Happy Bagh jayegi
-
పారిపోతున్నా..!
...అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె ఎవరితో పారిపోతున్నారని ఎగై్జటింగ్‌గా ఆలోచించకండి. ఆమె పారిపోవడానికి రెడీ అయ్యింది రీల్ లైఫ్‌లో. ఇంతకీ మేటర్ ఏంటంటే... ముదసర్ అజీజ్ దర్శకత్వంలో డైనా, అభయ్ డియోల్, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్ ముఖ్య తారలుగా గతేడాది బాలీవుడ్లో రూపొందించిన చిత్రం ‘హ్యాపీ భాగ్ జాయేగి’. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అజీజ్. ‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ నటీనటులతోపాటు సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. మంగళవారం రెండో షూట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. ‘‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్ సెకండ్ షెడ్యూల్ స్టార్టయ్యింది. ఇట్స్ టైమ్.. రెడీ టు రన్’’ అని పేర్కొన్నారు సోనాక్షి సిన్హా. ఫస్ట్ పార్ట్‌లో హ్యాపీ క్యారెక్టర్లో నటించిన డైనా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమికుణ్ని కలవడానికి పాకిస్తాన్ పారిపోతుంది. ఫైనల్‌గా కథ సుఖాంతం అవుతుంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తున్నారు. అంటే.. సోనాక్షి సిన్హా ఎక్కడికి పారిపోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లో బొమ్మపడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. -
ముచ్చటగా మూడోసారి?
ఒక జోడీ సూపర్హిట్టయిందంటే ఇక బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఆ జంటను పదే పదే తెరపై నటింపజేయడం అన్ని భాషల సినిమాల్లోనూ ఉన్నదే! పెపైచ్చు, ఆ హీరో హీరోయిన్లు గనక నిజజీవితంలోనూ ప్రేమికులైతే...? అంతకన్నా మహాభాగ్యమా అంటారు సినీ నిర్మాతలు. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌ల గురించి ఇప్పుడు అందరూ ఆ మాటే అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోం కీ రాస్లీలా... రామ్‌లీలా’ చిత్రంలో, తాజాగా ఆయనే తీసిన ‘బాజీరావ్ మస్తానీ’లో వీళ్ళిద్దరూ మంచి హాట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడానికి కీలకమయ్యారు. నిజజీవితంలోనూ వీళ్ళిద్దరూ ప్రస్తుతం బాగా సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ చిత్రంలో వీళ్ళే కొత్త జంట అని ముంబయ్‌లో చెప్పుకొంటున్నారు. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ ఫేమ్ ఆనంద్ రాయ్ ప్రస్తుతం ఈ ప్రతిపాదనతో దీపికను కలిశారట. అయితే, ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్న ఇతర పనుల్ని దీపిక పూర్తి చేసుకోవాల్సి ఉండడంతో ఆలస్యం అయ్యేలా ఉందట! ఏమైతేనేం, అన్నీ అనుకున్నట్లు జరిగితే రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల జంట మరోసారి తెరపై కనువిందు చేస్తుందన్న మాట!