బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’ | Ninu Veedani Needanu Nene Bollywood Remake | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

Jul 16 2019 12:31 PM | Updated on Sep 15 2019 12:38 PM

Ninu Veedani Needanu Nene Bollywood Remake - Sakshi

యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ స్వయంగా నిర్మించి నటించిన సినిమా నిను వీడని నీడను నేనే. చాలా రోజులుగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరోకు నిను వీడని నీడను నేనేతో బిగ్ హిట్ వచ్చింది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ రావటంతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో స్త్రీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, షోర్‌ చిత్ర దర్శకులు నిను వీడని నీడను నేనే చిత్ర రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత హీరో సందీప్‌ కిషన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా మార్గదర్శకులు, సోదరులు అయిన రాజ్‌, డీకేలు నా సినిమా రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. నా సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement