
భారతీయుడు భారీ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నాడిప్పుడు! ఏమాత్రం తగ్గడం లేదు. ఖర్చులో... ఖర్చుకి రెండింతలు రాబట్టే విషయంలోనూ... ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసేశాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ‘ఇండియన్–2’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోషల్ ఇష్యూస్‌పై పొలిటికల్ ఎంట్రీకి ముందు కమల్ నటించే సిన్మా కావడం... సోషల్ ఇష్యూస్‌తో సిన్మాలు తీయడంతో స్పెషలిస్ట్ అయిన శంకర్, ‘2.0’ తర్వాత తీయబోయే సిన్మా కావడంతో ఆల్రెడీ ‘ఇండియన్–2’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పట్నుంచి సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాను భారీ లెవల్‌లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ‘ఇండియన్–2’ను పలు భాషల్లో అనువదించి, దాదాపు 20 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట!!
Comments
Please login to add a commentAdd a comment