సంజయ్ దత్లా మారిపోయిన రణబీర్ | Ranbir Kapoor Make Over as Sanjay Dutt | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్లా మారిపోయిన రణబీర్

Published Tue, Feb 21 2017 1:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

సంజయ్ దత్లా మారిపోయిన రణబీర్

సంజయ్ దత్లా మారిపోయిన రణబీర్

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో యువ కథానాయకుడు రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో రఫ్గా కనిపించే సంజూ భాయ్ పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ ఎలా మెప్పిస్తాడో అన్న ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా సంజయ్ బయోపిక్ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలలో రణబీర్ లుక్కు మంచి మార్కులు పడ్డాయి.  90లలో సంజయ్ దత్ లుక్ ఎలా ఉండేది, హెయిర్ స్టైల్ ఎలా ఉండేది, ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడేవాడు అన్న విషయంలో చాలా కేర్ తీసుకొని రణబీర్ లుక్ను డిజైన్ చేశారు. ప్రస్తుతం సంజయ్ దత్లా కనిపిస్తున్న రణబీర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటిస్తుండగా, తల్లి నర్గీస్గా మనీషా కొయిరాలా, భార్య మాన్యతగా దియా మీర్జాలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శర్మ, సోనమ్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement