ముచ్చటగా మూడోసారి? | third time pairing ranver and deepika | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి?

Published Sat, Jan 9 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

ముచ్చటగా మూడోసారి?

ముచ్చటగా మూడోసారి?

ఒక జోడీ సూపర్‌హిట్టయిందంటే ఇక బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఆ జంటను పదే పదే తెరపై నటింపజేయడం అన్ని భాషల సినిమాల్లోనూ ఉన్నదే! పెపైచ్చు, ఆ హీరో హీరోయిన్లు గనక నిజజీవితంలోనూ ప్రేమికులైతే...? అంతకన్నా మహాభాగ్యమా అంటారు సినీ నిర్మాతలు. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌ల గురించి ఇప్పుడు అందరూ ఆ మాటే అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోం కీ రాస్‌లీలా... రామ్‌లీలా’ చిత్రంలో, తాజాగా ఆయనే తీసిన ‘బాజీరావ్ మస్తానీ’లో వీళ్ళిద్దరూ మంచి హాట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు.
 
  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడానికి కీలకమయ్యారు. నిజజీవితంలోనూ వీళ్ళిద్దరూ ప్రస్తుతం బాగా సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ చిత్రంలో వీళ్ళే కొత్త జంట అని ముంబయ్‌లో చెప్పుకొంటున్నారు. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ ఫేమ్ ఆనంద్ రాయ్ ప్రస్తుతం ఈ ప్రతిపాదనతో దీపికను కలిశారట. అయితే, ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్న ఇతర పనుల్ని దీపిక పూర్తి చేసుకోవాల్సి ఉండడంతో ఆలస్యం అయ్యేలా ఉందట! ఏమైతేనేం, అన్నీ అనుకున్నట్లు జరిగితే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేల జంట మరోసారి తెరపై కనువిందు చేస్తుందన్న మాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement