అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్ | Sindeep Kishan Shares Emotional Message | Sakshi
Sakshi News home page

అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్

Published Sat, Jul 13 2019 1:00 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Sindeep Kishan Shares Emotional Message - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ మూవీ నిను వీడని నీడను నేనే. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా నిర్మాతగానూ తన అధృష్టాన్ని పరీక్షించుకున్న సందీప్‌ కిషన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. తాజాగా తనకు వచ్చిన ఓ మేసేజ్‌ను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు సందీప్‌.

ఈ రోజు ఉదయం ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చేసేందుకు వెళ్లిన సందీప్‌ కిషన్‌ తండ్రి ఫస్ట్ హాఫ్ పూర్తయన వెంటనే పుత్రోత్సాహంతో సందీప్‌కి మెసేజ్‌ చేశాడు. ‘మార్నింగ్‌ షోకు థియేటర్‌ 90 శాతం నిండింది. ఫస్ట్ హాప్ సూపర్‌’ అంటూ మెసేజ్ చేశాడు. ఈ సంభాషణ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన సందీప్‌ ‘మీ తల్లిదండ్రుల నవ్వుకు మీరు కారణమవ్వటమే నిజమైన ఆనందం. ఈ మెసేజ్‌ చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.
(మూవీ రివ్యూ : ‘నిను వీడని నీడను నేనే’)



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement