
ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ల క్రితం అక్షయ్‌కుమార్, కత్రినా కైఫ్ జంటగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన ఈ సినిమాకు స్వీక్వెల్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్‌లో గతంలో చాలా వార్తలొచ్చాయి. అవేం నిజం కాలేదు. అయితే బాలీవుడ్ లేటేస్ట్ ఖబర్ ఏంటంటే... ‘సింగ్ ఈజ్ కింగ్’ సీక్వెల్‌లో రణవీర్ సింగ్ నటింబోతున్నారట.
ఈ చిత్రానికి బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ శైలేంద్ర సింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారట. అయితే శైలేంద్రసింగ్ సేమ్ టైటిల్ కోసం ‘సింగ్ ఈజ్ కింగ్’ చిత్రనిర్మాత విపుల్ షాను సంప్రదించగా ఆయన ఇదే టైటిల్‌ను ఇచ్చేందుకు అంగీకరించలేదట. దీంతో శైలేంద్రసింగ్ ‘షేర్‌సింగ్’ అనే పేరుతో సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ సమాచారమ్. ఈ సీక్వెల్‌కు రణవీర్‌సింగ్ కూడా ఓకే చెప్పారని, అంతా కరెక్ట్‌గా కుదిరితే ‘షేర్ సింగ్’ త్వరలోనే సెట్స్‌పైకి వెళతారట.
Comments
Please login to add a commentAdd a comment