్నారు. మొదటి భాగంకన్నా రెండో భాగం ఇంకా క్వాలిటీగా ఉంటుందన్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలు.