‘అలా 308 మంది అమ్మాయిలను పడేశాడు’ | Sanju Director Revealed About Sanjay Dutt Relation With 308 Women | Sakshi
Sakshi News home page

‘అలా 308 మంది అమ్మాయిలను పడేశాడు’

Published Sat, Jun 23 2018 12:40 PM | Last Updated on Sat, Jun 23 2018 4:25 PM

Sanju Director Revealed About Sanjay Dutt Relation With 308 Women - Sakshi

సంజయ్‌ దత్‌ (ఫైల్‌ఫోటో)

కొన్ని రోజుల క్రితం సంజయ్‌ దత్‌ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్‌నాయక్‌’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్‌ కుమార్‌ హీరానీ సమాధానం చెప్పారు.

తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్‌ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్‌ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్‌ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్‌ హీరానీ. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంజు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్‌.

ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్‌ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్‌ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్‌ చేసి ఉంది. సంజయ్‌ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్‌ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్‌ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్‌ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం మీడియా రణ్‌బీర్‌ కపూర్‌ను ‘బాలీవుడ్‌ ప్లేబాయ్‌’గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి రణ్‌బీర్‌ ‘నేను కేవలం పదిమంది అమ్మాయిలతోనే డేటింగ్‌ చేసాను. కానీ బాబా(సంజయ్‌ దత్‌) కౌంట్‌ 308’ అన్నాడు. అంతేకాక ప్రతిరోజు షూటింగ్‌ జరగడానికి ముందు రోజు రాత్రి రణ్‌బీర్‌ సంజయ్‌దత్‌కు ఫోన్‌ చేసేవాడంట. తరువాత రోజు షూటింగ్‌ జరిగే సన్నివేశాల గురించి సంజయ్‌తో చర్చించే వాడంట. ఆ సమయంలో సంజయ్‌ మనసు ఎలా ఉండేది...ఆ సంఘటనల గురించి ఎలా స్పందించేవాడని అడిగి తెలుసుకునే వాడినన్నాడు రణ్‌బీర్‌.

అంతేకాక సంజయ్‌ డ్రగ్స్‌కు బానిసయినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రణ్‌బీర్‌. ‘ఒకానొక సమయంలో బాబా డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. ఆ సమయంలో ఒకసారి బాబాకు తన తండ్రి సునిల్‌ దత్‌ సాబ్‌ తల మీద క్యాండిల్‌ వెలుగుతున్నట్లు అనిపించిందంట. సంజయ్‌ వెంటనే వెళ్లి ఆ క్యాండిల్‌ను తొలగించాడంట. సంజయ్‌ డ్రగ్స్‌కు ఎంతలా బానిసయ్యడనే విషయం అప్పుడు దత్‌సాబ్‌కు అర్థమయ్యింది‘ అని రణ్‌బీర్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement