Ninu Veedani Needanu Nene
-
ఫన్ రైడ్.. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’
‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి విజయం సాధించిన సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’. ఈ సినిమాలో సందీప్ కేసులు రాక ఇబ్బందులు పడే లాయర్ పాత్రలో అలరించనున్నాడు. సందీప్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తుండగా మురళీ శర్మ, కిన్నెరలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజసింహా కథ అందించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌కు ఇది 75వ సినిమా కావటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. -
అదే నిజమైన విజయం
‘‘రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా చాలా బాగుంది. ఫలానా సీన్ బాగుంది. చివర్లో మదర్ సెంటిమెంట్ బాగుంది’ అని చెప్పారు. అదే నిజమైన విజయమని భావిస్తున్నాను. బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్ అనను. దాదాపు రెండేళ్ల తర్వాత మంచి హిట్ సాధించానని చెప్పగలను’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యాసింగ్ కథానాయికగా నటించారు. విజి. సుబ్రహ్మణ్యన్, దయా పన్నెం, సందీప్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం అనిల్ సుంకర సమర్పణలో ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. మా అబ్బాయి లవ్ ఫెయిల్యూర్‌తో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా 3 నెలల కింద వచ్చి, మా అబ్బాయి చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునే ముందు మా గురించి ఆలోచించేవాడేమో అని బాధపడ్డారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మమ్మల్ని నమ్మి ఈ సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యారని చెప్పగలను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకరగారు హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యం చేసిన సందీప్‌ను మెచ్చుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాను నిర్మించడానికైనా సందీప్‌లాంటి హార్డ్‌వర్కర్ గెలవాలి’’ అన్నారు తమన్. ‘‘నిర్మాతగా మా తొలి సినిమా ఇది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దయా పన్నెం. ‘‘ఈ సినిమా విజయంలో భాగస్వామ్యం కల్పించిన సందీప్ కిషన్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు’’ అన్నారు అన్యా సింగ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండు!
బాలీవుడ్లో తెలుగు సినిమాల రీమేక్‌ల హవా ఇంకా కొనసాగేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి నాని నటించిన ‘జెర్సీ’, సందీప్‌కిషన్ తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాలు చేరాయి. ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటరై్టన్మెంట్స్తో కలిసి నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తారని సమాచారం. అలాగే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం హిందీ రీమేక్స్ రైట్స్‌ను దర్శకుడు రాజ్ అండ్ డీకే దక్కించుకున్నారు. తెలుగులో ‘డి’ ఫర్ దోపిడి, హిందీలో షోర్ ఇన్ ది సిటీ, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వంలో వహించారు. అలాగే నిర్మాతలుగా గత ఏడాది రాజ్, డీకే తీసిన ‘స్త్రీ’ భారీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తెలుగు హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఓ బేబి’, ‘హుషారు’ హిందీలో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ‘టెంపర్’ (హిందీలో ‘సింబ’), ‘అర్జున్‌రెడ్డి’ (హిందీలో ‘కబీర్‌సింగ్’) చిత్రాలు హిందీలో రీమేక్ అయి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. -
బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’
యంగ్ హీరో సందీప్ కిషన్ స్వయంగా నిర్మించి నటించిన సినిమా నిను వీడని నీడను నేనే. చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరోకు నిను వీడని నీడను నేనేతో బిగ్ హిట్ వచ్చింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావటంతో బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో స్త్రీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, షోర్ చిత్ర దర్శకులు నిను వీడని నీడను నేనే చిత్ర రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా మార్గదర్శకులు, సోదరులు అయిన రాజ్, డీకేలు నా సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. నా సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. Take pleasure in announcing that the Producers of #Stree & directors of #Shor in the city..my mentors & brothers @rajndk have bought the Hindi Remake rights of #NinuVeedaniNeedanuNene ❤️ Couldn have asked for the film to be in better hands 🙏🏽🙏🏽🙏🏽 Thank you God 🙏🏽❤️🙌🏼#NVNN — #NVNN 12th July (@sundeepkishan) 16 July 2019 -
విజయనగరంలో సందీప్‌కిషన్ సందడి
-
అంతకన్నా ఏం కావాలి?
‘‘నిను వీడని నీడను నేనే’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని, క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు తమ మనసును కదిలించాయని చెబుతున్నారు’’ అని అన్య సింగ్ అన్నారు. సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ అన్యసింగ్ పంచుకున్న విశేషాలు... ► మాది ఢిల్లీ. అజ్మీర్‌లోని బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలని మానేశా. కాలేజీలో ఉన్నప్పుడు వెడ్డింగ్ ప్లానర్‌తో కలిసి పనిచేశా. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను. నా తొలి హిందీ సినిమా ‘ఖైదీ బాండ్’ లో నా నటన నచ్చి సందీప్ కిషన్, కార్తీక్ రాజు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. ► శుక్రవారం ఉదయం కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో సినిమా బాలేదని ఎవరో రాస్తే చదివి, నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్‌కి వెళ్లిపోయా. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారామ్ ఫోన్ చేసి, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి రమ్మని చెప్పారు. సోషల్ మీడియాలో, రివ్యూస్‌లో సినిమా చాలా బాగుందని రాయడంతో సంతోషంగా అనిపించింది. వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. అంతకన్నా ఏం కావాలి. నేను చాలా సంతోషంగా ఉన్నా. ► సినిమా విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. సందీప్ కిషన్‌తో సెల్ఫీలు తీసుకోవటానికి పోటీ పడ్డారు. ‘నిను వీడని నీడను నేనే’ సమయంలో క్యాన్సర్ వల్ల మా నాన్నగారు మరణించారు. దాంతో షాక్‌లోకి వెళ్లాను. తర్వాత నెమ్మదిగా కోలుకున్నాను. ► సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను. హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కష్టపడ్డాను. హారర్ సినిమాలు చూడాలన్నా, చేయాలన్నా భయపడతా. థ్రిల్లర్స్ అంటే ఇష్టం. ► సందీప్ కిషన్‌తో పనిచేయడం సౌకర్యంగా ఉంది. నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. షూటింగ్లో నాకు డైలాగులు అర్థం కాకపోతే చెప్పేవాడు. కార్తీక్ రాజు కూడా బాగా సహకరించారు. ఈ సినిమాలో నేను సహజంగా నటించానని, సహజ నటి అంటూ ప్రేక్షకులు అంటుంటే సంతోషంగా ఉంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.. పరవాలేదు. ► తెలుగులో కొంతమంది నిర్మాతలు సంప్రదించారు.. అయితే ఇంకా ఏ ప్రాజెక్టు కూడా ఫైనలైజ్ కాలేదు. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్‌తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే. -
నేచురల్ యాక్టర్ అంటున్నారు : ఆన్య సింగ్
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదలైంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆన్య సింగ్ కథానాయికగా పరిచయం అయ్యారు. సినిమాకు హిట్ టాక్ రావటంతో కథానాయిక ఆన్య సింగ్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మీ నేపథ్యం ఏంటి? మాది ఢిల్లీ. నేను అజ్మీర్ లోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అందుకని మానేశా. బోర్డింగ్ స్కూల్ లో చదివిన తర్వాత మళ్లీ స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలనిపించలేదు. కాలేజీ లో ఉన్నప్పుడు వెడింగ్ ప్లానర్ ఒకరితో కలిసి పనిచేశా. చిన్నప్పటినుంచి నటన అంటే ఇష్టం. అందుకని చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను. సినమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? గ్రేట్ రెస్పాన్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ మనసును కదిలించాయని చెబుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం నేను కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో ఎవరో బాలేదని రాస్తే చదివాను. నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్ కి వెళ్లిపోయా. మా అమ్మకు అంతకుముందే ఫోన్ చేసి చెప్పాను. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారామ్ ఫోన్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఇంటర్నెట్ లో చూశా. సోషల్ మీడియాలో, రివ్యూస్‌లో సినిమా చాలా బాగుందని రాశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. ఐ యాం సో హ్యాపీ. విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు కదా. ప్రేక్షకుల్ని నేరుగా కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? సినిమా ఈ రోజే విడులైంది కదా ఎక్కువమంది చూశారో లేదో అనుకున్నాను. శుక్రవారం సాయంత్రానికి చాలా మంది చూశారు. మెట్రోలో వెళ్ళినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. ఒక్క చిత్రమే చేశాను కదా! నన్ను గుర్తు పట్టకున్నా... సినిమా చూశామని చెబితే సంతోషించా. సందీప్ కిషన్ చుట్టూ ప్రేక్షకులు గుమిగూడారు. తనతో సెల్ఫీలు తీసుకోవటానికి ఎదురు చూశారు. ఈ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది? మా హీరో సందీప్ కిషన్, దర్శకుడు కార్తీక్ రాజు నా తొలి హిందీ సినిమా ‘ఖైదీ బ్యాండ్’ చూశారు. అందులో నా నటన నచ్చి ఈ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సందీప్ కిషన్ చెప్పారు. ఏమైంది? క్యాన్సర్ వలన మా నాన్నగారు మరణించారు. నాకు తీరని లోటును మిగిల్చి వెళ్లిపోయారు. నాన్న మరణంతో షాక్ లోకి వెళ్లాను. తర్వాత నెమ్మదిగా కోలుకున్నాను ‘నిను వీడని నీడను నేనే’లో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశారు. ఒక సన్నివేశంలో దెయ్యంగాను కనిపించారు. సినిమాలో మీరు బాగా కష్ట పడిన సన్నివేశం ఏది? హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించేశా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డాను. సినిమాలో నా పాత్ర చూస్తే... చాలా ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్. ఎక్కువ సన్నివేశాల్లో ఏడుస్తూనే కనిపిస్తా. ప్రేక్షకులకు తెరపై పాత్ర తాలూకు భావోద్వేగాలను కనెక్ట్ అయ్యేలా నటించడం చాలా కష్టం. షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను. మీకు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? హారర్ ఇష్టం లేదు. కొంచెం భయపడతా... చూడటానికి, చేయటానికి. థ్రిల్లర్స్ అంటే ఇష్టం. హాలీవుడ్ మూవీ సెవెన్ నాకు ఇష్టమైన థ్రిల్లర్ సినిమా. నిను వీడని నీడను నేనే హారర్ కాదు కదా. సినిమాలో హారర్ సన్నివేశం ఒక్కటే ఉంది. అది చేసేటప్పుడు చుట్టూ జనాలు ఉన్నారు. అయినా... రాత్రిపూట తీయడంతో కొంచెం టెన్షన్ పడ్డాను. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే... థ్రిల్లర్ అయినా ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్ కూడా బావుంటుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో మీకు అద్దంలో ఎవరైనా కనిపిస్తే? అమ్మో! హార్ట్ ఎటాక్ వస్తుంది. అద్దంలో నాకు నేనే కనిపించాలి. నా బదులు వేరే వాళ్ళు కనిపించాలని అస్సలు కోరుకోను. సందీప్ కిషన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? వెరీ కంఫర్టబుల్! నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అందువల్ల, షూటింగ్ జరిగేటప్పుడు సందీప్ కిషన్ ఎంతో హెల్ప్ చేశాడు. నాకు డైలాగులు అర్థం కాకపోతే వివరించి చెప్పేవాడు. సందీప్ కిషన్ కి సినిమాలంటే ఎంతో ప్రేమ. వెరీ టాలెంటెడ్ యాక్టర్. కమిట్ మెంట్ తో వర్క్ చేస్తాడు. సన్నివేశం బాగా రావడానికి ఎంత కష్ట పడటానికి అయినా వెనుకాడడు. అతనితో పాటు మా దర్శకుడు కార్తీక్ రాజు కూడా నాకు బాగా సహకరించారు. ఈ సినిమాకు గాను మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మంది నేను సహజంగా నటించానని చెప్పారు. నేచురల్ యాక్టర్ అనడం బాగుంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. పరవాలేదు. తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు? కొంతమంది నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. అయితే... ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాం. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్ నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే నేను ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే. -
సినిమా అదిరింది అంటున్నారు
‘‘కంటినిండా నిద్రపోయి సుమారు వారమైంది. ఎంతో నమ్మి ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్ పడ్డాను. మొన్న మేమంతా తిరుమలకు వెళ్లాక, టెన్షన్ తట్టుకోలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశా. శుక్రవారం ఉదయం ఆట పడ్డాక ఫోన్ ఆన్ చేశా’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్, అనన్యాసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తొలి ఆట నుంచి సినిమాకు హిట్ టాక్ రావడంతో టపాసులు కాల్చి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు యూనిట్. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం ఒంటిగంటకు ఫోన్ స్విచ్ఛాన్ చేశా. చాలామందికి ఫోన్లు చేశా.. ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్ అదిరింది. లాస్ట్‌లో ఎమోషన్ అదిరిపోయింది, సినిమా సూపర్‌గా ఉంది.. చివరలో ఏడ్చాం’ అంటూ చాలా పాజిటివ్‌గా చెబుతుంటే సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి, కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సోమవారం నుంచి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం సక్సెస్ఫుల్ అయింది. షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మరికొన్ని షోలు పెంచమని అడుగుతున్నారు’’ అని దయా పన్నెం అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉన్నా. సందీప్ కిషన్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. మా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అనన్యా సింగ్. నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ పాల్గొన్నారు. -
అదే నిజమైన ఆనందం : సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ నిను వీడని నీడను నేనే. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా నిర్మాతగానూ తన అధృష్టాన్ని పరీక్షించుకున్న సందీప్ కిషన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా తనకు వచ్చిన ఓ మేసేజ్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు సందీప్. ఈ రోజు ఉదయం ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చేసేందుకు వెళ్లిన సందీప్ కిషన్ తండ్రి ఫస్ట్ హాఫ్ పూర్తయన వెంటనే పుత్రోత్సాహంతో సందీప్‌కి మెసేజ్ చేశాడు. ‘మార్నింగ్ షోకు థియేటర్ 90 శాతం నిండింది. ఫస్ట్ హాప్ సూపర్’ అంటూ మెసేజ్ చేశాడు. ఈ సంభాషణ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన సందీప్ ‘మీ తల్లిదండ్రుల నవ్వుకు మీరు కారణమవ్వటమే నిజమైన ఆనందం. ఈ మెసేజ్ చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. (మూవీ రివ్యూ : ‘నిను వీడని నీడను నేనే’) True Happiness is when you know that you put a smile on your Parents face... Just got this message which kind of got me all Teary eyed... Thank you aundience for giving me this moment again..been a while..❤️#NinuVeedaniNeedanuNene pic.twitter.com/7VBaPSr7kN — #NVNN 12th July (@sundeepkishan) 13 July 2019 -
‘నిను వీడని నీడను నేనే’ సక్సెస్‌మీట్
-
‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ
-
‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ
టైటిల్ : నిను వీడని నీడను నేనే జానర్ : థ్రిల్లర్ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ సంగీతం : తమన్ దర్శకత్వం : కార్తీక్ రాజు నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు. అందుకే స్వయంగా నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించాడు. తమిళ దర్శకుడు కార్తీక్ రాజును టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సందీప్‌కు ఆశించిన విజయం అందించిందా..? హీరోగా, నిర్మాతగా రెండు బాద్యతలను సందీప్ సమర్థవంతంగా పోషించాడా..? కథ : సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్(మురళీ శర్మ) తను డీల్ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా ఇతర వ్యక్తులు రిషీ, దియా ముఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపించేది ఎవరు? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అన్నదే సినిమా కథ. నటీనటులు : సందీప్ కిషన్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా మంచి మార్కులు సాధించింది. లుక్స్ పరంగా ఆకట్టుకున్న ఆన్య నటనలోనూ పరవాలేదనిపించింది. మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సందీప్ కిషన్ తొలిసారిగా నిర్మాతగా మారుతున్న సినిమా కోసం ఆసక్తికర కథను రెడీ చేశాడు దర్శకుడు కార్తిక్ రాజు. సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పాయింట్‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే కీలకమైన మలుపులన్ని ద్వితీయార్థంలో చూపించిన దర్శకుడు ఫస్ట్‌హాఫ్‌లో కథను కాస్త నెమ్మదిగా నడిపించాడు. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వరుస ట్విస్ట్‌లతో ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, ప్రీ క్రైమాక్స్, క్లైమాక్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో లాజిక్ల కోసం వెతికితే మాత్రం కష్టం. థ్రిల్లర్ సినిమాలకు తమన్ ఎప్పుడూ సూపర్బ్ మ్యూజిక్‌తో అలరిస్తాడు. ఈ సినిమాలోనూ తమన్ తన మార్క్ చూపించాడు. పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: సందీప్ కిషన్ నేపథ్య సంగీతం కథలో మలుపులు మైనస్ పాయింట్స్: లాజిక్ లేని సీన్స్ సెకండ్ హాఫ్ కామెడీ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌డెస్క్. -
తొలి టికెట్ ప్రభాస్ చేతికి..
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ టికెట్ ను యంగ్ రెబల్ స్టార్, 'బాహుబలి' ప్రభాస్ లాంచ్ చేశారు. ప్రచార చిత్రాలు చూశానని, ఈ చిత్రంతో సందీప్ కిషన్ మంచి విజయం అందుకుంటాడని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ప్రభాస్ అన్న అందరి మంచి కోరే వ్యక్తి. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆయన అండగా నిలబడతారు. మేం అడగ్గానే మా ఆహ్వానాన్ని మన్నించి 'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ లాంచ్ చేశారు. ప్రభాస్ అన్నకు చాలా చాలా థాంక్స్. కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతోంది. ఇదొక న్యూ ఏజ్ హారర్ ఫిల్మ్. ప్రేక్షకులకు కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అందరికీ మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని అన్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రగతి తదితరులు నటించారు. -
యంగ్ హీరోల అగ్రిమెంట్
ఇటీవల కాలంలో యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలుపుకుపోతున్నారు. మల్టీస్టారర్ సినిమాలు చేయటంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు తామే హీరోలుగా సినిమాలు నిర్మించటంతో పాటు ఇతర హీరోలతోనూ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నిను వీడని నీడను నేనే సినిమా ప్రీ రిలీజ్ వేడుక వేదికగా యంగ్ హీరో ఇంట్రస్టింగ్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. నిను వీడని నీడను నేనే సినిమా కోసం సందీప్ కిషన్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదిక మీద నుంచి తాను సుధీర్ బాబు హీరోగా ఓ సినిమాను నిర్మిస్తానంటూ ప్రకటించారు సందీప్. సుధీర్ బాబు కూడా తన బ్యానర్లో సందీప్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని ప్రకటించాడు. వెంటనే వేదిక మీద ఉన్న మరో యంగ్ హీరో నిఖిల్.. ఈ ఇద్దరు హీరోల నిర్మాణంలో తాను ఫ్రీగా నటిస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రకటనలతో సరిపెట్టినా తర్వలోనే ఈ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కితే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. -
బెడిసి కొట్టిన ప్రమోషన్.. సారీ చెప్పిన హీరో
యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. హారర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సందీప్ నిర్మాతగానూ మారుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు విమర్శలకు కారణమైంది. కమెడియన్ ప్రియదర్శి తన బైక్‌ను ఎవరో కొట్టేశారంటూ నిన్న తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించింది. దీంతో ప్రియదర్శి ఆ వీడియోను తన ట్విటర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన హీరో సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రేక్షకులను క్షమాపణ కోరిన సందీప్ అది సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో అని చెప్పాడు. సినిమా నటించేందుకు ప్రియదర్శి డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో అతని బైక్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిందన్నాడు సందీప్. ఇటీవల మలయాళ నటి ఆశా శరత్ ఇలా ప్రమోషన్ వీడియోతో చిక్కుల్లో పడ్డారు. తన భర్త కనిపించటం లేదంటూ ఆశా పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావటంతో చిత్రయూనిట్ అది ప్రమోషనల్ వీడియోఅధికారిక ప్రకటన విడువల చేయాల్సి వచ్చింది. Sorry this got more serious than we expected..it's a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene .. As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film.. PS: I loved riding it ❤️ Love you Darshi boy 😘😘😘 pic.twitter.com/sx6DbUN4Sh — #NVNN 12th July (@sundeepkishan) 8 July 2019 -
నన్ను నేను చూసుకుని రెండేళ్లయింది!
‘‘నేను నమ్మిన కథను అందరూ నమ్మాలని లేదు. అందుకే ఈ సినిమాకి నేనూ ఓ నిర్మాతగా చేశా. వేరే వాళ్ల డబ్బులు పెట్టినప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించలేను. ఒక్కొక్కళ్ల ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు సందీప్ కిషన్. కార్తీక్ రాజు దర్శకత్వంలో దయా వన్నెం, వీజీ సుబ్రహ్మణ్యన్‌లతో కలసి సందీప్ కిషన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేను’. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మ్ంట్స్ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు. ► నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టం, కానీ ఎప్పుడూ నటిస్తాను అనుకోలేదు. ఆ సినిమాల్లో నటించటం ఇష్టం ఉండదు కూడా. అయితే ఈ సినిమా కథలో హారర్‌ను మించి చాలా ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్ల చేయాలనుకున్నాను. అయితే కామెడీ కోసం కామెడీ అన్నట్లు ఉండదు. హారర్ అనేది యూనివర్శల్ జానర్. ► ఈ చిత్రంతో నేను పర్సనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా కథ 2043లో ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి 2017కు వస్తుంది. అలా ఫ్యూచర్‌కు, ప్రజెంట్‌కు మారుతూ ఉంటుంది. హారర్‌ను దాటి ఒక ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది. ► గత రెండేళ్లలో నేను నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. అందుకే ఈ రెండేళ్లలో నన్ను నేను స్క్రీన్ మీద ఒక్కసారి కూడా చూసుకోలేదు. ఆఖరు సారిగా నన్ను నేను చూసుకొంది ‘నక్షత్రం’ సినిమాలో. ఈ శుక్రవారం చాలా హ్యాపీగా థియేటర్‌కి వెళ్లి నన్ను నేను చూసుకుంటాను. ఈ సినిమాకి మొదటి నుండి ఓ ప్లానింగ్ ప్రకారం అన్ని పనులు దగ్గరుండి నేనే చూసుకున్నాను. ఫస్ట్ టీజర్ బావుండాలి, తర్వాత టీజర్ కంటే ట్రైలర్ బావుండాలి, ఫైనల్‌గా ఈ రెంటికంటే సినిమా బావుండాలి. ఇదే నా ఫైనల్ ప్లాన్. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు ఎక్కడా అసంతృప్తితో వెళ్లకూడదు. ► మా దర్శకుడు కార్తీక్ రాజుకు 46ఏళ్లు. ‘ఒక్కడు’, ‘అంజి’, ‘సైనికుడు’ సినిమాలకు సీజీ వర్క్ చేసే టీమ్‌లో పనిచేశారు. నెలకు రెండున్నర లక్షల జీతం. అంత కంఫర్టబుల్ లైఫ్‌ను వదిలిపెట్టి ఆయన ఫ్యామిలీ దగ్గరకెళ్లి నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పి ఎనిమిదేళ్ల క్రితం ఆ ఉద్యోగం నుండి బయటకు వచ్చారు. ఆ కల ఏడు సంవత్సరాల తర్వాత పట్టాలెక్కి ఈ శుక్రవారం ‘నిను వీడని నీడను నేను’ సినిమాగా రిలీజవుతోంది. ► ఎండ్ ఆఫ్ ది డే ఏదొచ్చినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ నేనే. అందుకని ఎక్కువగా కల్పించుకుంటే ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటారు. ఇన్వాల్వ్ కాకపోతే ఏదన్నా నెగిటివ్ వస్తే ఆ నింద నాకే వస్తుంది. అందుకే నేనే నిర్మించాలని అన్నీ సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు నిర్మాణంలో నేను ఇన్వాల్వ్ అయి చేసిన 5 ప్రాజెక్టుల్లో 4 పాస్ అయ్యాను. ► మా అమ్మా,నాన్నలతో నా సినిమాల గురించి డిస్కస్ చేయను. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఒత్తిడి మామూలు వాళ్లకి అర్థం కావు. నేను తప్పు చేసినా మంచి చేసినా అది నేనే తీసుకొంటాను. సినిమా ఆడింది అంటే అది టీమ్ ఎఫర్ట్, ఆడలేదు అంటే నాదే తప్పు. నేను వర్క్ గురించి ఎవరితో అయినా డిస్కస్ చేస్తాను అంటే మా చెల్లెలు మౌనికాతోనే. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్‌లో అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా చేస్తోంది. తను చాలా తెలివైనది. అందుకే కథ గురించి ఆమెతో డిస్కస్ చేస్తాను. ► మనకు అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎవరికీ తెలియదు. ‘స్నేహగీతం’, ‘ప్రస్థానం’ సినిమాలు రిలీజయ్యాక సందీప్ అనే నటుడు ఒకడున్నాడు అని అందరికీ తెలిసింది. ► ‘ది ఫ్యామిలీ మ్యాన్’ బిగ్గెస్ట్ బడ్జెట్‌తో అమెజాన్‌కు ఓ వెబ్ సిరీస్ చేశాను. అందులో నేను కమాండో పాత్రలో నటించాను. హిందీలో తీసిన ఆ వెబ్ సిరీస్ తెలుగు, తమిళంలోనూ విడుదలవుతుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్.డి.కె దర్శకత్వం వహించారు. ► విలన్‌గా చేయాలనే ఆలోచన లేదు. దానివల్ల నాకు ఏ ఉపయోగం ఉండదు కూడా. సందీప్ కిషన్ ఎవరో దాదాపు 60 శాతం మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. దాన్ని 90 శాతం మందికి తెలిసేలా చేయాలనేది నా ఆశ. ప్రస్తుతం జి.నాగేశ్వర్ రెడ్డితో ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చేస్తున్నాను. ఇంకో 20 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది. ఇది మంచి హ్యూమరస్ స్టోరీ. -
మిమ్మల్ని భయపెట్టిన సంఘటనలున్నాయా!
సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలో రిలీజ్ రెడీ అవుతున్న సందీప్ కిషన్ సినిమా నిను వీడని నీడను నేనే. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. మీ జీవితంలో మీకు ఎదురైన భయానక సంఘటనలను సెల్పీ వీడియో రూపంలో పంపాలని కోరారు. అలా పంపిన వారిలో కొందరికి నిను వీడని నీడను నేను సినిమా ప్రీమియర్ షో టికెట్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ను కలిసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. జూలై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
నా పని అయిపోయిందన్నారు
‘‘అందరూ నన్ను నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక నటుడికి అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం’’ అని సందీప్ కిషన్ అన్నారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు కిరణ్, అనిల్ సుంకర విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘బ్రెయిన్ రీ ఫ్రెష్ కోసం విదేశాలకు వెళ్లి వచ్చా. ఇక్కడికొచ్చేటైమ్‌కి బాగా లావయ్యాను. బరువు తగ్గి సినిమాలు చేద్దామనుకునేటప్పటికి... మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తి కలిశారు. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... ‘ఇంకెక్కడి సందీప్.. అయిపోయాడు. కొత్త హీరోలు వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు’ అన్నారట. ఆ మాట చెప్పిన వ్యక్తికి థ్యాంక్స్.. ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్లే ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ఓ కసితో ‘నిను వీడని నీడని నేనే’ సినిమా చేశా. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తాం’’ అన్నారు. ‘‘కథ విని, నేనే ప్రొడ్యూస్ చేస్తానని సందీప్ చెప్పడం నాకు సర్ ప్రైజ్’’ అన్నారు కార్తీక్ రాజు. దయా పన్నెం. సహనిర్మాత సుప్రియ, అన్య సింగ్, మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అతడికే ఈ సినిమా అంకితం’
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాము. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాము. హిట్ కొట్టాలని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా... నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి... తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
భయానికి మించి.. నిను వీడని నీడను నేనే
మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఎమోషనల్ హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. సందీప్ కిషన్ అద్ధంలో చూసుకుంటే ప్రతిబింబంలో వెన్నెల కిశోర్ కనిపిస్తాడు. అలా కనిపించడానికి కారణం ఏంటి. ట్రైలర్లో కనిపించే ఆ భయానక రూపాలేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. జూలై 12న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
అతడి కోసం నటులుగా మారిన దర్శకులు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిషన్‌కి మంచి మిత్రులు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు. ఇటీవలే నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్ ‘నిను వీడని నీడను నేనే' విడుదలచేశారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ 'ఎక్స్క్యూజ్ మీ రాక్షసి ...'ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. -
ఎక్స్క్యూజ్ మీ రాక్షసి..
... అని సందీప్ కిషన్ హీరోయిన్ను బుజ్జగిస్తుంటే.. హీరో సిద్ధార్థ్ కొంచెం పాట సాయం చేశారు. సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిల్ సుంకర సమర్పకులు. దయా మన్నెం, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘ఎక్స్క్యూజ్ మీ రాక్షసి..’ అంటూ సాగే ఓ పాటను సిద్ధార్థ్ ఆలపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంతో తెలుగు మరింత తీయగా ఉంటుంది. నటుడిగా నాకు గుర్తింపు, స్టార్డమ్ ఇచ్చింది తెలుగు సినిమానే. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రత్యేకాభిమానం. సందీప్ కిషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ పాట పాడాను’’ అన్నారు. ‘‘ఇదో ఫన్ ఎనర్జిటిక్ సాంగ్. సిద్ధార్థ్గారి వాయిస్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. యాక్టర్‌గా నా తొలిరోజుల్లో చాలా సపోర్ట్ చేశారు. నా నిర్మాణంలో వస్తున్న ఫస్ట్ సినిమాకి తనతో అసోసియేట్ అవ్వడం సంతోషం’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘సిద్ధార్థ్ నిర్మించిన తొలి సినిమాకు, సందీప్ నిర్మిస్తున్న తొలి సినిమాకు నేనే సంగీతం దర్శకుడిని కావడం విశేషం. ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అన్నారు తమన్. ‘‘పాట రాస్తున్నప్పుడే సిద్ధార్థ్‌గారు పాడితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ రాశాను. ఆయన పాడిన ప్రతి పాట బ్లాక్‌బస్టర్. ఈ పాట కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రచయిత సామ్రాట్. -
‘ఎక్స్క్యూజ్ మీ రాక్షసి...’ అంటోన్న సిద్ధార్థ్!
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సిద్ధార్థ్. కేవలం నటుడిగానే కాదు గాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బొమ్మరిల్లు, ఓయ్, ఆట సినిమాల్లో పాటలు పాడిన సిద్ధార్థ్ చాలా కాలం తరువాత మరో తెలుగు పాట పాడారు. అయితే గతంలో తన సినిమాల్లో మాత్రమే పాటలు పాడిన ఈ హీరో ఇప్పుడు మరో హీరో కోసం గాయకుడిగా మారాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్క్యూజ్ మీ రాక్షసి ...’ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది. నటుడిగా నాకు గుర్తింపు, గౌరవం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమాయే. తెలుగు పరిశ్రమ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా... నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నాకు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నా తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలో తను ఏదో రకంగా అసోసియేట్ అయితే బావుంటుందని అనిపించింది. అలాగే, సిద్ధార్థ్ వాయిస్‌కి, ‘అప్పుడో ఇప్పుడో..’ పాటకు, ‘176 బీచ్ హౌస్ లో’ పాటకు నేను పెద్ద అభిమానిని. నిర్మాతగా నా మొదటి సినిమాలో సిద్ధార్థ్ గొంతులో నా పాట రావడం అనేది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్.నటుడిగా నాకు మొదటి నుంచి ఎవరెవరు అయితే అండగా నిలిచారో.. వారందరూ ఏదో రకంగా చిన్న భాగంగా అయినా ఉండాలని కోరుకున్నాను. అది ఇలా అయినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా ‘లవ్ ఫెయిల్యూర్’కి... సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నేను సంగీత దర్శకుడు కావడం యాదృచ్చికమే. నాకు ఇది సంతోషంగా ఉంది. ఇద్దరూ నాకు మంచి స్నేహితులు’ అన్నారు. పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ ‘ఈ లిరిక్స్ రాసేటప్పుడు ఈ పాట సిద్ధార్థ్ గారు పాడితే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తూ, ఆయన్ను మనసులో పెట్టుకుని రాశాను. ఏయే తెలుగు పదాలు ఆయన వాయిస్ లో బావుంటాయని ఆలోచించి రాశా. ఇప్పటివరకూ సిద్ధార్థ్ పాడిన ప్రతి తెలుగు పాట బ్లాక్ బస్టర్. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. -
యాక్టర్‌గా మారిన డైరెక్టర్
సాధారణంగా యాక్టర్స్ డైరెక్టర్స్‌గా మారడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. కానీ అప్పుడప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్‌గా మారతారు. ఇప్పుడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రంతో యాక్టర్‌గా మారారు. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 2015లో సందీప్‌కిషన్ హీరోగా వచ్చిన ‘టైగర్’ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడి వీఐ ఆనంద్ ‘డిస్కోరాజా’ అనే చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ హీరో. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
నిను వీడను
‘‘మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ, తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు? ఎలా సక్సెస్ అయ్యాడు?’’ అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నాం. సందీప్ కిషన్ తొలిసారి నటిస్తోన్న హారర్ చిత్రమిది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం’’అన్నారు. ‘‘సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం కార్తీక్ పూర్తి చేస్తున్నారు. ఫిబ్రవరిలో మా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని దయా పన్నెం అన్నారు. పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివా చెర్రీ, సీతారాం, కిరుబాకరన్, కెమెరా: పమ్రోద్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.తమన్.