రాజు గారి గదిలోకి అంజలి | heroine anjali in rajugari gadhi sequal | Sakshi
Sakshi News home page

రాజు గారి గదిలోకి అంజలి

Jan 2 2016 7:09 AM | Updated on Sep 3 2017 2:58 PM

రాజు గారి గదిలోకి అంజలి

రాజు గారి గదిలోకి అంజలి

గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన మూవీ రాజుగారి గది. జీనియస్ ఫెయిల్యూర్ తరువాత విరామం తీసుకున్న ఓంకార్, రాజు గారి గది సినిమాతో మరోసారి దర్శకుడిగా తన...

గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన మూవీ రాజుగారి గది. జీనియస్ ఫెయిల్యూర్ తరువాత విరామం తీసుకున్న ఓంకార్, రాజు గారి గది సినిమాతో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో రూపొంది 7 కోట్లకు పైగా వసూళు చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్.

ఇప్పటికే కథాకథనాలను కూడా రెడీ చేసిన ఓంకార్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. అయితే తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్లో కొత్త వారితో తెరకెక్కించినా.. రెండో భాగాన్ని మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హర్రర్ సినిమా చేసిన అంజలి మరోసారి అదే తరహా పాత్రలో నటించడానికి అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజుగారి గది సీక్వల్కు అంజలి గ్లామర్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement