sunil dutt
-
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
హరిభూషణ్ మృతి వాస్తవమే!
సాక్షి, మహబూబాబాద్/గంగారం/ కొత్తగూడెం టౌన్/ చర్ల: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ, గుండెపోటుకు గురై మృతి చెందారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. కొంతకాలంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యులు కరోనా బారినపడి, సరైన వైద్యం అందక చనిపోతున్నారని.. హరిభూషణ్ కూడా ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరణించినట్టు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని వివరించారు. బుధవారం కొత్తగూడెంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. కాగా.. హరిభూషణ్ చనిపోయాడని భద్రాద్రి ఎస్పీ ప్రకటించినా.. కిందిస్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ‘ఆయన చనిపోయాడా, మీకేమైనా సమాచారం తెలిసిందా?’అంటూ ఆరా తీశారు. ఆయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఇంటికి ఒక హోంగార్డు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారని.. హరిభూషణ్ తమ్ముడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారని తెలిసింది. ఇక హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్‌లోని మీనగుట్ట ప్రాంతంలో మృతి చెందాడన్న ప్రచారం నేపథ్యంలో చర్లకు చెందిన మీడియా బృందం బుధవారం అక్కడికి వెళ్లి ఆరా తీసింది. అయితే ఆ ప్రాంతంలో అలాంటి ఘటన ఏమీ జరగలేదని, హరిభూషణ్ మృతి చెందాడనే సమాచారం ఏదీ లేదని అక్కడి గ్రామాలకు చెందిన ఆదివాసీలు వెల్లడించారు. చివరి చూపు దక్కేలా చూడండి తన సోదరుడు ఏ కారణంతో అయినా మరణించి ఉంటే మృతదేహాన్ని తమకు అప్పగించాలని హరిభూషణ్ సోదరుడు యాప అశోక్ కోరారు. తన సోదరుడిని చిన్నతనంలోనే చూశానని, ఇప్పుడు చివరి చూపు అయినా దక్కే అవకాశం కల్పించాలన్నారు. -
ఉత్తరాల ‘లంకె’బిందెలు
ఇంట్లో పెద్దవాళ్లు, ‘అప్పటి రోజులే వేరు. మళ్లీ రావు, బంగారం లాంటి రోజులు’ అని తరచు అంటే వినటం అందరికీ అనుభవమే. నిజమే. ఆ రోజులు అలాంటివే మరి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆధునిక గ్యాడ్జెట్లు, సకల సదుపాయాలు... జీవితాన్ని సులభం చేసుకునే సాధనాలేవీ లేని రోజులు. ఉత్తరాల ద్వారా మాత్రమే క్షేమసమాచారాలు అందుకున్న రోజులు. ముఖ్యంగా సినీ నటులు అభిమానులు రాసిన ఉత్తరాలకు వారి సంతకం తో ఉన్న ఫొటోలు పోస్టులో పంపిన రోజులు. అటువంటి ఒక చిన్న సంఘటన ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. అది చూసిన విదేశీయులు, భారతీయులకు పాత జ్ఞాపకాలంటే అభిమానమే అనుకుంటున్నారు. ఎఎల్‌టి అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ కోఫౌండర్‌గా పని చేస్తున్నారు శామ్‌జావేద్. పదిహేను సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన ఆంటీకి సంబంధించిన చిన్న అంశాన్ని ట్విటర్లో ఉంచారు శామ్. ఈ ట్వీట్ వారం రోజులుగా ట్రెండింగ్ అవుతోంది. అసలు కథ... మెహరున్నీసా నజ్మా పదిహేను సంవత్సరాల క్రితం అంటే 2006లో కన్నుమూశాక, ఆవిడకు సంబంధించిన కొన్ని వస్తువులను మేనకోడలు శామ్‌జావేద్ భద్రపరిచారు. ఇటీవలే అక్కడ ఉన్న సామానులను బయటకు తీస్తుంటే అందులో ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ ను చాలా ఆసక్తితో పరిశీలించారు శామ్. అందులో ప్రముఖ సినీతారల స్వదస్తూరితో ఉన్న ఉత్తరాలు శామ్‌ను ఆకర్షించాయి. ఒకసారి తన మేనత్తను జ్ఞాపకం చేసుకున్నారు శామ్. శామ్‌జావేద్ సినిమాలంటే ఇష్టం... నజ్మాకు భారతీయ చిత్రాలంటే ప్రాణం. సినిమాలు చూసి ఊరుకోకుండా, ఆ తారలకు ఉత్తరాలు రాసేవారు. ఇది తల్లికి నచ్చేది కాదు. అయినా నజ్మా ఎవ్వరికీ తెలియకుండా ఉత్తరాలు రాస్తూ. తనకు వచ్చిన సమాధానాలను భద్రంగా ఆల్బమ్‌లో భద్రపరిచారు. ఆల్బమ్ అంతా సినిమా తారలు తమ సంతకాలతో ఆమె ఉత్తరాలకు రాసిన సమాధానాలతో నిండిపోయింది. ఎల్విస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న షమ్మీ కపూర్ ఇంగ్లీషులో, ‘‘మీరు నా అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఉత్తరం రాశారు. ధర్మేంద్ర, సునీల్ దత్త్.. చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది నజ్మాకు ఉత్తరాలు రాశారు. అప్పట్లో పెద్ద పెద్ద తారలైన కామినీ కౌశల్, సాధన, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సురయ్యా, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్... లెక్కలేనంతమంది. ఇంతమంది నుంచి ఉత్తరాలు అందుకున్న నజ్మా జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంది. నజ్మా 1930 లో ఢిల్లీలో పుట్టారు. తండ్రి పంజాబీ, తల్లిది బర్మా. నజ్మాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నజ్మా చిన్నతనంలోనే తండ్రి కన్నుమూయటంతో, మేనత్త ఈ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. తమ్ముడు, చెల్లాయి.. పెరిగి పెద్దయ్యాక, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో పై చదువులు చదువుకున్నారు. నజ్మాకు చదువు మీద ఆసక్తి లేదు. సినిమాలంటేనే ఇష్టం. సిలోన్ రేడియోలో పాటలు వినేవారు. తన అభిమాన నటులకి ఉత్తరాలు రాసేవారు. 20 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇలాగే గడిపారు నజ్మా. ఆ తరవాత వివాహం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరాలు రాయటం ఆపేసి ఉంటారంటారు. నజ్మాకి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకే ఆమె భర్త గతించారు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నజ్మాకు పిల్లలు లేరు. చెల్లెళ్లు, తమ్ముడి పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు. తనకు ఇష్టమైన సినిమాలను జీవితాంతం హాయిగా చూశారు నజ్మా. ‘‘మా ఆంటీ చాలా అందంగా ఉండేవారు. సినిమాల మీద, సినీ తారలకు ఉత్తరాలు రాయటం మీద ఆవిడకున్న అభిమానం అప్పట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నా ట్వీట్ చూసి అందరూ మా ఆంటీని ప్రశంసిస్తున్నారు. నా దగ్గర లంకెబిందెల్లాంటి చాలా విలువైన సంపద ఉంది అంటున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు శామ్‌జావేద్. పాత బంగారం కోసం... ఇప్పుడు బాలీవుడ్ తారలంతా ఆ ఉత్తరాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రియాంక చోప్రా జొనాస్.. ఈ ఉత్తరాలను ట్వీట్ చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘ఇవి చాలా ప్రత్యేకమైన ఉత్తరాలు. అన్ని ఉత్తరాలు నా మనసును హత్తుకున్నాయి. వీటిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అన్నారు ప్రియాంక. ఇవి ట్విటర్లో బాగా వైరల్ కావటంతో, నేషనల్ ఫిల్మ్ అర్కైవ్ వారు నజ్మా ఉత్తరాలను సేకరించి భద్రపరచాలనుకుంటున్నారు. సరదా గా దాచుకున్న ఉత్తరాలకు ఇప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని ఆ రోజు నజ్మా ఊహించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉత్తరాలు ఒకరినొకరు కలిపే ‘లంకె’బిందె ల్లాంటివేనంటూ వీటిని విలువైనవిగా గుర్తిస్తోంది సినీ పరిశ్రమ. సునీల్ దత్త్ ఒకటో రెండో వాక్యాలు కాదు, స్వదస్తూరితో పెద్ద ఉత్తరమే రాశారు. ‘ఆ ఉత్తరం చూస్తుంటే ఆయన బహుశ మా అత్తయ్యను చిన్న అమ్మాయి అనుకుని ఉంటారనిపిస్తుంది. ఆయన ఎంతో జాగ్రత్తగా సిస్టర్ అని సంబోధిస్తూ ఉత్తరం రాశారు. అది కూడా ఒకసారి కాదు, పదేపదే అదే పదం ఉపయోగించారు’’ అంటారు శామ్‌జావేద్. ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసిన ఉర్దూ ఉత్తరం అది. ధర్మేంద్ర కూడా స్వదస్తూరితో హిందీలో రాశారు. ఆ ఉత్తరం చదివితే, నజ్మా... ధర్మేంద్ర పుట్టినరోజుకి రాసిన ఉత్తరానికి సమాధానమని అర్థం అవుతుంది. ‘‘నా పుట్టినరోజుకి మీరు పంపిన శుభాకాంక్షలు అందుకున్నాను. మీ ఉత్తరం చూసిన నా హృదయం ఎంతో సంతోషంతో నాట్యం చేసింది. నా ఆటోగ్రాఫ్‌తో ఉన్న నా ఫొటో మీకు పంపుతున్నాను, మీకు నా అభినందనలు’’ అంటూ ధర్మేంద్ర జవాబు రాశారు. ఈ సమాధానం చదివిన నజ్మా ఆంటీ మనసు ఎలా ఉండి ఉంటుందో చెప్పక్కర్లేదు’ అంటారు శామ్‌జావేద్. తబస్సుమ్ రాసిన ఉత్తరాలు చూస్తే, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. -
ఏజెన్సీలో ఎన్కౌంటర్.. టెన్షన్ టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్కౌంటర్ జరపడం గమనార్హం. చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. (సమీక్షలతో డీజీపీ హల్ చల్) మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్కౌంటర్ జరిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
‘మా తల్లిదండ్రుల పాత్రలో ఎవరిని ఊహించలేను’
సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ సినిమా సూపర్‌హిట్టయిన సంగతి తెలిసింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ప్రస్తుతం 300 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఒకప్పటి బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ జీవతంలో ఉన్న ఎత్తుపల్లాలన్నింటిని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు. మున్నాబాయ్ జీవితంలో మత్తు పదార్ధాల దశ, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలుకెళ్లడం వంటి పలు అంశాలను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే ‘సంజు’ చిత్రంలో కేవలం సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు, తల్లి నర్గీస్ పాత్రలకే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారని, సంజయ్ సోదరిమణులు నమ్రతా దత్, ప్రియా దత్‌లను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ‘‘సంజు’ సినిమా నాకు నచ్చింది. కానీ సంజయ్ దత్ కుటుంబ సభ్యురాలిగా, సంజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా సినిమాను విశ్లేషించాలంటే కాస్తా కష్టమే. ఎందుకంటే సంజయ్ జీవితంలో ప్రతి క్షణం నేను అతనితో పాటే ఉన్నాను. అతన్ని దగ్గరి నుంచి చూశాను’ అన్నారు. అలానే సునీల్ దత్ పాత్రలో నటించిన పరేష్ రావల్ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న చాలా ప్రత్యేకం, ఆయన పాత్రలో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను ప్రేక్షకురాలిని కాదు కదా. అందుకే మా నాన్న పాత్రలో నటించిన పరేష్ రావల్‌కు నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అయితే పరేష్ రావల్ పాత్ర నాకు నచ్చలేదని కాదు. కానీ నేను ఆయన పాత్రకు అంతగా కనేక్ట్ కాలేకపోయాను అంతే. ఎందుకంటే నేను సునీల్ దత్ కూతుర్ని’. అన్నారు. అలానే తమ తల్లి పాత్రలో నటించిన మనిషా కోయిరాల గురించి మాట్లాడుతూ ‘మా అమ్మ పాత్రకు మనీషా కోయిరాల బాగానే సరిపోయింది. కానీ సునీల్ దత్, నర్గీస్‌ల కూతురిగా వారి పాత్రలో మరొకరిని ఊహించలేను. అలానే సంజయ్ కుటుంబ సభ్యురాలిగా సినిమా గురించి ఎటువంటి కామెంట్ చేయలేను. కానీ ప్రేక్షకులు వారి వారి పాత్రలకు బాగానే కనేక్ట్ అయ్యారు. అది చాలా గొప్ప విషయం’ అన్నారు. సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనను బాగా కదిలించిన సన్నివేశాలు సంజయ్ మత్తుపదార్ధాలకు బానిసవ్వడం, ఆ తర్వాత వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అని తెలిపారు. ఈ విషయం గురించి ‘అది నిజంగానే చాలా కష్ట సమయం, ముఖ్యంగా మా నాన్న గారికి. కానీ సంజయ్‌కి వీటన్నింటి నుంచి బయటపడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది. అందుకే మత్తు పదార్ధాల వ్యసనాన్ని జయించగలిగాడు. మళ్లీ దాన్ని పురావృతం కాకుండా చూసుకోగలిగాడు. అలానే సంజు జైలు జీవితం గడపడం కూడా చాలా కష్టమైన దశే. కానీ వీటన్నింటిని కూడా అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కొగలిగాడు’ అని తెలిపింది. -
‘ఆయన లేఖ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా’
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్, తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావెల్ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్ రావెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్ దత్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్ దత్ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్ సునీల్ దత్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది. సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను. ‘ డియర్ పరేష్ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. -
‘అమ్మ చనిపోతే కనీసం ఏడవలేదు’
భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది. 90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్‌లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్‌గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్లో నర్గీస్‌దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే. -
సంజయ్ దత్ ఎమోషనల్ వీడియో
-
సంజుని రిజెక్ట్ చేశా
దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ సూపర్‌హిట్ కాంబినేషన్ గురించి తెలిసిందే. ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి బ్లాక్‌బాస్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాణీ సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో ఆమిర్ ఖాన్‌ను ఓ పాత్ర కోసం సంప్రదించారట హిరాణీ. ఆ విషయం గురించి ఆమిర్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ çసంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ క్యారెక్టర్ చేయమని హిరాణీ నన్ను అప్రోచ్ అయ్యాడు. ఫెంటాస్టిక్ రోల్. సినిమా ఎక్కువగా తండ్రీ కొడుకుల రిలేషన్షిప్ మీద నడుస్తుంది. సంజూ రోల్ అత్యద్భుతంగా ఉంది. యాక్టర్‌గా సంజూ రోల్ నాకు బాగా నచ్చింది. ఒకవేళ చేస్తే సంజూ రోల్ చేస్తా. కానీ అది ఆల్రెడీ రణ్‌బీర్ కపూర్ చేస్తున్నాడు కాబట్టి వేరే ఏ రోల్ చేయను అని చెప్పేశాను’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా జూన్29న విడుదల కానుంది. -
సంజయ్ దత్ తండ్రిగా ఆమిర్ ఖాన్
మున్నాబాయ్ ఎమ్‌బిబియస్, 3 ఇడియట్స్, పికె లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం వివాదాస్పద బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ జీవిత కథ ఆదారంగా సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. తన కథను రాజ్ కుమార్ అయితేనే సరిగా చూపిస్తాడన్న నమ్మకంతో సంజయ్ దత్ కూడా ఆ బాధ్యతను ఈ దర్శకుడికే అప్పగించాడు. ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా.., రాజ్ కుమార్ హిరాణీ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ పాత్రకు యంగ్ హీరో రణబీర్ కపూర్‌ను ఫైనల్ చేసిన దర్శకుడు, ఇప్పుడు సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌ను సంప్రదిస్తున్నాడు. ప్రస్తుతం దంగల్ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న ఆమిర్.. ఏకంగా రణబీర్ కపూర్ లాంటి హీరోకు తండ్రిగా నటించేందుకు అంగీకరిస్తాడా..? ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇండియన్ స్క్రీన్ మీదే ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది. -
'ఎన్నో రాత్రులు ఆ హీరోలు బాధపడేవారు'
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలైనందుకు దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన సంజయ్ పుణె ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ తండ్రి, బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ దత్, దిలీప్ కుమార్ అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సంజయ్ అరెస్టయిన తర్వాత సునీల్ దత్ కుటుంబం ఎంతో బాధపడిందని సైరాభాను గతాన్ని వెల్లడించారు. 'సంజయ్ విడుదలయ్యాడని తెలిసి దిలీప్ సాబ్ చాలా సంతోషపడ్డారు. సంజయ్ అరెస్టయినపుడు సునీల్ దత్ సాబ్ కుటుంబం చాలా బాధపడింది. అప్పట్లో ఎన్నో సార్లు సునీల్ సాబ్, దిలీప్ సాబ్ కలిశారు. రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడుకునేవారు. సంజయ్ విషయం గురించి ఇద్దరూ బాధపడేవారు' అని సైరా భాను ట్వీట్ చేశారు. -
'సునీల్ దత్, వినోద్ ఖన్నాలే నాకు స్పూర్తి'
ముంబై: నటులుగా, రాజకీయ నాయకులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ దత్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హాల జీవితాలే తనకు ఆదర్శమని బీజేపీ నుంచి కొత్తగా లోక్ సభకు ఎన్నికైన మనోజ్ తివారీ స్పష్టం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించిన ఆ ముగ్గరు జీవితాల్నిసవాల్ తీసుకుని తాను కూడా ముందుకు వెళతానని తివారీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. వారి జీవితాలే తనకు ఆదర్శమన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు రాజకీయ రంగాల్లో రాణించలేరని అపవాదును వారు ముగ్గురు తొలగించారన్నారు. ఆ విమర్శలు సరైనవి కావనడానికి వారి రాజకీయ జీవితాన్ని పరికిస్తే అవగతమవుతుందన్నారు. 'నేను భోజ్ పూరి భాషా సంక్షేమానికి, హిందీ చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని' తివారీ తెలిపాడు. లోక్ సభలో ఈ అంశాలకు సంబంధించి తనగొంతును వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని తివారీ తెలిపారు. -
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
సాక్షితో ప్రియాదత్ మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా యువత ఉపాధికి పెద్దపీట వేస్తా సాక్షి-ముంబై: ప్రియాదత్.. బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ దంపతుల రాజకీయ వారసురాలిగా మహారాష్ర్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు జయభేరి మోగించిన ఈమె.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున పోటీపడుతున్న ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ గట్టిపోటీ ఇస్తున్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు పరుస్తాయని అంటున్న ప్రియాదత్ ‘సాక్షి’తో ముచ్చటించారు. అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... మా నియోజకవర్గంలోని యువత కోసం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. కోటక్ మహీంద్ర వంటి సంస్థలతో కలిసి పనులు చేపట్టాం. మూడు నెలల్లో కంప్యూటర్, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. వీటిలో శిక్షణ పొందేవారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నియోజకవర్గంలో సహారా ఎలివేటెడ్ రోడ్డు, రింగ్ రోడ్డు పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాదితులందరికీ పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇక మహిళల భద్రత విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. రాత్రి ఆలస్యంగా విధుల ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల కోసం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా కొన్ని పథకాలను ప్రారంభించాం. ఇందుకు బాంద్రా అడిషనల్ పోలీసు కమిషనర్‌తో సమావేశమై కార్యాచరరణ రూపొందించాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి మేం సమావేశమవుతున్నాం. ఈ బృందాలు మహిళలకు అంతగా సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా సీసీటీవీలు, ప్రీ-పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎంఎన్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం నా విజయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. 2009లో కూడా నాకు సుమారు 1.75లక్షల మెజార్టీ వచ్చింది. 3 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. శివసేన, ఎంఎన్ఎస్ అభ్యర్థులిద్దరికీ కలిపి కూడా మూడు లక్షల ఓట్లు రాలేదు. -
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్
* మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా * యువత ఉపాధికి పెద్దపీట వేస్తా శ్రీనివాస్ గుండారి, సాక్షి-ముంబై: ప్రియాదత్.. బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ దంపతుల రాజకీయ వారసురాలిగా మహారాష్ర్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు జయభేరి మోగించిన ఈమె.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున పోటీపడుతున్న ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ గట్టిపోటీ ఇస్తున్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు పరుస్తాయని అంటున్న ప్రియాదత్ ‘సాక్షి’తో ముచ్చటించారు. అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... మా నియోజకవర్గంలోని యువత కోసం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. కోటక్ మహీంద్ర వంటి సంస్థలతో కలిసి పనులు చేపట్టాం. మూడు నెలల్లో కంప్యూటర్, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. వీటిలో శిక్షణ పొందేవారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నియోజకవర్గంలో సహారా ఎలివేటెడ్ రోడ్డు, రింగ్ రోడ్డు పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాదితులందరికీ పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇక మహిళల భద్రత విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. రాత్రి ఆలస్యంగా విధుల ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల కోసం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా కొన్ని పథకాలను ప్రారంభించాం. ఇందుకు బాంద్రా అడిషనల్ పోలీసు కమిషనర్‌తో సమావేశమై కార్యాచరరణ రూపొందించాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి మేం సమావేశమవుతున్నాం. ఈ బృందాలు మహిళలకు అంతగా సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా సీసీటీవీలు, ప్రీ-పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎంఎన్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం నా విజయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. 2009లో కూడా నాకు సుమారు 1.75 లక్షల మెజార్టీ వచ్చింది. 3 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. శివసేన, ఎంఎన్ఎస్ అభ్యర్థులిద్దరికీ కలిపి కూడా మూడు లక్షల ఓట్లు రాలేదు. మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యం.. దత్ కుటుంబీకులు గత 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సునీల్ దత్ సతీమణి నర్గీస్ 1980లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 1984లో వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్‌పై నెగ్గిన సునీల్ దత్... ఆ ఎన్నికలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్‌జెఠ్మలానీని 1,54,640 ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత 1989, 1991 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటనతో తనయుడు సంజయ్‌దత్ కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో సునీల్‌దత్ సుమారు ఆరేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో 1996, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి శివసేన అభ్యర్థి మధుకర్ సర్ పోత్దార్ విజయం సాధించారు. 2004లో సునీల్‌దత్ మళ్లీ పోటీచేసి నెగ్గి, కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2005 మేలో సునీల్‌దత్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రియాదత్ విజయం సాధించారు.