
‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి విజయం సాధించిన సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’. ఈ సినిమాలో సందీప్ కేసులు రాక ఇబ్బందులు పడే లాయర్ పాత్రలో అలరించనున్నాడు. సందీప్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తుండగా మురళీ శర్మ, కిన్నెరలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజసింహా కథ అందించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌కు ఇది 75వ సినిమా కావటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment