జుమాంజీ సీక్వెల్‌ వస్తోంది! | Hollywood Movie Jumanji Sequal | Sakshi
Sakshi News home page

Dec 10 2017 8:11 AM | Updated on Aug 14 2018 3:48 PM

Hollywood Movie Jumanji Sequal - Sakshi

తమిళసినిమా: హాలీవుడ్‌ చిత్రాల్లో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే కథా ఇతివృత్తాలతో కూడిన చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ఈ మధ్య వచ్చిన జంగిల్‌బుక్‌ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1995 వచ్చిన అమెరికన్‌ ఫాంటసీ ఎడ్వెంచర్‌ చిత్రం జుమాంజీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత దానికి సీక్వెల్‌గా 2006లో జతువా ఏ స్పేస్‌ ఎడ్వెంచర్‌ పేరుతో ఒక చిత్రం వచ్చింది. తాజాగా జుమాంజీ వెల్‌కమ్‌ టూ జంగిల్‌ పేరుతో సూపర్‌ థ్రిల్లర్‌ ఎడ్వెంచర్‌ చిత్రం త్వరలో ఆంగ్లం, తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. 

1995లో వచ్చిన జుమాంజీ చిత్రానికి అసలు సీక్వెల్‌ ఇదేనంటున్నారు చిత్ర యూనిట్‌. కొలంబియా పిక్చర్స్‌ సమర్పణలో మట్ట్‌ టోల్‌మచ్, సెవన్‌ బక్స్‌ ప్రొడక్షన్‌ సంస్థలు నిర్మించిన ఈ భారీ థ్రిల్లర్‌ ఎడ్వెంచర్‌ చిత్రంలో దాయ్‌నే జాన్సన్, జాక్‌బ్లక్స్, మెన్‌హర్ట్, కరిన్‌గిలాన్, మార్గన్‌డర్నర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నలుగురు పాఠశాల విద్యార్థుల ఇతి వృత్తంగా సాగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపారు. ఆ విద్యార్థులకు ఒక పాత వీడియో గేమ్‌ లభిస్తుందన్నారు. అది వారిని ఎలాంటి పరిణామాలకు గురి చేసిందనేదే చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. చిత్రంలో థ్రిల్లింగ్‌తో కూడిన పలు ఎడ్వెంచర్‌ సన్నివేశాలు పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement