మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఎమోషనల్ హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో రాబోతున్న ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా... దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ - ‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిషన్ తొలిసారి నటిస్తోన్న హారర్ చిత్రమిది. మనిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మనిషి తన నీడతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కొన్నాడనేదే పాయింట్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నాం దీంతో సినిమా పూర్తవుతుంది’ అన్నారు.
Published Sat, Jan 19 2019 1:16 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment