Sequal
-
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్...
-
సవ్యంగా సాగిపోవాలి
తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
న్యూ ఇయర్ గిఫ్ట్
సమాజంలో లంచాన్ని నిర్మూలించాలని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్ పోరాటం చేశారు. ఇప్పుడు మరోసారి సేనాపతిగా తిరిగి రానున్న సంగతి తెలిసిందే. ఈ సేనాపతి తమిళ కొత్త సంవత్సరం రోజున థియేటర్స్‌లోకి రానున్నారని టాక్. కమల్‌హాసన్ – దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. -
స్క్రీన్ ప్లే 16th July 2018
-
కొత్త ఇడియట్!
తెలుగులో ‘ఇడియట్’ అనగానే... హీరో రవితేజ నటించిన చిత్రం గుర్తొస్తుంది. అదే త్రీ ఇడియట్స్ అంటే ఆమిర్‌ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి నటించిన చిత్రం గుర్తొస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ ముగ్గురూ ముఖ్య పాత్రలు చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజ్‌కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇప్పుడీ విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కన్ఫార్మ్ చేశారని బీటౌన్ టాక్. ‘‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నప్పుడు రాజ్సర్ నన్ను కలిశారు. గొప్ప ఫిల్మ్‌మేకర్. ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ’’ అని పేర్కొన్నారు రణబీర్ కపూర్. అంటే ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ఇడియట్ దొరికాడన్నమాట. మరోవైపు రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనే రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ఆటోడ్రైవర్
సాయి పల్లవికి కారు నడపడం బాగా వచ్చు. ‘ఫిదా’ సినిమాలో వరుణ్ తేజ్‌ని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుని, రయ్‌మని కారులో తీసుకెళ్లే సీన్ గుర్తు చేసుకోండి. అదే సినిమాలో ఈ బ్యూటీ ధైర్యంగా ట్రాక్టర్ నడిపారు. అదే సినిమాలో స్కూటీని కూడా సునాయాసంగా నడిపారు. ఇప్పుడు తమిళ చిత్రం ‘మారీ 2’ కోసం ఆటో నడుపుతున్నారు. ఈ సినిమాలో ఆమె ఆటో డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఆటో ఎలా నడపాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ధనుష్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘మారీ’కి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్‌లో కాజల్ కథానాయికగా నటించగా, రెండో పార్ట్‌లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఏ పాత్ర అయినా ఈజీగా చేసేసే సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా æశర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలోనూ, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్జీకె’ చిత్రంలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. -
కమల్‌తో జోడి కుదిరినట్టేనా?
తమిళసినిమా: విశ్వనటుడు కమలహాసన్ ఒక పక్క రాజకీయపార్టీ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, మరో పక్క సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. ఈనెల 21న పార్టీ పేరు, గుర్తును ప్రకటించడానికి కార్యోణ్ముఖుడవుతున్నారు. అదే సమయంలో తాను స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరువాత సగం వరకూ చిత్రీకరణను పూర్తి చేసిన శభాష్‌నాయుడు చిత్రంపై దృష్టిసారించనున్నారట. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 (భారతీయుడు చిత్రానికి సీక్వెల్)లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ చిత్రంలో అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించిన కమలహాసన్ సీక్వెల్లోనూ అవనీతిపై పోరాడే పాత్రలోనే నటించనున్నారట. అయితే ఇందులో ఆయన గెటప్ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రా నిర్మాణంతర కాక్యక్రమాలతో బిజీగా ఉన్న శంకర్ ఇటీవల తైవాన్ నగరంలో ఇండియన్–2 పోస్టర్‌తో భారీ బెలూన్ను ఎగురవేసి ఆ చిత్రంపై మరింత అటెన్షన్‌ను తీసుకొచ్చారు. 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్నే ఇండియన్–2 చిత్రాన్ని నిర్మించనుందట. ఇది ఇంతకు ముందు కమల్ నటించిన చిత్రాలన్నిటి కంటే అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. నాయకిగా నయన్? ఇందులో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా అగ్రనటి నయనతార నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్. అంతే కాదు ఇందులో నయనతార విప్లవ నారిగా నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదే గనుక నిజం అయితే కమల్‌తో నయన్ నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇండియన్–2 చిత్రంలో వైగైపులి వడివేలు హాస్యభూమికను పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెడువడే అవకాశం ఉంది. -
జుమాంజీ సీక్వెల్ వస్తోంది!
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే కథా ఇతివృత్తాలతో కూడిన చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ఈ మధ్య వచ్చిన జంగిల్‌బుక్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1995 వచ్చిన అమెరికన్ ఫాంటసీ ఎడ్వెంచర్ చిత్రం జుమాంజీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత దానికి సీక్వెల్‌గా 2006లో జతువా ఏ స్పేస్ ఎడ్వెంచర్ పేరుతో ఒక చిత్రం వచ్చింది. తాజాగా జుమాంజీ వెల్కమ్ టూ జంగిల్ పేరుతో సూపర్ థ్రిల్లర్ ఎడ్వెంచర్ చిత్రం త్వరలో ఆంగ్లం, తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. 1995లో వచ్చిన జుమాంజీ చిత్రానికి అసలు సీక్వెల్ ఇదేనంటున్నారు చిత్ర యూనిట్. కొలంబియా పిక్చర్స్ సమర్పణలో మట్ట్ టోల్మచ్, సెవన్ బక్స్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మించిన ఈ భారీ థ్రిల్లర్ ఎడ్వెంచర్ చిత్రంలో దాయ్నే జాన్సన్, జాక్బ్లక్స్, మెన్హర్ట్, కరిన్గిలాన్, మార్గన్డర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నలుగురు పాఠశాల విద్యార్థుల ఇతి వృత్తంగా సాగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపారు. ఆ విద్యార్థులకు ఒక పాత వీడియో గేమ్ లభిస్తుందన్నారు. అది వారిని ఎలాంటి పరిణామాలకు గురి చేసిందనేదే చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. చిత్రంలో థ్రిల్లింగ్‌తో కూడిన పలు ఎడ్వెంచర్ సన్నివేశాలు పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తాయంటున్నారు. -
పారిపోతున్నా..!
...అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె ఎవరితో పారిపోతున్నారని ఎగై్జటింగ్‌గా ఆలోచించకండి. ఆమె పారిపోవడానికి రెడీ అయ్యింది రీల్ లైఫ్‌లో. ఇంతకీ మేటర్ ఏంటంటే... ముదసర్ అజీజ్ దర్శకత్వంలో డైనా, అభయ్ డియోల్, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్ ముఖ్య తారలుగా గతేడాది బాలీవుడ్లో రూపొందించిన చిత్రం ‘హ్యాపీ భాగ్ జాయేగి’. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అజీజ్. ‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ నటీనటులతోపాటు సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. మంగళవారం రెండో షూట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. ‘‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్ సెకండ్ షెడ్యూల్ స్టార్టయ్యింది. ఇట్స్ టైమ్.. రెడీ టు రన్’’ అని పేర్కొన్నారు సోనాక్షి సిన్హా. ఫస్ట్ పార్ట్‌లో హ్యాపీ క్యారెక్టర్లో నటించిన డైనా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమికుణ్ని కలవడానికి పాకిస్తాన్ పారిపోతుంది. ఫైనల్‌గా కథ సుఖాంతం అవుతుంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తున్నారు. అంటే.. సోనాక్షి సిన్హా ఎక్కడికి పారిపోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లో బొమ్మపడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. -
న్యూ ఇయర్.. న్యూ మూవీ...
పరాయి దేశంలో అక్కడి భాష సరిగా రాకపోతే ఇక్కట్లు తప్పవు. లోకల్ లాంగ్వేజ్ వచ్చినవారు ఎవరైనా తోడుంటే పర్లేదు. కానీ, ఒంటరి ప్రయాణం చేస్తే మాత్రం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయక తప్పదు. అయితే అక్కడే లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు భాష నేర్చుకోవడంలో తప్పు లేదు. అందుకు వయసుతో సంబంధంలేదు. తక్కువ టైమ్‌లోనే భాష నేర్చుకుని అక్కడి లోకల్ పీపుల్స్‌కు దీటుగా మాట్లాడగలిగితే గ్రేట్. రీల్ లైఫ్‌లో శ్రీదేవి ఇదే పని చేసి, ప్రేక్షకుల చేత గ్రేట్ అనిపించుకున్నారు. పైన చెప్పిన లైన్స్‌ను చదువుతున్నప్పుడు ఆమె నటించిన ‘ఇంగ్లీష్..వింగ్లీష్’ సినిమాలోని కొన్ని సీన్స్ సినిమా చూసినవారికి గుర్తొచ్చి ఉండొచ్చు. ఐదేళ్లక్రితం దర్శకురాలు గౌరీ షిండే రూపొందించిన ఈ సినిమాతోనే శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఇంగ్లీష్–వింగ్లీష్’ సినిమాకు సీక్వెల్ రూపొందించనున్నారట గౌరీ షిండే. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారన్నది బాలీవుడ్ సమాచారమ్. అంటే శ్రీదేవి కొత్త సంవత్సరంలో సరికొత్తగా న్యూ మూవీ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట. అసలు.. 2014లోనే శ్రీదేవి–గౌరీ షిండే కాంబినేషన్లో ఓ థ్రిల్లింగ్ లేడీ ఓరియంటెడ్ చిత్రం తెరకెక్కనుందని వార్తలొచ్చాయి. అయితే ఆ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదని, అందుకే ‘ఇంగ్లీష్..వింగ్లీష్’ సీక్వెల్‌ను తెరకెక్కించాలని భావిస్తున్నారన్నది బాలీవుడ్ టాక్. అంతా ఓకే అయితే ఐదేళ్ల తర్వాత హిట్ కాంబినేషన్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మరో హిట్ మూవీ చూడొచ్చని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. -
ఇప్పుడు షేర్ సింగ్
ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ల క్రితం అక్షయ్‌కుమార్, కత్రినా కైఫ్ జంటగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన ఈ సినిమాకు స్వీక్వెల్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్లో గతంలో చాలా వార్తలొచ్చాయి. అవేం నిజం కాలేదు. అయితే బాలీవుడ్ లేటేస్ట్ ఖబర్ ఏంటంటే... ‘సింగ్ ఈజ్ కింగ్’ సీక్వెల్లో రణవీర్ సింగ్ నటింబోతున్నారట. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ శైలేంద్ర సింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారట. అయితే శైలేంద్రసింగ్ సేమ్ టైటిల్ కోసం ‘సింగ్ ఈజ్ కింగ్’ చిత్రనిర్మాత విపుల్ షాను సంప్రదించగా ఆయన ఇదే టైటిల్‌ను ఇచ్చేందుకు అంగీకరించలేదట. దీంతో శైలేంద్రసింగ్ ‘షేర్సింగ్’ అనే పేరుతో సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ సమాచారమ్. ఈ సీక్వెల్‌కు రణవీర్‌సింగ్ కూడా ఓకే చెప్పారని, అంతా కరెక్ట్‌గా కుదిరితే ‘షేర్ సింగ్’ త్వరలోనే సెట్స్‌పైకి వెళతారట. -
20 దేశాలు... 200 కోట్లు!
భారతీయుడు భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడిప్పుడు! ఏమాత్రం తగ్గడం లేదు. ఖర్చులో... ఖర్చుకి రెండింతలు రాబట్టే విషయంలోనూ... ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసేశాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ‘ఇండియన్–2’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ ఇష్యూస్‌పై పొలిటికల్ ఎంట్రీకి ముందు కమల్ నటించే సిన్మా కావడం... సోషల్ ఇష్యూస్‌తో సిన్మాలు తీయడంతో స్పెషలిస్ట్ అయిన శంకర్, ‘2.0’ తర్వాత తీయబోయే సిన్మా కావడంతో ఆల్రెడీ ‘ఇండియన్–2’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పట్నుంచి సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాను భారీ లెవల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ‘ఇండియన్–2’ను పలు భాషల్లో అనువదించి, దాదాపు 20 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట!! -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: మార్కెట్ పడిపోయింది. అవకాశాలు లేవు. ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనే టాక్ స్ప్రెడ్ అయినప్పుడల్లా నటి తమన్నాకు అవకాశాలు తలుపుతడుతూ ఆ ప్రచారం తప్పని సమాధానాన్ని ఇస్తున్నాయి. బాహుబలి–2 చిత్రంలో తమన్నా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు కదా, ఆ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో శింబుతో రొమాన్స్ చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ తీవ్రంగా నిరాశపరచింది. దీంతో విక్రమ్‌తో నటిస్తున్న స్కెచ్ పైనే ఆశలు పెట్టుకున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా మరో అవకాశం వచ్చింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం తమన్నా తలుపు తట్టింది. ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని, అందులోనూ తమన్నా, ప్రభుదేవాతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకు ముందే ఈ క్రేజీ జంట మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. రజనీకాంత్ 2.ఓ, విక్రమ్ సామి–2, సుందర్.సీ కలగలప్పు–2 చిత్రాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా విశ్వనటుడు కమలహాసన్ ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇలా మరి కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న తరుణంలో చార్లీచాప్లిన్ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 2002లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం చార్లీచాప్లిన్. ప్రభుదేవా,ప్రభు, అభిరామి,గాయత్రి రఘురామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. దీనికిప్పుడు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో ప్రభుదేవాకు జంటగా నటి తమన్నా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
దక్షిణాదిలో గ్రాండ్ రిలీజ్
హాలీవుడ్ చిత్రాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వస్తోంది అన్నాబెల్లె క్రియేషన్ చిత్రం. ఈ చిత్రానికి చాలా విశేషాలున్నాయి. 2014లో వచ్చిన అన్నాబెల్లె చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ల అమెరికన్ డాలర్ల వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల వరుసలో నిలిచింది. ది కంజూరింగ్ సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ది కంజూరిగ్ చిత్రానికి నాలుగవ భాగంగా వస్తున్న చిత్రం అన్నాబెల్లె క్రియేషన్. 2014లో వచ్చిన అన్నాబెల్లె చిత్రం ఒక్క భారతదేశంలోనే రూ. 83.5 కోట్లను వసూలు చేసి రికార్డు సాధించింది. ఆ చిత్ర దర్శకుడు డేవిడ్ ఎఫ్.శాండ్బెరిగన్నే తాజా చిత్రం అన్నాబెల్లె క్రియేషన్ కు దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 18న ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. -
కార్తీ సినిమా సీక్వల్లో సందీప్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా తెలుగు తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన సినిమా నా పేరు శివ. లవ్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ సరసన కాజల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్‌ను ప్లాన్ చేస్తున్నారట. తొలి భాగానికి పనిచేసిన అదే టెక్నికల్ టీం ఈ సీక్వల్ కోసం వర్క్ చేస్తోంది. కానీ రెండో భాగంలో హీరో మాత్రం మారిపోనున్నాడు. తొలి భాగంలో కార్తీ హీరోగా నటించగా సీక్వల్కు తెలుగు యువ హీరో సందీప్ కిషన్‌ను తీసుకున్నాడు దర్శకుడు సుశీంద్రన్. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ నటించనుంది. ప్రస్తుతం నక్షత్రం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్, ఆ సినిమా పూర్తయిన తరువాత నా పేరు శివ సీక్వల్లో నటించనున్నాడు. హీరో హీరోయిన్లు ఇద్దరినీ మార్చి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నా పేరు శివకు సీక్వల్ అని దర్శకుడు ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలి. -
సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల
వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆగడు' సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్న శ్రీనువైట్ల. ఆ తరువాత 'బ్రూస్ లీ' సినిమాతో మరోసారి ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాడు. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని గ్యారెంటీ హిట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో యంగ్ హీరోలతో మంచి సక్సెస్‌లు సాధించిన శ్రీను మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా రెడీకి సీక్వల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరోసారి రామ్ హీరోగా 'రెడీ'కి సీక్వల్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..?
సంక్రాంతి బరిలో ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా సక్సెస్ సాధించిన సినిమా కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా. నాగ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా ఈ సినిమాలో సోగ్గాడిగా నాగ్ లుక్, పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. అదే జోష్‌లో సీక్వెల్తోనూ ఆకట్టుకోవాలని ఫ్లాన్ చేస్తున్నారు. సీక్వెల్‌కు 'బంగార్రాజు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. అన్నపూర్ణ బ్యానర్‌పై బంగార్రాజు సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్న నాగ్, 2017 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. -
రాజు గారి గదిలోకి అంజలి
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన మూవీ రాజుగారి గది. జీనియస్ ఫెయిల్యూర్ తరువాత విరామం తీసుకున్న ఓంకార్, రాజు గారి గది సినిమాతో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో రూపొంది 7 కోట్లకు పైగా వసూళు చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్. ఇప్పటికే కథాకథనాలను కూడా రెడీ చేసిన ఓంకార్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. అయితే తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్లో కొత్త వారితో తెరకెక్కించినా.. రెండో భాగాన్ని మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హర్రర్ సినిమా చేసిన అంజలి మరోసారి అదే తరహా పాత్రలో నటించడానికి అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజుగారి గది సీక్వల్కు అంజలి గ్లామర్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
ఆ సీక్వల్లో నటించటం లేదు
అమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషనల్ సినిమా లగాన్. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో అమీర్ లాంటి స్టార్ హీరో స్వాతంత్ర్య సమరం నేపధ్యంతో తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా లగాన్. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, తరువాత కమర్షియల్ గానూ ఘనవిజయం సాదించి, అస్కార్ రేసులో పోటి పండింది. ఇంతటి ఘనవిజయం సాధించిన లగాన్‌కు సీక్వల్ రూపొందించాలన్న ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. లగాన్ స్థాయి కథ కోసం ఇంతకాలం ఎదురుచూసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఫైనల్‌గా ఈ సినిమా సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి రెడీ అవుతున్నాడు. అయితే లగాన్ తొలి భాగంలో నటించిన నటీనటులు సీక్వల్లో నటించే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. లగాన్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన హీరో అమీర్ ఖాన్ సీక్వల్లోనటించటం లేదని ప్రకటించేశాడు. ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అమీర్ లగాన్ సీక్వల్లో నటించడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. హీరోయిన్గా మాత్రం బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్‌ని ఫైనల్ చేశారు చిత్రయూనిట్. సినీ చరిత్రను మలుపు తిప్పిన లగాన్ సీక్వల్ హీరోగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
శంకర్ మనసు రోబో 2 వైపు మళ్లింది!