సంజయ్ దత్ తండ్రిగా ఆమిర్ ఖాన్
సంజయ్ దత్ తండ్రిగా ఆమిర్ ఖాన్
Published Wed, Aug 24 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
మున్నాబాయ్ ఎమ్బిబియస్, 3 ఇడియట్స్, పికె లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం వివాదాస్పద బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ జీవిత కథ ఆదారంగా సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. తన కథను రాజ్ కుమార్ అయితేనే సరిగా చూపిస్తాడన్న నమ్మకంతో సంజయ్ దత్ కూడా ఆ బాధ్యతను ఈ దర్శకుడికే అప్పగించాడు.
ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా.., రాజ్ కుమార్ హిరాణీ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ పాత్రకు యంగ్ హీరో రణబీర్ కపూర్ను ఫైనల్ చేసిన దర్శకుడు, ఇప్పుడు సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ను సంప్రదిస్తున్నాడు. ప్రస్తుతం దంగల్ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న ఆమిర్.. ఏకంగా రణబీర్ కపూర్ లాంటి హీరోకు తండ్రిగా నటించేందుకు అంగీకరిస్తాడా..? ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇండియన్ స్క్రీన్ మీదే ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది.
Advertisement
Advertisement