రణబీర్ కపూర్
తెలుగులో ‘ఇడియట్’ అనగానే... హీరో రవితేజ నటించిన చిత్రం గుర్తొస్తుంది. అదే త్రీ ఇడియట్స్ అంటే ఆమిర్‌ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి నటించిన చిత్రం గుర్తొస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ ముగ్గురూ ముఖ్య పాత్రలు చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. రీసెంట్‌గా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజ్‌కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు.
ఇప్పుడీ విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కన్ఫార్మ్ చేశారని బీటౌన్ టాక్. ‘‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నప్పుడు రాజ్‌సర్ నన్ను కలిశారు. గొప్ప ఫిల్మ్‌మేకర్. ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ’’ అని పేర్కొన్నారు రణబీర్ కపూర్. అంటే ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ఇడియట్ దొరికాడన్నమాట. మరోవైపు రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనే రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment