మరో రెండు! | Ninu Veedani Needanu Nene And Jersey Movies Remake In Hindi | Sakshi
Sakshi News home page

మరో రెండు!

Jul 17 2019 8:37 AM | Updated on Jul 17 2019 8:37 AM

Ninu Veedani Needanu Nene And Jersey Movies Remake In Hindi - Sakshi

బాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీమేక్‌ల హవా ఇంకా కొనసాగేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి నాని నటించిన ‘జెర్సీ’, సందీప్‌కిషన్‌ తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాలు చేరాయి. ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటరై్టన్మెంట్స్‌తో కలిసి నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు హిందీలో రీమేక్‌ చేస్తారని సమాచారం. అలాగే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం హిందీ రీమేక్స్‌ రైట్స్‌ను దర్శకుడు రాజ్‌ అండ్‌ డీకే దక్కించుకున్నారు. తెలుగులో ‘డి’ ఫర్‌ దోపిడి, హిందీలో షోర్‌ ఇన్‌ ది సిటీ, హ్యాపీ ఎండింగ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వంలో వహించారు. అలాగే నిర్మాతలుగా గత ఏడాది రాజ్, డీకే తీసిన ‘స్త్రీ’ భారీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తెలుగు హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఓ బేబి’, ‘హుషారు’ హిందీలో రీమేక్‌ కాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ‘టెంపర్‌’ (హిందీలో ‘సింబ’), ‘అర్జున్‌రెడ్డి’ (హిందీలో ‘కబీర్‌సింగ్‌’) చిత్రాలు హిందీలో రీమేక్‌ అయి, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement