సమంత ఏడిపించేసింది..! | Chinmayi Sripaada about Samantha in RajuGari gadhi 2 | Sakshi
Sakshi News home page

సమంత ఏడిపించేసింది..!

Published Sat, Sep 23 2017 11:30 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Chinmayi Sripaada about Samantha in RajuGari gadhi 2 - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మామ అక్కినేని నాగార్జునతో కలిసి రాజుగారి గది 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సమంతది అతిథి పాత్రే అయినా ఎంతో కీలకమన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాథ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సమంత సినీ రంగంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న చిన్మయి ఈ సినిమాలోనూ సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పింది.

రాజుగారి గది 2 డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత సమంత నటన గురించి ట్వీట్ చేసింది చిన్మయి. 'రాజుగారి గది 2 చిత్రంలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పటం పూర్తయ్యింది. తనకు డబ్బింగ్ చెపుతున్న సమయంలో ఏడ్చేశాను. తను అద్భుతంగా నటించింది' అంటూ ట్వీట్ చేసింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement