Girl Friends
-
రూ. 10కే గర్ల్‌ఫ్రెండ్ మీ సొంతం.. కండిషన్స్ అప్లై..!
బీజింగ్: ఒంటరిగా వచ్చే కుర్రాళ్ల కోసం చైనాలోని ఓ షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 10కే గర్ల్‌ఫ్రెండ్స్‌ని అద్దెకు పంపుతామంటోంది. దీంతో ఆ షాపింగ్ మాల్‌కు ఒక్కసారిగా యువకుల తాకిడి పెరిగిపోయింది. షాపింగ్‌కు వెళ్లే యువకులు అమ్మాయి తోడుగా ఉంటే బాగుండు అని ఫీలవుతుంటారు. ఇలాంటి ఆసక్తిని పసిగట్టిన సదరు షాపింగ్ మాల్ ఒంటరిగా వచ్చే యువకుల కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. మాల్‌లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు. సమయం దాటితే మాత్రం మనతో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు. మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్‌లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. తోడుగా ఉండటం మాత్రమే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా చేస్తారు. షాపింగ్ మాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లొచ్చు. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా షాపింగ్ మాల్ కండిషన్స్ మాత్రం కొందరు యువకుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. -
‘ఆయనకు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ హిందూ పాకిస్తాన్‌గా తయారవుతుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. శశిథరూర్‌కు మతిభ్రమించినట్టుగా ఉందని, ఆయనకు తక్షణం వైద్య సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్య స్వామి గురువారం సూచించారు. అవసరమైతే శశిథరూర్‌ను చికిత్స నిమిత్తం మెంటల్ ఆస్పత్రికి తరలించాలని అన్నారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి అద్దం పడుతున్నాయని, పాక్‌పై అసలు ఆయనకు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించేందుకు సాయపడాలని పాక్ ప్రధానిని సైతం ఆయన కోరారన్నారు. శశిథరూర్‌కు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వారంతా ఐఎస్ఐ మనుషులని వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు థరూర్ హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సైతం తప్పుపట్టారు. -
‘అలా 308 మంది అమ్మాయిలను పడేశాడు’
కొన్ని రోజుల క్రితం సంజయ్ దత్ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్నాయక్’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ సమాధానం చెప్పారు. తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్ హీరానీ. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంజు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్. ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్ చేసి ఉంది. సంజయ్ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం మీడియా రణ్‌బీర్ కపూర్‌ను ‘బాలీవుడ్ ప్లేబాయ్’గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రణ్‌బీర్ ‘నేను కేవలం పదిమంది అమ్మాయిలతోనే డేటింగ్ చేసాను. కానీ బాబా(సంజయ్ దత్) కౌంట్ 308’ అన్నాడు. అంతేకాక ప్రతిరోజు షూటింగ్ జరగడానికి ముందు రోజు రాత్రి రణ్‌బీర్ సంజయ్‌దత్‌కు ఫోన్ చేసేవాడంట. తరువాత రోజు షూటింగ్ జరిగే సన్నివేశాల గురించి సంజయ్‌తో చర్చించే వాడంట. ఆ సమయంలో సంజయ్ మనసు ఎలా ఉండేది...ఆ సంఘటనల గురించి ఎలా స్పందించేవాడని అడిగి తెలుసుకునే వాడినన్నాడు రణ్‌బీర్. అంతేకాక సంజయ్ డ్రగ్స్‌కు బానిసయినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రణ్‌బీర్. ‘ఒకానొక సమయంలో బాబా డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. ఆ సమయంలో ఒకసారి బాబాకు తన తండ్రి సునిల్ దత్ సాబ్ తల మీద క్యాండిల్ వెలుగుతున్నట్లు అనిపించిందంట. సంజయ్ వెంటనే వెళ్లి ఆ క్యాండిల్‌ను తొలగించాడంట. సంజయ్ డ్రగ్స్‌కు ఎంతలా బానిసయ్యడనే విషయం అప్పుడు దత్‌సాబ్‌కు అర్థమయ్యింది‘ అని రణ్‌బీర్ తెలిపాడు. -
గర్ల్‌ఫ్రెండ్స్ కోసం చోరీలు
బంజారాహిల్స్: జల్సాలు, గర్ల్‌ఫ్రెండ్స్ కోసం చోరీల బాటపట్టిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నైకి చెందిన కార్తీక్ రాజ్ అక్కడి ఐసీఐసీఐ బ్యాంకులో పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడికి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో తన జీతం డబ్బులు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. చెన్నైలో దొంగతనం చేస్తే పట్టుబడతానేమోనని గూగుల్ సహాయంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఈ నెల 7న హైదరాబాద్ వచ్చిన కార్తీక్ బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే వంశీకృష్ణారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటికి కన్నం వేశాడు. అలమార తెరుస్తుండగా మేల్కొన్న వంశీకృష్ణ కేకలు వేయడంతో ఆభరణాలు అక్కడే పడేసి పరారయ్యాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ వద్ద ఇంకో ఇంటికి కన్నం వేసేందుకు యత్నిస్తున్న కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. జీతం సరిపోవడం లేదని గర్ల్‌ఫ్రెండ్స్ కోసమే భారీ మొత్తంలో దొంగతనం చేయాలని నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. ఈ టోర్నీలో ఏకాగ్రత చెదరకుండా, ఇప్పటివరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను బోర్డు మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. అంటే ఇకపై ప్రపంచకప్ సమయంలో భారత క్రికెటర్లతో వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ కలిసి ఉండే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం. -
నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే!
ముంబై: తనకు ఇంకా సిక్స్ ప్యాక్ రాలేదని, ప్రస్తుతానికి ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నానని బాలీవుడ్ వర్దమాన నటుడు అర్మాన్ జైన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం అర్మాన్ సిక్స్ కోసం పరితపిస్తున్నా..శరీరాకృతిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదని అంగీకరించాడు. 'నేను ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నాను. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే నా బాడీ లాంగ్వేజీలో మార్పు కోసం యత్నిస్తానని' అర్మాన్ తెలిపాడు. తనకు సినిమాలతో పాటు.. ఆటలంటే మహాప్రాణమన్నాడు. ప్రతీరోజూ రెండు గంటలపాటు ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్ ఆటలు ఆడుతుంటానన్నాడు. అరిఫ్ ఆలీ దర్శకత్వంలో రూపొందిన 'లేకర్ హమ్ దీవానా దిల్ ' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అర్మాన్..దీక్షాసేథ్ తో జోడీ కట్టాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ కు ముఖానికి రంగువేసుకునేముందే సినిమాతో సంబంధం ఉంది. కరణ్ జోహార్ వద్ద అతను మూడు సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేశాడు. 'మై నేమ్ ఈజ్ ఖాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ', 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాలకు అర్మాన్ శిక్షను పొందాడు. కేవలం కరణ్ వద్దకు సినిమా డైరెక్షన్ నేర్చుకుందామనే మాత్రమే ఫీల్డ్ లో అడుగుపెట్టినట్లు ఈ 23 ఏళ్ల యువనటుడు తెలిపాడు. తాను లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చని గతంలో అర్మాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు అని పేర్కొన్నాడు. -
'గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఫన్నీగా ఉంది'
న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువతార అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు. ఇదిలా ఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను వారి సోదరుడిగా భావించారు. చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం కూడా దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. బాలీవుడ్లో అడుగు పెట్టడం కోసం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును మధ్యలోనే వదిలేసిన అర్మాన్...తన బరువు కొంతకాలం పెరగడం, మరికొంతకాలం తగ్గడం తరచూ జరుగుతుంటుందన్నాడు. కళాశాలకు వెళుతున్న సమయంలో తాను 12 కిలోల మేర బరువు తగ్గానన్నాడు. ఒకసారి తన బరువు 66 కిలోల వరకూ కూడా తగ్గిందన్నాడు. -
గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేందుకు చోరీలు
ముషీరాబాద్ న్యూస్‌లైన్: విలాసాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ పాల్పడుతున్న ముగ్గురు యువకులు ముషీరాబాద్ పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు వీరి నుంచి 22 తులాల బంగారు నగలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, డీఐ హసీబుల్హా నిందితుల వివరాలు వెల్లడించారు... పాతబస్తీలోని సత్తార్‌బాగ్ కు చెందిన షంషుద్దీన్ అలియాస్ టిప్పూ, మహ్మద్ ఇలియాస్, జహనుమాలోని చార్చమన్కు చెందిన మహ్మద్ షోయబ్, ఒట్టేపల్లికి చెందిన మీర్జా హయత్బేగ్ స్నేహితులు. వీరంతా ఇంటర్ ఫెయిల్ అయ్యారు. అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో జల్సాగా తిరిగేందుకు అవసరమైన డబ్బుల కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. పని ఉందంటూ టిప్పూ తన మామకు చెందిన పల్సర్ బైక్‌ను తీసుకెళ్తున్నాడు. స్నేహితులతో కలిసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ బైక్‌ను తెచ్చి మామకు అప్పగిస్తున్నాడు. ఈ విధంగా మొత్తం 11 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అలాగే మరో బైక్‌ను దొంగిలించి దానిపై తిరుగుతూ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఇలా ఐదు ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేసి 22 తులాల బంగారాన్ని అపహరించారు. గాంధీనగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లని బైక్‌పై వెళ్తున్న టిప్పూ, షోయబ్, హయత్బేగ్లను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు స్నాచింగ్స్ పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. మరో నిందితుడు మహ్మద్ ఇలియాస్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.