పారిపోతున్నా..! | Sonakshi Sinha cast in sequel of Happy Bhag Jayegi | Sakshi
Sakshi News home page

పారిపోతున్నా..!

Published Wed, Dec 6 2017 12:48 AM | Last Updated on Wed, Dec 6 2017 12:48 AM

Sonakshi Sinha cast in sequel of Happy Bhag Jayegi - Sakshi

...అంటున్నారు బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె ఎవరితో పారిపోతున్నారని ఎగై్జటింగ్‌గా ఆలోచించకండి. ఆమె పారిపోవడానికి రెడీ అయ్యింది రీల్‌ లైఫ్‌లో. ఇంతకీ మేటర్‌ ఏంటంటే... ముదసర్‌ అజీజ్‌ దర్శకత్వంలో డైనా, అభయ్‌ డియోల్, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్‌ ముఖ్య తారలుగా గతేడాది బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం ‘హ్యాపీ భాగ్‌ జాయేగి’. ప్రజెంట్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అజీజ్‌. ‘హ్యాపీ భాగ్‌ జాయేగి రిటర్న్స్‌’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే ఇందులో ఫస్ట్‌ పార్ట్‌ నటీనటులతోపాటు సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు.

ఇటీవలే ఫస్ట్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశారు. మంగళవారం రెండో షూట్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. ‘‘హ్యాపీ భాగ్‌ జాయేగి రిటర్న్స్‌ సెకండ్‌ షెడ్యూల్‌ స్టార్టయ్యింది. ఇట్స్‌ టైమ్‌.. రెడీ టు రన్‌’’ అని పేర్కొన్నారు సోనాక్షి సిన్హా. ఫస్ట్‌ పార్ట్‌లో హ్యాపీ క్యారెక్టర్‌లో నటించిన డైనా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమికుణ్ని కలవడానికి పాకిస్తాన్‌ పారిపోతుంది. ఫైనల్‌గా కథ సుఖాంతం అవుతుంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అంటే.. సోనాక్షి సిన్హా ఎక్కడికి పారిపోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్‌లో బొమ్మపడేంత వరకు వెయిట్‌ చేయక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement