Raj Kumar hirani
-
Dunki X Review: డంకీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత షారుఖ్ నటించిన చిత్రం కావడంతో మొదటి నుంచే డంకీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. డంకీ కథేంటి? ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవోంటో చదివేయండి. ఇది కేలవం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. డంకీ చిత్రానికి ఎక్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్మూవీ అని.. భరించడం కష్టమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్స్‌లో నెగెటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్ పోస్టులే కనిపిస్తున్నాయి. కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Dunkireview Masterpiece Rating ⭐️⭐️⭐️⭐️⭐️ 5/5 Its an absolute masterpiece! The storytelling is captivating, the cinematography is stunning, and the performances are top-notch. This movie had me on the edge of my seat from start to finish.#Dunkireviews #SRK #ShahRuhkKhan pic.twitter.com/NoBdMF7FRc — komal nehta (@komalnehta) December 20, 2023 డంకీ..ఓ మాస్టర్ పీస్. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సీట్లకు త్తుకునపోయి చూస్తారు’అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. #DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work... What a movie man...Theater me bina rumaal aur tissue paper ke mat jana ⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB — AbRam Khan (@iAmDilshad07) December 21, 2023 షారుఖ్ ఖాన్ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. It’s a boring fare all together. SRK acting is big let down dialogue delivery is hard to bear. Hirani has delivered it’s worst ever Wait for movie to release on OTT #Dunki #DunkiReview — Thagudam (@Neninthe___) December 21, 2023 బోరింగ్ మూవీ. షారుక్ యాక్టింగ్ బాగున్నా.. డైలాగ్ డెలివరీ భరించడం కష్టం. హిరాణీ రాజ్‌కుమార్ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #DunkiReview-⭐⭐⭐⭐⭐ It's not a Blockbuster, it's a Mega Blockbuster Movie, #ShahRukhKhan𓀠 Character is literally Blow your Mind, And Story is Top level, A Must watch 1000cr loading🔥#Dunki #DunkiStorm #stockmarketcrash#DunkiReviews #DunkiTomorrow pic.twitter.com/6SR6DhAlGb — Amit Rahangdale (@amitrahangdale4) December 21, 2023 డంకీ బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ పాత్ర మీ మైండ్‌ని బ్లాంక్ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి. రూ. 1000 కోట్ల మూవీ అంటూ మరో నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. This movie is for Indian Aunties and Uncles who are settled abroad and would wish to come back home - India. Youth won’t relate to it. Watching SRK romance at this age looks creepy. He should retire now. Comedy is outdated #Dunki #DunkiReview pic.twitter.com/h2GnzpscAD — hello (@walterwhitezzz) December 20, 2023 #Dunki 5/5 ⭐️⭐️⭐️⭐️⭐️ Dunki is a fantastic blend of comedy and emotions. Shah Rukh Khan's performance is top-notch, delivering both laughs and heartfelt moments. The movie keeps you entertained throughout with its witty dialogues and touching storyline.#DunkiReview #Dunki #SRK — Nesgane (@nesgane) December 21, 2023 #Dunki #DunkiReviews https://t.co/b176wzIX2t — Raju Soni (@RajuSoni1541477) December 21, 2023 #OneWordReview...#Dunki : UNBEARABLE. Rating: ⭐️ A colossal waste of talent, big money and opportunity by director #RajuHirani. Weak story and amateur direction. #DunkiReview #ShahRukhKhan #SRK #TapseePannu pic.twitter.com/FbdWJY7PUm — Taran Adarsh (@Taran_Adaresh) December 21, 2023 OneWordReview...#Dunki: DISAPPOINTING Rating: ⭐️½#Dunki is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #RajkumarHirani had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS.#DunkiReview #ShahRukhKhan pic.twitter.com/KSFcnV5Jd3 — SANATAN THE BULL 🚩 (@being_nkm) December 21, 2023 Just finished the show. #Dunki is a cinematic gem, seamlessly blending laughter and tears. Overflowing with innocence, joy, emotions, and love, it serves as a powerful eye-opener. Shah Rukh Khan's stellar performance. RKH showcases his genius. #DunkiReview ⭐⭐⭐⭐½ — yourweirdcrush X (@Yourweirdcrush1) December 21, 2023 #Dunki wish to be a Masterpiece 🔥 #RajkumarHirani is best in Story Telling so far and wish continue with #Dunki @iamsrk performance would be another memorable ☺️ for the #ShahRuhKhan lovers pic.twitter.com/6t6m93qHzg — Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) December 21, 2023 #Dunki first half is written Blockbuster all over 💥💥🔥🔥#DunkiReview pic.twitter.com/nu1se3yaH8 — Ahmed (FAN) (@AhmedKhanSrkMan) December 21, 2023 BLOCKBUSTER PUBLIC REVIEWS! Good WoM till now💥💥#DunkiReviewpic.twitter.com/QpOylBH1do — काली🚩 (@SRKsVampire_) December 21, 2023 #DunkiReview Plz Avoid Old hindi serial drama , Head ache comdey scenes 2 scenes well written remaining totally dispointed, weakest work from Hirani sir #Dunki ⭐⭐ / 5 👎👎 pic.twitter.com/1ZQHMqGEP6 — Vamsivardhan PKVK (@Vamsivardhan_2) December 20, 2023 -
‘డంకీ’ అంటే ఏంటి? ఎందుకంత స్పెషల్?
ఈ ఏడాది కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్‌దే అని చెప్పాలి. ఆయన నటించిన రెండు చిత్రాలు(పఠాన్, జవాన్) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఒక్కో సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే డంకీ. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా మరికొద్ది గంటల్లో(డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ► రాజ్ కుమార్ హిరాణీ-షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. ఆ రెండు చిత్రాలు యాక్షన్ జానర్లో తెరకెక్కాయి. డంకీ మాత్రం కామెడీ డ్రామా ఎంటర్టైనర్. అభిమానుల కోసం కాకుండా తనకోసం నటించిన చిత్రమిదని షారుఖ్ అన్నారు. దీన్ని బట్టి షారుక్‌కి ఈ కథ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ► సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని, కామెడీ యాంగిల్లో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణీ ప్రత్యేకత. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. ఆయన కెరీర్లో ఇంతవరకు ప్లాప్ చిత్రమే లేదు. అందుకే డంకీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ► భారత్ నుంచి అక్రమంగా ప్రయాణించి యూకేలోకి ప్రవేశించిన స్నేహితుల కథే ఇది. ఈ చిత్రానికి తొలుత ‘రిటర్న్ టికెట్’ లేదా ‘టాస్ ’అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరకు డంకీ అని ఖరారు చేశారు. ► దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీ వాళ్లు దాన్ని డంకీ అంటారు. ఈ కథ నేపథ్యం కూడా అక్రమ చొరబాటుకు సంబంధించినదే కావడంతో డంకీ సరైన టైటిల్ అని మేకర్స్ భావించారట ► ఈ మూవీ షూటింగ్ 75 రోజుల్లో పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు షారుక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల క్రితమే ఈ చిత్రం పనులు ప్రారభం అయ్యాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా పూర్తి చేయడంతో షూటింగ్ త్వరగా పూర్తయిందట. ముంబై, జైపూర్, కశ్మీర్, లండన్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ► ఈ చిత్రం నిడివి 2.41 గంటలు. బడ్జెట్ రూ.120 కోట్లు. షారుఖ్ గత ఆరేళ్లలో నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదే. ► సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేసి అలరించాడు. ఈవెంట్లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు. ►హీరోయిన్ తాప్సికి షారుఖ్‌తో తొలి సినిమా ఇది. విక్కీ కౌశల్ అతిథి పాత్ర పోషించాడు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ►ఈ సినిమాను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదల కానుండడంతో డంకీ ప్రీపోన్ అయింది. -
రాజ్ కుమార్ హిరానీ బర్త్‌డే స్పెషల్.. 5 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..
Director Raj Kumar Hirani Birthday Special And His 5 Block Busters: బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్ కుమార్ హిరానీ తప్పకుండా ఉంటారు. 100 శాతం సక్సెస్ రేట్‌తో హిందీ సినిమా చిత్ర దర్శకుడిగా ఘనత పొందారు. ఈ విజయపథంలో ఆయన ఇప్పటివరకు కేవలం 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇవాళ (నవంబర్ 20)న రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన 5 బ్లాక్బస్టర్లపై ఓ లుక్కేద్దామా..! 1. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003) సంజయ్ దత్, అర్షద్ వార్సి, విద్యాబాలన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ తొలి చిత్రం. ఈ సినిమా ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే ట్యాగ్‌ని సంపాదించిపెట్టింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వసూళ్లలో ఒకటిగా నిలవడమే కాకుండా మున్నా, సర్క్యూట్ పాత్రలు బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అవి వారికి ఇంటి పేర్లుగా కూడా మారాయి. మహాత్మా గాంధీ ధర్మ బద్ధమైన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు హాస్యంతో తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ కూడా చేశారు. 2. లగేరహో మున్నాభాయ్ (2006) మున్నాభాయ్ ఎంబీబీఎస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే లగేరహో మున్నాభాయ్. మొదటి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కూడా ఉంటారు. సామాజిక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను కూడా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ పేరుతో తెరకెక్కించారు. 3. 3 ఇడియట్స్ (2009) బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10, అత్యంత పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటిగా పేరొచ్చిన చిత్రం 3 ఇడియట్స్. ఒకరకంగా ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థికైనా ఒక సిలబస్ లాంటిదీ సినిమా. నిజ జీవితంలో, చదువులో ముఖాముఖి పోటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటూనే మంచి సామాజిక సందేశాన్ని ఇస్తుంది. 4. పీకే (2014) ‘3 ఇడియట్స్’ ఘనవిజయం తర్వాత రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో కలిసి మళ్లీ ఒక కొత్త తరహా కథను తెరకెక్కించారు. ఒక గ్రహాంతర వాసి, మతం, దేవుడి పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి భూమిపై ఉన్న ప్రజలను భయపెట్టే విభిన్న కోణం నుంచి ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నటించారు. 5. సంజు (2018) సంజు చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి. మొదటిసారిగా తెరపై సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరానీ. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ కథనంలో విక్కీ కౌశల్, అనుష్క శర్మ కూడా నటించారు. ఈ చిత్రం అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు అపారమైన గుర్తింపు తీసుకొచ్చింది. -
నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు : నటుడు
బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ వినూత్నమైన నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తానడంలో సందేహం లేదు. ఎటువంటి పాత్రలైనా సరే తన దగ్గరికి వస్తే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కసరత్తు చేయడం ఆయనకు అలవాటు. తాజాగా... రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009 లో బ్లాక్బాస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొమన్ ఇరానీ తాను పోషించిన పాత్ర గురించి, ఆ పాత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. త్రీ ఇడియట్స్ చిత్రంలో బొమన్ ఇరానీ ఐఐఎమ్ బెంగుళూరు కాలేజీ డైరెక్టర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాత్ర పేరు డాక్టర్ విరు సహస్త్రాబుద్ధా వైరస్. ఈ పాత్ర కోసం తాను ఎలా సిద్ధమాయ్యరో బొమన్ ఇరానీ మీడియాకు వివరించారు. 'త్రీ ఇడియట్స్ సినిమా సమయంలో ప్రతిరోజు ఉదయం షూటింగ్ ఉన్నా లేకపోయినా పాత్రకు సంబంధించిన వెల్క్రో షర్ట్, హుక్ టైని ధరించి క్యాంపస్ మొత్తం కలియతిరిగేవాడిని. అయితే నన్ను చూసిన కొందరు విద్యార్థులు గుర్తుపట్టకపోగా ఒక ఫ్రొఫెసర్‌గా భావించి విష్ చేసేవారు. ఒక్కోసారి వారిపై అరుస్తూ నా కోపాన్ని ప్రదర్శించడంతో వారంతా ఆశ్చర్యపోయేవారు. క్లాస్‌రూంలో పాఠాలు బోధిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి క్లాస్‌రూం మొత్తం పరిశీలించి మీ పని చేసుకొండి అని చెప్పి వెళ్లిపోయేవాడిని. ఆ సమయంలో అక్కడే ఉన్న లెక్చరర్స్ నేను కాలేజ్‌లో కొత్తగా చేరిన ఫ్రొపెసర్‌గా భావించేవారు. కాకపోతే అక్కడి వాతావరణం, పరిస్థితులను అధ్యయనం చేయడం కోసమే ఇదంతా చేశాను. దీంతో షూటింగ్ సమయంలో ఒక 20-30 సంవత్సరాల పాటు నాకు ఆ క్యాంపస్‌తో పరిచయంలాగా అనిపించేదని' బొమన్ ఇరానీ పేర్కొన్నారు. కాగా 2009లో విడుదలైన త్రీ ఇడియట్స్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ పెద్ద విజయం సాధించింది. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ చిత్రంలో చూపించారు. కాగా ఇదే చిత్రం తమిళంలో శంకర్ ‘నన్బన్’గా రీమేక్ చేశాడు. బొమన్ ఇరానీ పాత్రను ఇక్కడ సత్యరాజ్ పోషించగా, తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. -
‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేయలేను’
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్న మున్నా భాయ్-3 షూటింగ్ వాయిదా పడబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడిందని, తనకు క్లీన్‌చీట్ వచ్చాకే షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో ‘బాబా’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా తన భార్య మాన్యతా దత్తో కలిసి వచ్చిన సంజూ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నా భాయ్-3 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చేస్తున్నానని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినిమా ఎప్పుడు మొదలుకానుందని దర్శకుడు రాజు కుమార్ హిరానీని అడగాలని, అతను మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలడన్నాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ...‘ఇప్పుడు నేను చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేయలేను. అయితే హాలీవుడ్ నటులు మెల్ గిబ్సన్, డెంజెల్ వాషింగ్టన్ లాగా గొప్ప పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు. 1981 లో వచ్చిన రాకీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి సంజూ భాయ్... త్వరలో రణ్‌బీర్ కపూర్‌తో "షంషేరా" అలాగే అర్జున్ కపూర్‌తో "పానిపట్" సినిమాలలో కనిపించనున్నాడు. -
మున్నా భాయ్ 3కి కష్టాలు..?
ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే మున్నా భాయ్ 3 సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణల గురించి ఓ క్లారిటీ వచ్చే వరకూ ఈ సినిమా పనులను ప్రారంభించకూడదంటూ ఫోక్స్ సంస్థ ఆదేశించినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తెలితే ఇక మున్నా భాయ్ 3ని తెరకెక్కించడం జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాక సోనమ్ కపూర్, అనిల్ కపూ్లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ ప్రమోషన్ కార్యక్రమాల్లోంచి హిరాణీ పేరును తొలగిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వీవీసీ పేర్కొంది. అంతేకాక ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు వీసీసీ వర్గాలు తెలిపాయి.‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశానని సదరు మహిళ తెలిపారు. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. -
ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో ‘సంజు’!
రణ్‌బీర్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. సంజు మూవీ కంటెంట్ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్ అనలిష్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. టైగర్ హై జిందాను దాటి.. పీకేను చేజ్ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. #Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) July 30, 2018 -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రణ్‌బీర్‌కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. -
వంద కోట్ల క్లబ్లో ‘సంజు’
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంజు అదే రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో రణబీర్‌కపూర్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్ వ్యవహారాలకు సంబంధించి, ఎఫైర్ల గురించి చెబుతూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 34 కోట్టు రాబట్టి రణబీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే వీకెండ్ కూడా పూర్తయింది. మొదటి వారాంతానికి వంద కోట్ల క్లబ్లో చేరిన సంజు.. రెండో వారాంతానికి రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరతాడని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. TOP 5 - 2018 Opening Weekend biz... 1. #Sanju ₹ 120.06 cr 2. #Padmavaat ₹ 114 cr [5-day *extended* weekend; select previews on Wed, released on Thu]... Hindi + Tamil + Telugu. 3. #Race3 ₹ 106.47 cr 4. #Baaghi2 ₹ 73.10 cr 5. #Raid ₹ 41.01 cr India biz. — taran adarsh (@taran_adarsh) July 2, 2018 -
కొత్త ఇడియట్!
తెలుగులో ‘ఇడియట్’ అనగానే... హీరో రవితేజ నటించిన చిత్రం గుర్తొస్తుంది. అదే త్రీ ఇడియట్స్ అంటే ఆమిర్‌ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి నటించిన చిత్రం గుర్తొస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ ముగ్గురూ ముఖ్య పాత్రలు చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజ్‌కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇప్పుడీ విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కన్ఫార్మ్ చేశారని బీటౌన్ టాక్. ‘‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నప్పుడు రాజ్సర్ నన్ను కలిశారు. గొప్ప ఫిల్మ్‌మేకర్. ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ’’ అని పేర్కొన్నారు రణబీర్ కపూర్. అంటే ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ఇడియట్ దొరికాడన్నమాట. మరోవైపు రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనే రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘అలా 308 మంది అమ్మాయిలను పడేశాడు’
కొన్ని రోజుల క్రితం సంజయ్ దత్ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్నాయక్’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ సమాధానం చెప్పారు. తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్ హీరానీ. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంజు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్. ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్ చేసి ఉంది. సంజయ్ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం మీడియా రణ్‌బీర్ కపూర్‌ను ‘బాలీవుడ్ ప్లేబాయ్’గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రణ్‌బీర్ ‘నేను కేవలం పదిమంది అమ్మాయిలతోనే డేటింగ్ చేసాను. కానీ బాబా(సంజయ్ దత్) కౌంట్ 308’ అన్నాడు. అంతేకాక ప్రతిరోజు షూటింగ్ జరగడానికి ముందు రోజు రాత్రి రణ్‌బీర్ సంజయ్‌దత్‌కు ఫోన్ చేసేవాడంట. తరువాత రోజు షూటింగ్ జరిగే సన్నివేశాల గురించి సంజయ్‌తో చర్చించే వాడంట. ఆ సమయంలో సంజయ్ మనసు ఎలా ఉండేది...ఆ సంఘటనల గురించి ఎలా స్పందించేవాడని అడిగి తెలుసుకునే వాడినన్నాడు రణ్‌బీర్. అంతేకాక సంజయ్ డ్రగ్స్‌కు బానిసయినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రణ్‌బీర్. ‘ఒకానొక సమయంలో బాబా డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. ఆ సమయంలో ఒకసారి బాబాకు తన తండ్రి సునిల్ దత్ సాబ్ తల మీద క్యాండిల్ వెలుగుతున్నట్లు అనిపించిందంట. సంజయ్ వెంటనే వెళ్లి ఆ క్యాండిల్‌ను తొలగించాడంట. సంజయ్ డ్రగ్స్‌కు ఎంతలా బానిసయ్యడనే విషయం అప్పుడు దత్‌సాబ్‌కు అర్థమయ్యింది‘ అని రణ్‌బీర్ తెలిపాడు. -
‘మున్నాభాయ్’ మళ్లీ వస్తున్నాడు!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మరోసారి సీక్వెల్ బాట పట్టారు. గతంలో వచ్చిన ‘మున్నాభాయ్’, 'లగేరహో మున్నాభాయ్'లకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాతో బిజీగా ఉన్న హిరానీ, ఆ తర్వాత తెరకెక్కించే చిత్రం మున్నాభాయ్ సిరీస్‌లో ఉండనుందని ప్రకటించారు. సంజు ప్రమోషన్లో భాగంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘మున్నాభాయ్ ఛలో అమెరికా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు, కొన్ని కథలు కూడా పరిశీలిస్తున్నట్లు హిరానీ తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదని ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘మున్నాభాయ్ మూడోపార్ట్ ఉంటుంది. కానీ అది మున్నాభాయ్ ఛలో అమెరికా కాకపోవచ్చు. ఎందుకంటే నేను అమెరికా వెళ్లేందుకు వీసాను పొందలేనంటూ చమత్కరించారు. హిరానీ తన ప్రస్తుత చిత్రం సంజు పూర్తయిన వెంటనే మున్నాభాయ్ స్ర్కిప్ట్‌ను పూర్తి చేస్తారు. అన్ని కలిసొస్తే వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కావొచ్చ’ని సంజూ తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్‌లోని రెండు చిత్రాలను శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేశారు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించారు. -
సంజయ్ దత్లా మారిపోయిన రణబీర్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో యువ కథానాయకుడు రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో రఫ్‌గా కనిపించే సంజూ భాయ్ పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ ఎలా మెప్పిస్తాడో అన్న ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా సంజయ్ బయోపిక్ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలలో రణబీర్ లుక్కు మంచి మార్కులు పడ్డాయి. 90లలో సంజయ్ దత్ లుక్ ఎలా ఉండేది, హెయిర్ స్టైల్ ఎలా ఉండేది, ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడేవాడు అన్న విషయంలో చాలా కేర్ తీసుకొని రణబీర్ లుక్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం సంజయ్ దత్లా కనిపిస్తున్న రణబీర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటిస్తుండగా, తల్లి నర్గీస్గా మనీషా కొయిరాలా, భార్య మాన్యతగా దియా మీర్జాలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శర్మ, సోనమ్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సంజయ్ దత్ తండ్రిగా ఆమిర్ ఖాన్
మున్నాబాయ్ ఎమ్‌బిబియస్, 3 ఇడియట్స్, పికె లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం వివాదాస్పద బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ జీవిత కథ ఆదారంగా సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. తన కథను రాజ్ కుమార్ అయితేనే సరిగా చూపిస్తాడన్న నమ్మకంతో సంజయ్ దత్ కూడా ఆ బాధ్యతను ఈ దర్శకుడికే అప్పగించాడు. ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా.., రాజ్ కుమార్ హిరాణీ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ పాత్రకు యంగ్ హీరో రణబీర్ కపూర్‌ను ఫైనల్ చేసిన దర్శకుడు, ఇప్పుడు సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌ను సంప్రదిస్తున్నాడు. ప్రస్తుతం దంగల్ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న ఆమిర్.. ఏకంగా రణబీర్ కపూర్ లాంటి హీరోకు తండ్రిగా నటించేందుకు అంగీకరిస్తాడా..? ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇండియన్ స్క్రీన్ మీదే ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది. -
సహచరుడి కథతో సినిమా
జైలు జీవితం ముగించుకొని విడుదలకు రెడీ అవుతున్న సంజయ్ దత్ బయటకు వచ్చాక ఏం చేస్తాడు. ఇప్పుడు బాలీవుడ్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన సంజయ్ విడుదల తరువాత తిరిగి సినిమాల్లో కొనసాగుతాడా..? లేక వ్యక్తిగత జీవితంలో బిజీ అవుతాడా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను మదిలో మెదలుతున్నాయి. సంజయ్ మాత్రం తిరిగి సినిమాల్లో నటించడానికే నిర్ణయించుకున్నాడట. శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా పెరోల్ మీద బయటికి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సంజూభాయ్, విడుదలైన తరువాత పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, తన బ్యానర్‌పై సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తొలి చిత్రంగా, జైలులో తనతో పాటు గడిపిన వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని జీవిత విశేషాలతో కథ రెడీ చేసే పనిలో ఉన్నారు సంజయ్ టీం. ఈ సినిమాతో పాటు తన స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి మున్నాబాయ్ సిరీస్‌లో మూడో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న సంజయ్, ఇక వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. -
3 ఇడియట్స్‌కు సీక్వల్..?
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, బాలీవుడ్ సినీ అభిమానులకు తీపి కబురు అందించాడు. భారత విద్యా వ్యవస్థ మీద సెటైరికల్‌గా రూపొందిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ '3 ఇడియట్స్'కు సీక్వల్ రూపొందనున్నట్టుగా ప్రకంటిచాడు. 2009లో రిలీజ్ అయిన 3 ఇడియట్స్‌లో ఆమిర్ ఖాన్‌తో పాటు శర్మాణ్ జోషి, ఆర్ మాధవన్, కరీనా కపూర్లు లీడ్ రోల్స్‌లో నటించారు. రంగ్ దే బసంతి సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేషంలో పాల్గొన్న ఆమిర్, 3 ఇడియట్స్ సీక్వల్ ప్రస్థావన తీసుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా సీక్వల్కు సంబందించి రాజ్ కుమార్ హిరానీ మంచి కథ రెడీ చేస్తున్నాడని చెప్పిన ఆమిర్, ఇప్పడే ఈ వార్తను బ్రేకింగ్ న్యూస్‌గా మార్చొద్దంటూ మీడియాను కోరాడు. -
'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్
-
'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్
బాలీవుడ్ స్క్రీన్ మీద తెరకెక్కుతున్న మరో రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా సాలా ఖద్దూస్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ బాక్సింగ్ కోచ్‌గా రఫ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ నిర్మాణంలో తమిళ్, హిందీ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవటంతో పాటు బాక్సర్ లుక్‌లో కనిపించేందుకు భారీగా కండలు పెంచాడు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామాలుగా తెరకెక్కిన మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, పాన్ సింగ్ తోమర్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఎన్నడు కనిపించనంత న్యూ లుక్‌లో మాధవన్ కనిపిస్తున్న ఈ సినిమాలో రితికా సింగ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పీసీ సర్కార్ కూతురు ముంతాజ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సాలా ఖద్దూస్ సినిమాను జనవరి చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ దత్ కోసం మరో ఆసక్తికరమైన సీక్వెల్‌ను రెడీ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'ఖల్నాయక్'కు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సుభాష్ ఘయ్. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ లీడ్‌రోల్స్‌లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సీక్వెల్ కు 'ఖల్నాయక్ రిటర్న్స్' అన్న టైటిల్‌ను కూడా ఫైనల్ చేశాడు సుభాష్ ఘయ్. అయితే ప్రస్తుతం ఎర్రావడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్, ఈ సీక్వెల్ కు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. తన మీద ఉన్న బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను చెరిపేసుకోవాలనుకుంటున్న సంజయ్ మరోసారి ఇలాంటి పాత్రలో నటిస్తాడా లేక సుభాష్ ఘయ్ ఆఫర్ ను తిరస్కరిస్తాడా చూడాలి. తన కూతురు ఆపరేషన్ సందర్భంగా ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చిన సంజయ్‌దత్, విదు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీలను కలిశాడు. వీరి కాంబినేషన్లో మున్నాభాయ్ సీక్వెల్‌పై కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మరి సంజయ్, ఏ సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తాడో చూడాలి. -
‘3 ఇడియట్స్’ అభిమానం
సినిమా హీరో హీరోయిన్లకు అభిమానులుండడం సహజం. కానీ చిత్రంగా ‘3 ఇడియట్స్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హాంకాంగ్, జపాన్, చైనాల్లో అభిమానులను సంపాదించుకోవడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైరస్ అనే నిక్‌నేమ్ గల ప్రొఫెసర్ పాత్రకు బొమన్ ఇరానీ ప్రాణం పోశాడు. ఇటీవల హాంకాంగ్ వెళ్లినప్పుడు ఆయన అభిమానుల ప్రశంసల్లో తడిసి ముద్దయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన చిత్ర దర్శకుడు ిహ రానీకి ట్వీట్ చేశాడు.