రాజుగారి గది 2 సెన్సార్ పూర్తి | Raju Gari Gadhi 2 gets UA from Censor Board | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న రాజుగారి గది 2

Published Sat, Oct 7 2017 2:02 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Raju Gari Gadhi 2 - Sakshi

కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం రాజుగారి గది 2. మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంకార్ దర్శకుడు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించారు. రాజుగారి గదిలో హీరోగా నటించిన అశ్విన్ తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఓం నమో వేంకటేశాయ సినిమాతో నిరాశపరిచిన నాగ్, ఈసినిమాతో సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement