నిందితుడు కార్తీక్ రాజ్..
బంజారాహిల్స్: జల్సాలు, గర్ల్‌ఫ్రెండ్స్ కోసం చోరీల బాటపట్టిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నైకి చెందిన కార్తీక్ రాజ్ అక్కడి ఐసీఐసీఐ బ్యాంకులో పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడికి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో తన జీతం డబ్బులు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. చెన్నైలో దొంగతనం చేస్తే పట్టుబడతానేమోనని గూగుల్ సహాయంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను ఎంచుకున్నాడు.
ఈ నెల 7న హైదరాబాద్ వచ్చిన కార్తీక్ బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే వంశీకృష్ణారెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటికి కన్నం వేశాడు. అలమార తెరుస్తుండగా మేల్కొన్న వంశీకృష్ణ కేకలు వేయడంతో ఆభరణాలు అక్కడే పడేసి పరారయ్యాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ వద్ద ఇంకో ఇంటికి కన్నం వేసేందుకు యత్నిస్తున్న కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. జీతం సరిపోవడం లేదని గర్ల్‌ఫ్రెండ్స్ కోసమే భారీ మొత్తంలో దొంగతనం చేయాలని నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment