Karthik Raj
-
ఆకట్టుకుంటోన్న ‘కేసీపీడీ’ వీడియో సాంగ్
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు 'అథర్వ' అనే చిత్రం రాబోతోంది. అన్ని రకాల ఎమోషన్స్ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘విడుదలకు సిద్దమైన అథర్వ ’
సస్పెన్స్, క్రైమ్ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జానర్ తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే అథర్వ. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అథర్వ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది. అథర్వ అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. 'అథర్వ' సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. -
‘అతడికే ఈ సినిమా అంకితం’
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాము. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాము. హిట్ కొట్టాలని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా... నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి... తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
భయానికి మించి.. నిను వీడని నీడను నేనే
మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఎమోషనల్ హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. సందీప్ కిషన్ అద్ధంలో చూసుకుంటే ప్రతిబింబంలో వెన్నెల కిశోర్ కనిపిస్తాడు. అలా కనిపించడానికి కారణం ఏంటి. ట్రైలర్లో కనిపించే ఆ భయానక రూపాలేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. జూలై 12న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
చివరి దశలో ‘నిను వీడని నీడను నేనే’
మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఎమోషనల్ హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో రాబోతున్న ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా... దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ - ‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిషన్ తొలిసారి నటిస్తోన్న హారర్ చిత్రమిది. మనిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మనిషి తన నీడతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కొన్నాడనేదే పాయింట్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నాం దీంతో సినిమా పూర్తవుతుంది’ అన్నారు. -
కొత్త జానర్.. కొత్త జర్నీ
లవ్, కామెడీ, యాక్షన్... ఇప్పటివరకూ ఈ జానర్ సినిమాలే చేశారు సందీప్ కిషన్. ఫర్ ఎ చేంజ్.. ఈసారి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్‌రాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ బైలింగువల్ సినిమాను బుధవారం అనౌన్స్ చేశారు సందీప్ కిషన్. ‘‘నా నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు సూపర్ ఎగై్జటింగ్‌గా ఉంది. సూపర్ న్యాచురల్ ఎంటర్ౖటñ నర్గా ఉండబోతోంది. కొత్త జర్నీకి మమల్ని విష్ చేయండి’’ అని పేర్కొన్నారాయన. ఈ సినిమాకు యస్.యస్. తమన్ సంగీత దర్శకుడిగా, పీయస్ వర్మ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్ నటించిన బైలింగువల్ మూవీ ‘నరగాసురన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
గర్ల్‌ఫ్రెండ్స్ కోసం చోరీలు
బంజారాహిల్స్: జల్సాలు, గర్ల్‌ఫ్రెండ్స్ కోసం చోరీల బాటపట్టిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నైకి చెందిన కార్తీక్ రాజ్ అక్కడి ఐసీఐసీఐ బ్యాంకులో పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడికి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో తన జీతం డబ్బులు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. చెన్నైలో దొంగతనం చేస్తే పట్టుబడతానేమోనని గూగుల్ సహాయంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఈ నెల 7న హైదరాబాద్ వచ్చిన కార్తీక్ బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే వంశీకృష్ణారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటికి కన్నం వేశాడు. అలమార తెరుస్తుండగా మేల్కొన్న వంశీకృష్ణ కేకలు వేయడంతో ఆభరణాలు అక్కడే పడేసి పరారయ్యాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ వద్ద ఇంకో ఇంటికి కన్నం వేసేందుకు యత్నిస్తున్న కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. జీతం సరిపోవడం లేదని గర్ల్‌ఫ్రెండ్స్ కోసమే భారీ మొత్తంలో దొంగతనం చేయాలని నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్ఎం
ప్రత్యేకంగా మైన్స్ (ఖనిజాలు, గనులు) రంగంలో నిష్ణాతులైన నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) - ధన్‌బాద్. జార్ఖండ్‌లో కొలువైన ఈ ఇన్స్టిట్యూట్ దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న తిరుపతి కార్తీక్ రాజ్ తన క్యాంపస్ కబుర్లను వివరిస్తున్నాడిలా.. అంతా తెలుగుమయం 400 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని 450 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తర్వాత బెంగాల్, బీహార్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఇండస్ట్రీ విజిట్స్ సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి తరగతులు ఉంటాయి. వారానికి 30 గంటలు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టుపరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి ఇతర విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి కూడా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. నేను ఫస్టియర్‌లో మేనేజ్మెంట్ ఇంటర్న్‌షిప్ కోసం ఇండోనేషియా వెళ్లాను. అక్కడ 45 రోజులపాటు వివిధ కంపెనీలకు వె ళ్లి బిజినెస్‌కు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకున్నాను. ఆసియాలోనే పెద్ద లైబ్రరీ ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల వారీగా హాస్టల్స్ ఉంటాయి. ర్యాగింగ్‌ను నిరోధించాలనే ఉద్దేశంతో ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేకంగా హాస్టల్స్ కేటాయించారు. ఇండోర్ గేమ్స్ (బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్) ఆడుకోవడానికి హాస్టల్లో సదుపాయాలున్నాయి. పూర్తిగా ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఇక్కడ ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఐఐటీ స్థాయి గుర్తింపు దక్కలే దు. వచ్చే ఏడాది మార్చిలో ఐఎస్‌ఎంకు ఐఐటీల స్థాయి గుర్తిం పు లభించే అవకాశం ఉంది. ప్రతిభావంతులకు మెరిట్ కమ్ మీ న్స్ స్కాలర్షిప్స్ ఉంటాయి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.4.5 లక్షలకు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెడిషనల్ సబ్జెక్టులు కూడా సెమిస్టర్‌కు ఐదు సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఇంగ్లిష్, మేనేజ్మెంట్ ఎకనామిక్స్ వంటివాటిని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ సెమిస్టర్‌కు 30 శాతం వెయిటేజ్, ఎండ్ సెమిస్టర్‌కు 60 శాతం వెయిటేజ్ ఉంటాయి. మరో 10 శాతం ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మైనింగ్ సంబంధిత కోర్సుల కోసం ప్రత్యేకంగా ఏర్పడింది ఈ ఇన్స్టిట్యూట్. మైనింగ్, పెట్రోలియం, మినరల్ ఇంజనీరింగ్ కంటే సీఎస్ఈ విద్యార్థులే అత్యధిక పే ప్యాకేజీలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థులను కోల్ ఇండియా వంటి కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే నియమించుకుంటున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కు సంబంధించిన కంపెనీలు కూడా పెద్దగా రావడం లేదు. పూర్వ విద్యార్థుల సమ్మేళనమే బసంత్ ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ ఉంటాయి. ఒక్కోటి మూడు రోజులపాటు జరుగుతుంది. బసంత్ పేరుతో పూర్వ విద్యార్థుల ఫెస్ట్ కూడా ఏటా ఉంటుంది. దీనికి పూర్వ విద్యార్థులంతా హాజరవుతారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కెరీర్ గెడైన్స్, స్టార్టప్స్‌కు సంబంధించి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, క్రికెట్ క్లబ్ ఇలా ఎన్నో క్లబ్‌లు ఉంటాయి. వీటి ల్లో చేరడం ద్వారా సంబంధిత అంశాలపై పట్టు సాధించవచ్చు. ఈ-సెల్ అందించే సేవలెన్నో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. దీని ఆధ్వర్యంలో బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. ఇంకా స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా.